Cinema

Wednesday, June 22, 2016 - 20:51

 సినీ నటుడు జేవీ రమణమూర్తి (83) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. బుధవారం స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జేవీ రమణమూర్తి దివంగత నటుడు శంకరాభరణం జేవీ సోమయాజులుకు సోదరుడు. కెరీర్ లో ఆయన 150 చిత్రాల్లో నటించారు.
1933 మే 20న విజయనగరంలో ఆయన జన్మించారు. 1957లో 'ఎమ్మెల్యే' చిత్రం ద్వారా ఆయన చిత్ర రంగప్రవేశం చేశారు....

Tuesday, June 21, 2016 - 21:36

ముంబై : బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సుల్తాన్‌ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా రెజ్లర్‌ అనుభవం గురించి చెబుతూ- రింగ్‌ నుంచి బయటకు రాగానే రేప్‌కు గురైన మహిళల్లా ఫీలయ్యానంటూ వ్యాఖ్యానించాడు. సల్మాన్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారం రేగుతోంది. సల్మాన్‌ తరపున ఆయన తండ్రి సలీం సారీ చెప్పాడు. బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్‌ఖాన్ మ...

Tuesday, June 21, 2016 - 14:17

ముంబై : ఆయనో ప్రముఖ నటుడు..ఏది మాట్లాడినా..ఏ పని చేసిన జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కానీ బాలీవుడ్ కండల వీరుడు మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళితే..సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' చిత్రంలో నటిస్తున్నాడు. త‌న తాజా చిత్రం 'సుల్తాన్‌'...

Tuesday, June 21, 2016 - 09:54

ముంబై : బాలీవుడ్‌ హీరో హృతిక్‌రోషన్‌ నటిస్తున్న 'మొహంజోదారో ' మూవీ ట్రైలర్‌ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఆశుతోష్ గోవర్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచానాలే ఉన్నాయి. తాజాగా ట్రైలర్‌తో హైప్‌ మరింత పెరిగింది. ఇక ట్రైలర్‌లోని సన్నివేశాలు చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఓ సన్నివేశంలో హృతిక్,పూజాహెగ్డేని లిప్‌లాక్‌ చేశాడు. రెండోసారి...

Monday, June 20, 2016 - 13:15

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరోయిన్ నిహారిక ఇండస్ట్రీపై బాంబు పేల్చే కామెంట్ చేశారు. ఈ నెల 24వ తేదీన నిహారిక నటించిన 'ఒక మనసు' విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో మెగా డాటర్ చేసిన కామెంట్ ఇండస్ట్రీలో ఒక వర్గానికి గట్టిగా గుచ్చుకున్నాయి.

అసలు విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలో లో అమ్మాయిలకు ఫ్రీడమ్ ఉండదని నిహారిక కామెంట్ చేశారు. మగవాళ్లు...

Sunday, June 19, 2016 - 20:20

బాహుబలి..ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపెట్టింది. రాజమౌళి నిర్మించిన ఈ బాహుబలి అన్ని బాషల్లో రిలీజై రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం బాహుబలి -2 షూటింగ్ లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ చేశారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. రక్తపు...

Sunday, June 19, 2016 - 20:07

కొత్త సినిమా పాటలు వచ్చాయంటే కనీసం ఇద్దరు ముగ్గురు గాయకులు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. అంతగా పరిశ్రమలో కొత్త గాయకుల రక్తం ప్రవహిస్తోంది. ఇంతటి పోటీలోనూ కొందరు గాయనీమణులు తమదైన శైలిలో ముందుకు సాగిపోతున్నారు. అందులో రమ్య బెహరా ఒకరు. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎం. ఎం. కీరవాణి రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం...

Sunday, June 19, 2016 - 19:46

'వేణువై వచ్చాను భువనానికి' అనే ఈ పాట 1993 లో వచ్చిన 'మాతృదేవోభవ' అనే చిత్రంలోనిది. వేదాంత ధోరణిలో సాగే ఈ పాటని వేటూరి సుందరరామ్మూర్తి గారు అత్యద్భుతంగా రచించారు. ఈ పాటను చిత్ర పాడారు. చిత్ర అంటే తనకెంతో ఇష్టమని టెన్ టివితో రమ్య బెహరా పేర్కొన్నారు. చిత్రతో షో చేయడానికి కువైట్ వెళ్లడం జరిగిందని, ఆమెను సమీపం నుండి చూడడం జరిగిందన్నారు. ఆమె పాడిన వేణువై వచ్చిన భువనానికి పాట అంటే...

Sunday, June 19, 2016 - 19:12

రమ్య బెహరా..అతి తక్కువ కాలంలో మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. తన పాటతో శ్రోతలను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా టెన్ టివి రమ్య బెహరాతో ముచ్చటించింది. తనకు డాడి సెంటర్ ఆఫ్ యూనివర్స్ అని పేర్కొన్నారు. డాడీ అన్నింటికంటే ఎక్కువ అని, మాటల్లో చెప్పలేనన్నారు. తాను ఇంట్లో విశ్వరూపం చూపిస్తానని, అన్నీ నాన్న భరిస్తారన్నారు. అమ్మ..డాడీ తనకు ఇద్దరూ క్లోజ్ అని,...

Sunday, June 19, 2016 - 19:08

తెలుగు సినీ హాస్య రచయితల్లో ఆయనొక మహోత్తుంగ తరంగం..హాస్య చిత్రాల దర్శకత్వంలో ఆయనొక మేరువు..తెలుగు సినీవినీలాకాశంలో ఆయనొక ధ్రువతార. ఆరోగ్యకరమైన హాస్యంతో ఎన్నో దశాబ్దాల కాలంపాటు తెలుగు ప్రేక్షకుల పొట్టల్ని చెక్కలు చేసిన నవ్వుల యోగి ఆయన. వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి అన్న తన వంటి పేరుతో ఎవరికీ తెలికయకపోయినా జంధ్యాల అనే తన ఇంటి పేరుతో లక్షలాదిమంది తెలుగు వాళ్లకి...

Sunday, June 19, 2016 - 11:24

ప్రస్తుత చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ హవా నడుస్తోంది. గతంలో ఐటెమ్ సాంగ్స్ లో కథానాయిక కాకుండా వేరే హీరోయిన్ నటించేవారు..కానీ ప్రస్తుతం ఐటెమ్ సాంగ్స్ లో కథానాయికనే నటిస్తోంది. ఆ పాటలు, డ్యాన్స్ హిట్ అవుతుంది కూడా. ఇప్పుడొచ్చే ప్రతి సినిమాలో దాదాపు ఐటెమ్ సాంగ్ తప్పనిసరిగా ఉంటుంది. బాలీవుడ్ మొదలుకొని.. టాలీవుడ్ వరకు టాప్ హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ లో నటించేందుకు సుముఖత వ్యక్తం...

Sunday, June 19, 2016 - 11:07

పవన్‌కళ్యాణ్‌, శ్రుతిహాసన్‌ హీరోహీరోయిన్స్ గా ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఫ్యాక్షనిస్ట్ లీడర్‌ ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈచిత్రంలో ప్రతినాయకుడిగా అజయ్ ముఖ్య భూమికను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈచిత్రాన్ని నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్‌ నిర్మిస్తున్నారు. జులై నుంచి షూటింగ్‌ జరుగనుంది. ఈ చిత్ర ప్రారంభ సమయంలో 'సేనాపతి...

Sunday, June 19, 2016 - 07:58

ముంబై : కోట్లాది రూపాయల మాదకద్రవ్యాల పట్టివేత కేసులో బాలీవుడ్‌ నటి మమతా కులకర్ణి మెడచుట్టూ ఉచ్చు  బిగుసుకుంటోంది. ముంబై శివారు పట్టణం థానేలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్‌లో మమతా కులకర్ణి, ఆమె భర్త విక్కీ గోస్వామికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియాతో సంబంధం ఉన్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల విచారణలో మమతా కులకర్ణి...

Saturday, June 18, 2016 - 20:05

సింగర్, ర్యాపర్ స్టార్ , యాక్టర్, అమేజింగ్ డాన్సర్ అయిన నోయిల్ తో టెన్ టీవీ స్పెషల్ చిట్ చాట్ .. నోయిల్ బైటకు వెళితే అమ్మాయిలు విపరీతంగా కొడుతున్నారంట?!...ఎందుకోమరి...తనకునెగిటివ్ రోల్స్ అంటేనే ఇష్టమని నోయిల్ అంటున్నాడు..ఎందుకో... నోయిల్ షూటింగ్ కి అమెరికా వెళ్లినప్పుడు ఫోన్ మాట్లాడుతూ...అనుకోకుండా ఓ బటన్ ప్రెస్ చేసేశాడట...ఇంకేముంది...ఆ హోటల్ లో వున్నవారంతా బయటకు వచ్చేశారు...

Saturday, June 18, 2016 - 14:39

హైదరాబాద్‌ : పహాడిషరీఫ్‌లోని జల్‌పల్లి వద్ద సినీ నటుడు మంచు విష్ణు భార్య కారుకు ఆక్సిడెంట్ అయింది.. ప్రమాదంలో విష్ణు భార్యకు స్వల్ప గాయాలవ్వగా ఆస్పత్రికి తరలించారు. హారన్ కొట్టకుండా విష్ణు భార్య వేగంగా వచ్చి తమ కారును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని మరో కారు యాజమాని బంధువులు ఆరోపిస్తున్నారు.

Saturday, June 18, 2016 - 11:28

హైదరాబాద్ : నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సినీ నటి విజయశాంతి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఎమ్మెల్యే కాలనీలోని విజయశాంతి ఇంట్లో రాత్రి దోంగలు చోరబడి డైమండ్ చెవిదుద్దులు, నగలు, నగదు ఎత్తుకెళ్లారు. వెంటనే బంజారాహిల్స్ పీఎస్ లో విజయశాంతి సోదరుడు ప్రసాదు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు...

Saturday, June 18, 2016 - 08:12

సినీనటి ఇలియానా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వనుంది. తనకు టాలీవుడ్‌ అంటే ఇష్టమని, మళ్లీ ఇక్కడి సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది ఇల్లీ బేబీ. దేవదాసు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా, ఆ తర్వాత మరెన్నో చిత్రాల్లో అగ్రహీరోల సరసన నటించి, మెప్పించింది. 2012లో 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి, అక్కడే అడపాదడపా సినిమాల్లో నటిస్తూ తెలుగు సినిమాలకు దూరమైపోయింది. ...

Saturday, June 18, 2016 - 08:11

ఉపేంద్ర, సలోని, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్లుగా 'బ్రాహ్మణ' చిత్రం రానుంది. శ్రీనివాస్‌ రాజు డైరెక్షన్ లో వచ్చిన కన్నడ చిత్రం 'శివం' ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని విజరు.ఎమ్‌, గుర్రం మహేష్‌ చౌదరి సంయుక్తంగా 'బ్రాహ్మణ' పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. సి.ఆర్‌.మనోహర్‌ సమర్పణలో విజి చెరిష్‌ విజన్స్, శ్రీ తారకరామ పిక్చర్స్ బ్యానర్స్ పై సినిమా రూపొందనుంది. గురువారం...

Saturday, June 18, 2016 - 08:08

బాలీవుడ్ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ చిత్రానికి రచయిత కోనవెంకట్‌ కథ అందిస్తున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోన వెంకట్‌ మాట్లాడుతూ.. 'ఇదొక కొత్త కథ. అభిషేక్‌కి చాలా బాగా నచ్చి, ఈ చిత్రాన్ని తానే నిర్మించడం ఆనందంగా ఉంది' అని తెలిపారు. శ్రీదేవి ప్రధాన పాత్రధారిణిగా నటిస్తున్న 'మామ్‌' చిత్రానికి కూడా...

Friday, June 17, 2016 - 20:08

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాళ్లు ముభావంగా ఉంటే చూడలేం. తెరపైనా అంతే...అమాయకపు క్యారెక్టర్లతో, హాస్యంతో ఆకట్టుకునే కథానాయకులను అలాగే చూడలనుకుంటాం. భిన్నంగా కనిపిస్తే...ఒంటబట్టించుకునేందుకు కొంతం...

Friday, June 17, 2016 - 10:41

నానీ..టాలీవుడ్ లో వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ముందుకెళుతున్నాడు. 'అలా మొదలైంది' సినిమా తరువాత నానికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా 'భలే భలే మొగడివాయ్'. అనంతరం 'జెంటిల్ మెన్' తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ చిత్రంలో రెండు షేడ్స్ తో నటించాడు. విలన్ ? హీరో ? అని ప్రశ్నించారు. దీనితో ఈ సినిమాలో నాని విలన్ ? హీరో ? అనే ప్రశ్నలు ఉదయించాయి. ఈ నేపథ్యంలో నానితో టెన్ టివి...

Friday, June 17, 2016 - 09:35

ఏంటీ అప్పటి హీరో రాజశేఖర్ తో ఇప్పటి హీరో గోపించంద్ కు సమస్యలా ? ఎలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు ? ఇలా అనేక ప్రశ్నలు ఉదయించవచ్చు. కానీ ఇవన్నీ నిజ జీవితంలో కాదు. సినిమాలో అవును గోపిచంద్ నటించబోయే చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నటించే అవకాశాలున్నాయని కథనాలు వెలువడుతున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోవడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే...

Friday, June 17, 2016 - 09:26

సూపర్ రజనీకాంత్ ఆరోగ్యానికి ఏమైంది ? అమెరికాలో ఎన్ని రోజులు ఉంటారు ? అక్కడ ఎలాంటి చికిత్స చేయించుకుంటున్నారు ? ఇలా అనేక ప్రశ్నలపై చర్చ జరుగుతోంది. కుటుంబసభ్యులతో అమెరికా వెళ్లిన రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారని..అందుకే కబాలి ఆడియో సాదాసీదగా జరిపించారనే పుకార్లు వినిపించని సంగతి తెలిసిందే. దీనిపై రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. చివరకు కుటుంబసభ్యులు స్పందించారు...

Friday, June 17, 2016 - 09:16

సుహాసిని ప్రధాన పాత్రధారిణిగా సుమంత్‌ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న 'నాని' చిత్రాన్ని భీమవరం టాకీస్‌ పతాకంపై టి.రామసత్యనారాయణ 'శివగామి' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ బుధవారం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్‌ మోషన్‌ పోస్టర్‌ను, వెంకట్రావు థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత...

Friday, June 17, 2016 - 09:14

బిపిన్‌ హీరోగా నటిస్తూ శిరిడి సాయి క్రియేషన్స్‌ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'బంగారు తెలంగాణ'. శ్రీహర్ష, లయన్‌ ఏ.వి.స్వామి, కోదండరామ్‌, బాబూ మోహన్‌, గౌతంరాజు, గుండు హనుమంతరావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ, 'బిపిన్‌...

Friday, June 17, 2016 - 09:08

వరుణ్‌ తేజ్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. గతేడాది విడుదలైన మలయాళ చిత్రం 'ప్రేమమ్‌'తో ప్రేక్షకులను అలరించిన కథానాయిక సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, 'అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథ నేపథ్యంలో మా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ...

Friday, June 17, 2016 - 09:07

ప్రస్తుతం కబాలీ ఫీవర్ నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే టీజర్ విడుదలై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఆడియో కూడా విడుదలైంది. నిరండబరంగా ఈ ఆడియో ఫంక్షన్ జరగడంపై అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉంటే 'కబాలి' సినిమాలోని తమిళ సాంగ్ టీజర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. '...

Pages

Don't Miss