Cinema

Saturday, May 28, 2016 - 19:19

టాలెంటెడ్ నటిగానే కాకుండా ప్రముఖ టీవీ ఛానల్స్ లో యాంకర్ గా శ్రీముఖి ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈమె పలు చిత్రాల్లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో 'శ్రీముఖి' టెన్ టివితో తో ముచ్చటించింది. ఈ సందర్భంగా గెటప్ శ్రీను కాల్ చేసి 'శ్రీముఖి'ని కొద్దిసేపు ఆటపట్టించాడు. ఎలా ఆటపట్టించాడో ? తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

Saturday, May 28, 2016 - 17:44

పండంటి కాపురం చిత్రం చూసి కృష్ణ గారి అభిమాని అయ్యానని, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కృష్ణ గార్ని డైరెక్ట్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నానని డైరెక్టర్ ముప్పలనేని శివ పేర్కొన్నారు. కృష్ణతో పాటు విజయ నిర్మల, సీనియర్ నరేష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 3వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ముప్పలనేని శివతో టెన్ టివి ముచ్చటించింది. ఆయన ఎలాంటి విశేషాలు...

Saturday, May 28, 2016 - 17:32

హైదరాబాద్ : ఈనెల 31వ తేదీన టోబాకో డే సందర్భంగా ఒమెగా హాస్పిటల్స్ సహకారంతో రెడియో మిర్చి 'ధూమపానం మానండి' అనే ప్రచార కార్యక్రమం చేపట్టింది. సినీ నటి రాశీఖన్నా మాదాపూర్ లోని ఇనార్బిట్ మాల్ లో సందడి చేశారు. 'ధూమపానం మానండి' ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాశీఖన్నా ధూమపానానికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారానికి తన మద్దతు ప్రకటిస్తూ...

Saturday, May 28, 2016 - 16:20

ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్ళు రాబట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్‌ చేస్తున్నారు. నాగార్జున పాత్రలో ఉపేంద్ర హీరోగా నటించబోతున్నారట. అంతేకాదు ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహించాలని ఉపేంద్ర భావిస్తున్నారని...

Saturday, May 28, 2016 - 16:17

సినిమాలోని పాత్రలకు అనుగుణంగా కథానాయకులైనా సరే మారిపోవాల్సిందే. ఆయా పాత్రలకు అనుగుణంగా రూపు రేఖల్ని మార్చుకోక తప్పదు. ఇక స్టార్‌ హీరోలైతే పాత్రల కోసమే కాదు అభిమానుల కోసం కూడా మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈ తీరులోనే ప్రస్తుతం రామ్‌చరణ్‌ తెగ కష్టపడుతున్నారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్ర కావడంతో దానికి తగ్గట్టుగా ప్రిపేర్‌ అవుతున్నారు. అలాగే స్ట్రిక్ట్‌గా డైట్‌ రూల్స్‌ని ఫాలో...

Saturday, May 28, 2016 - 16:16

పక్కా కమర్షియల్‌ చిత్రాల దర్శకుడిగా టాలీవుడ్‌లో బోయపాటి శ్రీనుకి మంచి గుర్తింపు ఉంది. 'భద్ర', 'తులసి', 'లెజెండ్‌', 'దమ్ము', 'సరైనోడు' వంటి తదితర చిత్రాల్లో మాస్‌ ఎలిమెంట్స్‌ని బోయ పాటి ఎలివేట్‌ చేసినట్టు ఇక ఏ దర్శకుడూ చేయలేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా అల్లు అర్జున్‌తో రూపొందించిన 'సరైనోడు' చిత్రంలో కూడా మాస్‌ ప్రేక్షకులకు డబుల్‌ కిక్‌ ఇచ్చారు బోయపాటి. 'సరైనోడు' తర్వాత...

Saturday, May 28, 2016 - 16:14

తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్న సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందేందుకు రంగం సిద్ధమవుతోంది. 'ఎవడే సుబ్రమణ్యం' చిత్ర దర్శకుడు నాగ్‌అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ, 'తెలుగు సినిమా చరిత్రలో సావిత్రిగారిది స్వర్ణయుగం. ఇన్నేళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఒక్క...

Saturday, May 28, 2016 - 15:33

ఆయనంటే సాహసం..ఆయనంటే మొండితనం..ఆయనంటే ప్రయోగం...ఏటికి ఎదురీదే మనస్తత్వం..కొత్తదనం కోసం ఆరాటం..ఈ ఛాలెంజింగ్ నేచరే ఆయన్ను హిస్టరీ లో నిలిచేలా చేసాయి..తెలుగుతెరమీద విశ్వవిఖ్యాత నట సార్వభౌముని చేసాయి..హీరోగా , నిర్మాతగా, దర్శకుడిగా ఇలా.. అన్నిటిలోనూ ముక్కుసూటి ధోరణిలో ఆయన సాగించిన ప్రయాణాలు అనన్య సామాన్యం. కోట్లాది మంది అభిమానులు చేత అన్న అని పిలుచుకొనే ఆ తారక రాముడు నందమూరి...

Friday, May 27, 2016 - 21:08

'అ..ఆ' మూవీ టీమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా హీరో నితిన్, హీరోయిన్ సమంత, నటీ నదియాలు సినిమా విశేషాలను తెలిపారు. వారు తమ సినిమా అనుభవాలను వివరించారు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

 

Friday, May 27, 2016 - 16:01

హైదరాబాద్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ.. ఆ మూవీ పాటల టీజర్లు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించగా... మిక్కీ జే మేయర్‌ సంగీతం సమకూర్చారు.. జూన్‌ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది..

Thursday, May 26, 2016 - 14:29

దర్శకుడు ఆనంద్‌.ఎల్‌.రాయ్ కి బాలీవుడ్‌లో ఓ ప్రత్యేక ఇమేజ్‌ ఉంది. ఆయన చిత్రాలు సహజత్వానికి చాలా దగ్గరగా నవ్యతతో ఉంటాయి. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'తను వెడ్స్ మను', 'తను వెడ్స్ మను రిటర్న్స్' చిత్రాలు బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేశాయి. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన పలు చిత్రాలను 'కలర్‌ ఎల్లో' బ్యానర్‌పై నిర్మించారు. ఆయన నిర్మాతగా తాజాగా 'హ్యాపీ భాగ్‌ జాయేగీ'...

Thursday, May 26, 2016 - 14:26

బాలీవుడ్‌ ఎవర్‌గ్రీన్‌ లవ్‌స్టోరీగా 'ఆషికీ' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే. దీనికి సీక్వెల్‌గా రూపొందిన 'ఆషికీ2' కూడా అదే స్థాయిలో ఘనవిజయం సాధించింది. తాజాగా దీనికి సీక్వెల్‌గా 'ఆషికీ3' చిత్రాన్ని నిర్మించేందుకు దర్శక, నిర్మాతలు మోహిత్‌ సూరి, ముఖేష్‌భట్‌, భూషణ్‌కుమార్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాయకానాయికలుగా సిద్ధార్థ్‌ మల్హోత్రా, అలియాభట్‌...

Thursday, May 26, 2016 - 14:04

హైదరాబాద్ : స్వర్గీయ ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించడం ఏంటీ ? రేపు ఆయన జయంతి కదా ? అని అంటే కరెక్టే. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు వీలు లేదంట..అందుకే ఈ రోజే నివాళి అర్పించాడంట.జూనియర్ ఎన్టీఆర్ నేటి ఉదయం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు. అక్కడక ఎన్టీఆర్ సమాధికి ఘనంగా నివాళులర్పించారు. ఈనెల 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరగనున్న సంగతి...

Thursday, May 26, 2016 - 12:37

బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మరింత ఊపందుకుంది. ఇప్పటికే ఇరవైకి పైగా బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే, మరో బయెపిక్‌ తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతోంది. ప్రముఖ పంజాబీ రచయిత్రి అమృతా ప్రీతమ్‌ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు దర్శక, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ సన్నాహాలు చేస్తున్నారు. అమృతా ప్రీతమ్‌ జీవితంలో రెండు ప్రేమకథలున్నాయి. 'రశీదీ టిక్కెట్‌' (రెవిన్యూ...

Thursday, May 26, 2016 - 10:08

'అ..ఆ..' చిత్రం ఆనందానుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది. పక్కన పక్కనే ఉండే రెండు ఆక్షరాలు పరిచయం కావడానికి పాతికేండ్లు పట్టింది. ఇంత టైమ్‌ ఎందుకు పట్టిందనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా మా చిత్రాన్ని చూడాల్సిందేన'ని అంటున్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు). నితిన్‌, సమంత, అనుపమా పరమేశ్వరన్‌ నాయకానాయికలుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌....

Thursday, May 26, 2016 - 10:01

మనోరమ... వెండితెర అమ్మగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రని వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అత్యధిక చిత్రాల్లో నటించిన మహిళా నటిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సొంతం చేసుకున్న ఘనత కూడా ఈమెదే. 'ఆచ్చి' అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మనోరమ జయంతి నేడు. మద్రాస్‌లోని తంజావూరు జిల్లా మన్నార్గుడిలో 1937లో జన్మించిన మనోరమ అసలు...

Wednesday, May 25, 2016 - 17:39

ముంబై : బాలీవుడ్‌ మూవీ సుల్తాన్‌ ట్రైలర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదల చేసిన పదకొండు గంటల్లోనే ఈ ట్రైలర్‌ను చూసినవారిసంఖ్య పదిలక్షలు దాటింది. హర్యానా రెజ్లర్‌ సుల్తాన్‌ అలీఖాన్‌ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కండలవీరుడు సల్మాన్‌ ఖాన్, అనుష్క శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్రైలర్‌లో వీరిద్దరి రెజ్లింగ్ పట్లు సినిమాపై ఆసక్తిని...

Wednesday, May 25, 2016 - 17:36

విశాఖ : సినీ నటి ముమైత్ ఖాన్ విశాఖ జిల్లాలో సందడి చేశారు. భీమిలి మండలం చిప్పాడ గ్రామదేవత శ్రీ సత్తమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాంలో స్టెప్పులేసి  కుర్రకారును ఉర్రూతలూగించారు. ఆమెను చూడ్డానికి పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. ముమైత్ ఖాన్‌తో పాటు ఆట ఫేం కొరియోగ్రాఫర్ మల్లేష్ కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముమైత్...

Wednesday, May 25, 2016 - 16:50

ఈ చిత్రంలో ఎవరో గుర్తు పట్టారా ? ఈ కన్నడ భామ టాలీవుడ్ లో గ్లామర్ పాత్రలు పోషించింది. ప్రభాస్ చిత్రంలో నటించింది..అంతేగాకుండా పవర్ స్టార్ చిత్రంలో ఓ స్పెషల్ పాత్రలో కూడా ఈ ముద్దుగుమ్మ కనిపించింది. ఈమెనే 'సంజన' అయ్యే అలా అయ్యిందేమిటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? 'దండుపాళ్యం' సినిమా గుర్తుంది కదా. విపరీతమైన హింసను చూపించిన ఈ సినిమా అంతేస్థాయిలో వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే....

Wednesday, May 25, 2016 - 16:21

ముంబై అకాడమీ ఆఫ్‌ ది మూవింగ్‌ ఇమేజెస్‌ (మామి) ఉత్సవాలు నేటి నుంచి నాలుగు రోజుల పాటు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 'మామి' ఫిల్మ్‌ క్లబ్‌ను బాలీవుడ్‌ తారలు మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బ్రిటీష్‌ నటుడు మెక్‌ కెల్లన్‌ ప్రత్యేక అతిథిగా హాజరై విలియమ్‌ షేక్‌స్పియర్‌ రచనలపై చర్చించారు. ఈ ఫిల్మ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నగరంలోని మూడు ప్రాంతాల్లో నేటి నుంచి...

Wednesday, May 25, 2016 - 16:19

సోఫియా హయత్.. ఎవరో అందరికీ తెలిసిందే కదా. బ్రిటీష్ మోడల్ అయినా సోఫియా సంచలన నిర్ణయం తీసుకుంది.
బిగ్ బాస్ 7 లో ఆర్మాన్ కోహ్లీతో గొడవపెట్టుకుని షో మధ్యలోనే వెళ్లిపోయింది. అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటరైంది. 2012లో మాజీ బాయ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ 264 పరుగులు చేసినప్పుడు..అతనికి బహుమతిగా తన నగ్న సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసి సంచలనం సృష్టించింది. అప్పుడలా చేసిన...

Wednesday, May 25, 2016 - 15:15

'అవకాశం వస్తే కచ్చితంగా బాండ్‌గర్ల్‌గా ప్రేక్షకులకు కనిపిస్తా' అని అంటోంది బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా. 'క్వాంటికో' టెలివిజన్‌ సిరీస్‌తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ప్రస్తుతం 'బేవాచ్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది. ఇందులో విలన్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఇదిలా ఉంటే, జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో భాగంగా రూపొందబోయే తదుపరి చిత్రంలో బాండ్‌ గర్ల్‌గా ప్రియాంకకు నటించే...

Wednesday, May 25, 2016 - 14:08

పలు తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయనతార ఇకపై నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయం కానుంది. మహిళా ప్రధానంగా సాగే ఓ కథను అగ్రదర్శకుడు ఏ.ఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు జగన్‌ ఇటీవల నయనతారకు వినిపించారు. కథ బాగా నచ్చడంతో ఈచిత్రాన్ని తానే సొంత బ్యానర్‌ని పెట్టి, నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నయనతార తెలిపింది. ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్ గా రూపొందే ఈచిత్రంలో నయనతార జిల్లా...

Wednesday, May 25, 2016 - 14:05

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా 'కబాలి' చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న విషయం విదితమే. జూలై 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత సూర్య హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు పా రంజిత్‌ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి రంజిత్‌ ఇప్పటికే సూర్యకి కథ కూడా వినిపించారట. రంజిత్‌ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు సూర్య సైతం గ్రీన్‌...

Wednesday, May 25, 2016 - 13:41

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు...ఎప్పుడు..అనే ఉత్కంఠకు కొద్ది రోజుల క్రితం తెరపడింది. మళ్లీ ఈ చిత్రం షూటింగ్..ఎప్పుడు..ఎప్పుడు అనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. దీనికి కూడా త్వరలో ఫుల్ స్టాప్ పడనుందట. వి.వి.వినాయక్‌ ఈ చిత్రానికి దర్శకుడు. విజయ్‌ కథానాయకుడిగా మురగదాస్‌ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'కత్తి' ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే....

Wednesday, May 25, 2016 - 13:18

'విశ్వరూపం', 'ఉత్తమ విలన్‌', 'చీకటిరాజ్యం' వంటి యాక్షన్‌ చిత్రాలలో నటించిన 'కమల్ హసన్' తాజాగా 'శభాష్‌నాయుడు' పేరు మీద ఓ చక్కటి హాస్యభరిత చిత్రాన్ని చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థతో కలసి రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ ఈ చిత్రాన్ని సొంతగా నిర్మిస్తుండగా, టీకే రాజీవ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలలో తెరకెక్కుతోదంట. తమిళనాడు ఎన్నికల...

Wednesday, May 25, 2016 - 11:46

ఏమాయ చేసావె' చిత్రం తర్వాత నాగచైతన్య, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో'. కోన వెంకట్‌ సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన 'చకోరి..' అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కోన వెంకట్‌ మాట్లాడుతూ, 'ఆస్కార్‌ గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం...

Pages

Don't Miss