Cinema

Wednesday, December 23, 2015 - 14:07

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'దిల్‌వాలే' చిత్రం భారీ కలెక్షన్ల దిశగా పయనిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 121కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారత్‌లో రూ.65కోట్లు కలెక్ట్‌ చేయగా, ఓవర్సీస్‌లో 56కోట్లను రాబట్టినట్లు చిత్ర బృందం తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించింది....

Tuesday, December 22, 2015 - 21:26

బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'జై గంగాజల్‌' చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ప్రియాంక తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ట్రైలర్‌ను విడుదల చేసింది. 2003లో అజయ్‌ దేవగన్ నటించిన గంగాజల్‌ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోంది. ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2016 మార్చ్‌4న విడుదల కానుంది. ఈ మూవీలో ప్రియాంక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది.

Tuesday, December 22, 2015 - 19:24

ఈ సంవత్సరం ఆల్ మోస్ట్ అయిపోతోంది.. ఈ ఇయర్ ఎన్నో సినిమాలొచ్చాయి. సినిమాలంటే హీరో..పాటలు.. ఫైటింగులు.. అనే బోరింగ్ డేస్ పోయాయి. ఓన్లీ గ్లామర్ డాల్ గా ఉన్న హీరోయిన్ ఇప్పుడు మెయిన్ రోల్ ప్లే చేస్తోంది. సినిమాల్లో తనకంటూ ఓ డిఫరెంట్ పాత్ క్రియేట్ చేసుకుంటోంది. అలా టాలీవుడ్ .. బాలీవుడ్ లో అలా తమ హవా నడిపించిన లేడీ ఓరియంటెడ్ అండ్ విమెన్ సెంట్రిక్ మూవీస్ పై కథనం. టాలీవుడ్ సినిమా...

Tuesday, December 22, 2015 - 15:21

విశాఖపట్టణం : ప్రముఖ తెలుగు సినీ, నాటక రచయిత చిలుకోటి కాశీ విశ్వనాథ్ (68) కన్నుమూశారు. సికింద్రాబాద్ నుండి విశాఖకు రైలులో వెళుతుండగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. వెంటనే విశ్వనాథ్ ను భౌతికకాయాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాదాపు ఆయన 70 చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు. దాసరి నారాయణరావు, విజయబాపినీడు, రేలింగి నరసింహరావు...

Tuesday, December 22, 2015 - 15:08

2015 సంవత్సరం.... టాలీవుడ్ లో చాలా మంది దర్శకులకి మరపురాని సంవత్సరమైంది. కొంత మంది దర్శకులకు లక్కీ ఇయర్ అయింది. ...కొత్త దానాన్ని కోరుకొనే ప్రేక్షకులకు .. సరికొత్త ట్రీట్ ఇవ్వాలనే తపన కలిగిన మరి కొంత మంది దర్శకులు .. టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం మీద 2015 చాలా మంది దర్శకుల దశని, దిశని మార్చేసింది. ఈ సంవత్సరం దుమ్ముదులిపిన టాలీవుడ్ దర్శకులపై 2015...

Tuesday, December 22, 2015 - 12:42

ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ నటించిన దిల్‌వాలే సినిమాకు 'అసహనం' సెగ తాకింది. ఇటీవల అసహనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో తాజాగా విడుదలైన 'దిల్‌వాలే' ప్రదర్శనను కర్నాటకలోని మంగళూరులో వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మంగళూరు, సమీప ప్రాంతాల్లో శనివారం నుండి చిత్ర ప్రదర్శన నిలిచిపోయింది. చిత్ర ప్రదర్శన నడుస్తున్న మంగళూరులోని మల్టీ...

Tuesday, December 22, 2015 - 12:40

మూకీ చిత్రంగా రూపొంది భారతీయ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం 'పుష్పక విమానం'. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా సీనియర్‌ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ప్రయోగాత్మక చిత్రమిది. 1987లో తెరకెక్కిన ఈ చిత్రం ఉత్తమ వినోదాత్మక చిత్రంగా జాతీయ అవార్డుతోపాటు, ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలోను, కేన్స్‌ చలన చిత్రోత్సవంలో కూడా ప్రదర్శితమై ప్రేక్షకుల్ని కడుపుబ్బ...

Tuesday, December 22, 2015 - 12:38

ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రధారిణిగా ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'జై గంగాజల్‌'. 'గంగాజల్‌' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 4న విడుదల చేస్తున్నట్టు బాలీవుడ్‌ చిత్రాల వాణిజ్య విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలియజేశారు. విడుదల తేదీని ప్రకటిస్తూ ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ని సైతం సోమవారం చిత్ర...

Tuesday, December 22, 2015 - 12:36

ప్రస్తుతం 'శౌర్య' చిత్రంలో నటిస్తున్న మంచు మనోజ్‌ తాజాగా ఎల్లో ప్లవర్స్‌ బ్యానర్‌పై రమేష్‌ పుప్పాల నిర్మాతగా నిర్మించే ఓ చిత్రంలో నటించడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. సాగర్‌ పసల దర్శకుడు. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనున్న నేపథ్యంలో నిర్మాత మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో ఇప్పటి వరకు 'మిరపకాయ్', 'శ్రీమన్నారాయణ', 'పైసా' వంటి డిఫరెంట్‌ చిత్రాలను నిర్మించాం. రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్...

Monday, December 21, 2015 - 14:39

కింగ్‌ఖాన్‌ పేరు మార్చేసుకుంటున్నాడు...క్యారెక్టరుకూ గుడ్‌బై చెప్పేస్తున్నాడు...రొటీన్‌గా వెళ్తే రీల్‌ రొటేట్ అవదనుకుంటున్నాడు. అందుకే రొటీన్‌కు భిన్నంగా నాన్‌స్టాప్‌గా ఉన్న పేరుకు ఫుల్‌స్టాప్ పెట్టేయాలని డిసైడయ్యాడు. 2016లో ప్రేక్షకులు కొత్త షారుక్‌ను చూస్తారంటున్నాడు. రాజ్‌ అంటే.. ప్రతీ దుల్హనియా ఇలాంటి దిల్‌వాలే కావాలనుకునే క్యారెక్టర్‌. షారుక్‌ అంటే రాహుల్‌, రాజ్‌....

Monday, December 21, 2015 - 10:48

హైదరాబాద్: జబర్దస్త్ ఫేం షేకింగ్ శేషుకు సినిమా షూటింగ్‌లో గాయాలైనట్లు సమాచారం. దిల్‌రాజు డైరెక్షన్‌లో నిర్మిస్తున్న సుప్రీం చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతోంది. ఛేసింగ్ సీన్ షూట్ చేస్తుండగా జిప్సీ వాహనం బోల్తా పడి శేషుకు గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం శేషు అమీర్‌పేటలోని ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.

Sunday, December 20, 2015 - 21:54

నవమన్మథుడు సినిమా హీరోహీరోయిన్స్ ధనుష్, సమంతలు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు ఆ సినిమాకు సంబంధించిన విషయాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, December 20, 2015 - 19:00

హైదరాబాద్ : ప్రముఖ నటుడు రంగనాథ్‌ అంత్యక్రియలు బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో ముగిశాయి. రంగనాథ్‌ బౌతికకాయానికి తనయుడు నాగేంద్ర చితిపెట్టారు. అంత్యక్రియలకు భారీగా అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ రంగనాథ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కడసారి కన్నీటి నివాళులర్పించారు. రంగనాథ్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
...

Sunday, December 20, 2015 - 13:43

రోబో, బాహుబలి. ప్రపంచవ్యాప్తంగా క్రేజీ క్రియేట్ చేసిన ఆ చిత్రాల సీక్వెల్స్...ఒకేసారి సెట్స్ మీదికి వెళ్లాయి. అంతేకాదు ఒకేసారి, ఒకే డేట్‌ లో విడుదలయ్యేందుకు పోటీపడుతున్నాయి. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు మేటి చిత్రాలు సీక్వెల్స్ సెట్స్ మీదికి వెళ్లాయి. ఒకే రోజు అటు చెన్నైలో రోబో టు పాయింట్ జీరో, ఇటు హైదరాబాద్‌ లో బాహుబలి కన్ క్లూజన్...

Sunday, December 20, 2015 - 13:23

హైదరాబాద్ : నట జీవితాన్ని గెలిచిన రంగనాథ్‌.. ఒంటరితనాన్ని ఓడించలేకపోయారు. జీవితంలో ఎదుర్కొన్న అనేక మలుపులతో.. చివరికి ఒంటరిగా మిగిలిన రంగనాథ్‌.. తనకు తానే ముగింపు పలికారు. తోడు లేక అల్లాడిపోయిన ఆ ప్రాణం అవసరం లేదనుకున్నారు. తన జీవితానికి క్లైమాక్స్‌ రాకముందే.. తానే సృష్టించుకుని.. తన కథకు క్లైమాక్స్‌ను తానే రచించుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రంగనాథ్...

Sunday, December 20, 2015 - 13:15

హైదరాబాద్ : డాన్స్‌ మాస్టర్‌ భరత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీ తెలుగులో వచ్చిన ఆట ప్రోగ్రామ్‌తో ఫేమస్‌ అయిన భరత్.. హైదరాబాద్‌ మోతీనగర్‌లోని తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయారు. భరత్‌ ఆత్మహత్యకు కారణాలేంటని ఇంకా తెలియలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు...

Sunday, December 20, 2015 - 10:12

హైదరాబాద్ : సినీ నటుడు బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'డిక్టేటర్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో కార్యక్రమాన్ని ఏపీ రాజధాని 'అమరావతి'లో అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆడియో కార్యక్రమంలో పాల్గొనేందుకు అభిమానులు భారీగా అమరావతికి తరలివెళుతున్నారు. చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ ప్రాంతం నుండి రెండు...

Sunday, December 20, 2015 - 06:35

హైదరాబాద్ : ప్రముఖ నటుడు రంగనాథ్‌ ఆత్మహత్య చేసుకొని అర్థాంతరంగా తనువు చాలించారు. ఆయన హైదరాబాదులో కవాడిగుడాలో ఉన్న తన నివాస గృహంలోని వంటగదిలో ఉరి వేసుకున్నారు. దీంతో యావత్‌ తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. గత కొంత కాలంగా ఒంటరిగానే జీవిస్తున్న రంగనాథ్‌ ఆత్మహత్య చేసుకోవడానికి దారి తీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా రంగనాథ్‌ మరణంపై అనుమానాలు...

Saturday, December 19, 2015 - 21:22

హైదరాబాద్ : తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో మెప్పించి మురిపించిన విశిష్ట నటుడు రంగనాథ్ ఇక లేరు. 300పైగా సినిమాల్లో, పలు సీరియల్స్‌లో రకరకాల పాత్రలు పోషించిన రంగనాథ్‌ చరమాంకం విషాదంతోనే ముగిసింది. అద్వితీయ నటనతో విశిష్ట పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రంగనాథ్ 66 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. ఆయనది బలవన్మరణం అని తెలిశాక యావత్ సినీ రంగం...

Saturday, December 19, 2015 - 19:22

హైదరాబాద్: : ప్రముఖ నటుడు రంగనాథ్ అనుమానాస్పద(66) మృతి చెందారు. కవాడీగూడలోని ఆయన నివాసంలో రంగనాథ్ మరణించారు. రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రంగనాథ్ మృతిపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దాదాపు 300 లకు పైగా సినిమాల్లో రంగనాథ్ విభిన్న పాత్రలు పోషించి అందిరి అభిమానాన్ని చురగొన్నారు. 1949వ...

Saturday, December 19, 2015 - 16:24

హైదరాబాద్ : సినిమా షూటింగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం పరిధిలోని సంఘీ నగర్‌లో శనివారం నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో తిరుపతి అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో భయపడిపోయిన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపివేసి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న...

Friday, December 18, 2015 - 20:53

హైదరాబాద్ : బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం దిల్ వాలే సినిమా ఈ రోజు విడుదలయ్యింది. షారుఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా హిందూ మూక ఆందోళనకు దిగారు. ఢిల్లీ, ముంబై లో ఈ చిత్ర విడుదలైన థియేటర్ల వద్ద ఆందోళన చేస్తూ బ్యానర్లు, హోర్డింగ్ లును ధ్వసం చేశారు. సినిమాను ఎవరూ తిలకించవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ షారూఖ్...

Friday, December 18, 2015 - 07:31

మంచు మనోజ్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా దశరథ్‌ దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.పతాకంపై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ సాంగ్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. మంచు మనోజ్‌, ఆయన సతీమణి ప్రణతి సంయుక్తంగా మోషన్‌ పోస్టర్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ, 'ఈ...

Friday, December 18, 2015 - 07:30

రణ్‌దీప్‌ హుడా, కాజల్‌ అగర్వాల్‌ జంటగా రూపొందుతున్న 'దో లఫ్‌జోం కి కహానీ' చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ సమర్పణలో దర్శకుడు దీపక్‌ తిజోరి రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రమిది. ఈ సందర్భంగా కాజల్ ట్విట్టర్ ద్వారా సినిమా విశేషాలను ట్వీట్స్ చేశారు. 'ఓ మంచి ప్రేమకథా చిత్రమిది. ఫస్ట్‌లుక్‌ రిలీజైంది. అతి...

Friday, December 18, 2015 - 07:28

బాలీవుడ్‌లో బయోపిక్‌ల జోరు మరింత ఊపందుకుంది. ఇప్పటికే పలువురి జీవిత కథల ఆధారంగా ఎన్నో చిత్రాలు బాలీవుడ్‌లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిల్లో క్రీడాకారుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాలు కూడా ఉన్నాయి. భారత టెన్నీస్‌స్టార్‌ సానియా మిర్జా జీవిత కథతో ఇప్పటికే దర్శకురాలు ఫరాఖాన్‌ ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే కోవలోకి మరో...

Friday, December 18, 2015 - 07:25

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌లో 'రోబో'కి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో '2.0' పేరుతో లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం ఓ విశేషమైతే, బాలీవుడ్‌ హీరో అక్షయ్ కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించడం మరో విశేషం. ఆస్కార్‌ విజేత ఏ.ఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని భారీ...

Friday, December 18, 2015 - 07:21

గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్న 'ఆక్సిజన్‌' చిత్రం షూటింగ్‌ గురువారం చెన్నరులోని శ్రీవిశ్వరూపా సాయిబాబా టెంపుల్‌లో ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో హీరో గోపీచంద్‌, డైరెక్టర్‌ జోతికృష్ణ, నిర్మాణ పర్యవేక్షకులు ఎ.ఎం.రత్నం, నిర్మాత ఎస్‌.ఐశ్వర్య, సినిమాటోగ్రాఫర్‌...

Pages

Don't Miss