Cinema

Saturday, July 25, 2015 - 08:09

హైదరాబాద్: అందాల రాముడు సునీల్ సరసన ప్రియాంక చోప్రా చెల్లెలు ఆడిపాడబోతోంది. బార్బీ హండా పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఈ భామ.  ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర సరసన  `ప్రేమ గీమా జాన్తా నయ్` చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం హిట్టు కాలేదు. దీంతో బార్బీ టాలెంటు వెలుగులోకి రాలేకపోయింది. ఇప్పుడు పేరు మార్చుకొని సునీల్ సరసన ఆడిపాడేందుకు సిద్ధమైంది. సునీల్...

Friday, July 24, 2015 - 21:45

హైదరాబాద్: నటసామ్రాట్‌ అక్కినేని కుటుంబం నుంచి మరో సామ్రాట్‌ దూసుకొస్తున్నాడు. ఇప్పటికే తెరకు అతిథిగా పరిచయమైపోయిన అఖిల్‌.. వినాయక్‌ దర్శకత్వంలో మంచి యాక్షన్‌ మూవీతో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు వినాయక్‌ .... దేశంలో రోడ్లపై భారీగా మంచి యాక్షన్‌ సీన్‌ చిత్రీకరించారు. ఇప్పుడీ విజువల్‌ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది....

Friday, July 24, 2015 - 21:03

అల్లరి నరేష్, సాక్షి చౌదరిలు నటీనటులుగా సాయి కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జేమ్స్ బాండ్.. ఇవాళా విడుదలైంది. అరడజను ఫ్లాపుల తర్వాత జేమ్స్ బాండ్ అనే సినిమాతో ప్రేక్షకుముందుకొచ్చాడు సడెన్ స్టార్ అల్లరి నరేష్. నేను కాదు నా పెళ్లాం అనేది సబ్ టైటిల్. ఈ ఉపశీర్షికతోనే సినిమా చూడకముందే కథ ప్రేక్షకులకు అర్థమై పోతుంది. సినిమా థియేటర్లోకి వెళ్లిన తర్వాత కూడా...ఊహించినట్లే ఇంతకంటే...

Friday, July 24, 2015 - 08:14

ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ పలు భాషా సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతోంది. టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' త్వరలో విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా 'శృతి'కి బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ లెటెస్ట్ మూవీ ''బాద్షాహో''లో 'శ్రుతి' హీరోయిన్ గా నటించనుందని టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో...

Friday, July 24, 2015 - 07:51

'త్రిష'...ఈమె అగ్ర హీరోలందరితో స్టెప్పులేసింది. సినీ అభిమాన యువతరం గుండెల్లో గూడుకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చెన్నై చిన్నది కోలీవుడ్..టాలీవుడ్ లో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ఈమె పలు సంచనాలకు కేంద్ర బిందువైంది. తాజాగా 'త్రిష' రాజకీయాల్లో ప్రవేశిస్తోందని టాక్ నడుస్తోంది. ఈమె అభిమానించే జయలలిత నేతృత్వంలో అన్నాడీఎంకేలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది...

Friday, July 24, 2015 - 07:48

రెబల్ స్టార్ 'ప్రభాస్' నటించిన 'బాహుబలి' కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కోలీవుడ్ నుంచి దర్శకుడు శంకర్ కూడా కితాబు ఇచ్చాడు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని వుడ్ లా సినీ ప్రముఖులు బాహుబలి కి జేజేలు పలుకుతున్నప్పటికీ తెలుగు టాప్ డైరెక్టర్స్ మాత్రం...

Thursday, July 23, 2015 - 09:27

సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ స్టేటస్ అందుకున్న రజనీ.. ప్రజెంట్ ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.. భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్నా.. కొంత కాలంగా రికార్డ్ సృష్టించే హిట్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. అందుకే 35 ఏళ్ల నాటి పాత పేరుతో ఓ కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు రజనీ.
'లింగా' తరువాత రజనీకాంత్ 'మద్రాసు' దర్శకుడు రంజిత్ తో చేసే చిత్రానికి 'కాళీ' అనే టైటిల్ ను...

Thursday, July 23, 2015 - 09:26

'బ్రహ్మానందం'..ఆయన ఉంటే సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని సినీ జనాల నమ్మకం. బ్రహ్మీ కేరెక్ట‌ర్‌ హిట్ అయితే సినిమా సూపర్ హిట్టని, కలక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అని కొంతమంది నమ్ముతుంటారు. కానీ టాలీవుడ్ లో 'బ్రహ్మీ' పై పలు వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ సినిమా 'డిక్టేటర్' మూవీ సినిమా నుండి తప్పించారని టాక్.
ఈ సినిమా కోసం కోన వెంకట్ బ్రహ్మానందం కోసం ఓ కేరెక్ట‌ర్‌ను...

Thursday, July 23, 2015 - 09:26

ప్రధాని నరేంద్ర మోడీపై బాలీవుడ్‌ భామ నేహా ధూపియా సెటైర్లు గుప్పించింది. 'పరిపాలన అంటే సెల్ఫీలు, యోగాలు కాదు..' అంటూ ట్విట్టర్‌ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించింది. దీనికి కారణమంటూ ఉందంట. గడిచిన రెండు రోజులుగా కుండపోత వర్షంతో ముంబై అతలాకుతలం అయింది. వర్షాల దాటికి రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతోపాటు కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. ప్రజలు బాగానే ఇబ్బందులుపడ్డారు. వర్షం...

Thursday, July 23, 2015 - 09:25

ప్రజెంట్ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే ముందు వరుసలో వినిపించే పేరు మహేష్ బాబు.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న ఈ సూపర్ స్టార్ ఇప్పుడు వంద కోట్ల సినిమా మీద కన్నేశాడు. అంతేకాదు మాస్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న ఓ స్టార్ డైరెక్టర్ మహేష్ తో వందకోట్ల సినిమా చేస్తానంటూ ప్రకంటించేశాడు కూడా. కాకపోతే ఇది వినాయక్ ప్రపోజల్ మాత్రమే. 'శ్రీమంతుడు' ఆడియో...

Tuesday, July 21, 2015 - 16:22

హైదరాబాద్: దర్శక,నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం "రుద్రమదేవి" చిత్రంలో కేథరిన్ అనామిక అనే పాత్ర పోషిస్తుంది. ఈ పాత్రలో కేథరిన్ రాజకుమారిలా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన న్యూ లుక్ ను ఇటివలే విడుదల చేసారు.  ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి సినిమాలో ఈ అమ్మడు తన హాట్ హాట్...

Tuesday, July 21, 2015 - 15:35

హైదరాబాద్: రాణీ రుద్రమదేవి జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం రుద్రమదేవి సినిమాలో ముక్తాంబ ప్రాతలో నటిస్తున్న నిత్యా మీనన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు గుణ శేఖర్ తన సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే...

Tuesday, July 21, 2015 - 12:20

విజయవాడ : అలనాటి మేటి నటి కనకం (92) కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవలే మేనల్లుడు మృతి చెందడంతో కనకం దిగులుతో మంచాన పడ్డారు. రెండు రోజుల క్రితం కోమాలోకి వెళ్లిన ఆమె మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పాతాళ భైరవి, కీలుగుర్రం, గృహప్రవేశం హిట్ చిత్రాలతో పాటు 20కిపైగా సినిమాల్లో కనకం ప్రధాన పాత్ర...

Tuesday, July 21, 2015 - 09:55

కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలను పరిచయం చేస్తూ చిత్ర బృందం వరుసగా పోస్టర్లు విడుదల చేస్తోంది. రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడి పాత్రలో రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, మహామంత్రి శివ దేవయ్య పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌లు నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి...

Tuesday, July 21, 2015 - 09:54

ప్రముఖ సినీ నటుడు నాగార్జున తనయుడు 'అఖిల్' నటిస్తున్న తాజా చిత్రం టీజర్ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. అలాగే టీజర్ ని విడుదల చేయటానికి తేదీని ఫిక్స్ చేసారు. తండ్రి అక్కినేని నాగార్జున పుట్టిన రోజు అంటే..ఆగస్టు 29న...

Tuesday, July 21, 2015 - 09:52

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'శ్రీమంతుడు' త్వరలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీక్షిస్తారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారని టాక్. అందమైన బాల్యాన్ని మరిచిపోలేని స్నేహాన్ని వదులుకోలేని జ్ఞాపకాలను మనకిచ్చిన మన సొంత ఊరుకు మనం పెద్ద అయ్యాక ఏమి చేస్తున్నాం...

Tuesday, July 21, 2015 - 08:07

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మూడు భాషల్లో డైలాగ్స్ పలికి అలరించారు. టీఎస్సార్, టీవీ9 అవార్డుల ప్రదానోత్సవంలో బాలకృష్ణ పాల్గొన్నారు. పృథ్వీ రాజ్ కపూర్ మనవడు రిషికపూర్‌తో తనకు పరిచయం, స్నేహం ఉన్నాయని పేర్కొన్నారు. హిందీ, కన్నడ, తమిళ భాషా చిత్రాల్లోని ఆయన డైలాగులకు అభిమానులు చప్పట్లు కొట్టారు. 

Tuesday, July 21, 2015 - 07:26

ఫిలిం ఇండస్ట్రీ ఆ నలుగురిదే అని మరోసారి తేలిపోయింది. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిని ఎన్నుకునే నాలుగు సెక్టార్లలో వాళ్లే ఉండటం వల్ల మళ్లీ ఛాంబర్ అధ్యక్ష పదవి ఆ టీమ్ కే దక్కింది. వందలాది థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని టాలీవుడ్ లో నియంతృత్వం కొనసాగిస్తున్న సురేష్ బాబు ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

Tuesday, July 21, 2015 - 07:25

ఇంటర్ నేషనల్ లెవల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ వీడియో గేమ్ సీరిస్ 'హిట్ మేన్' ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్ డ్రామా 'హిట్ మేన్.. హిట్ మేన్ ఏజెంట్ 47' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలెగ్జాండర్ దర్శకుడు. ట్వంటియత్ సెంచురీ ఫాక్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ వారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

Tuesday, July 21, 2015 - 07:24

మంచి కథలు వస్తే తమిళంలో నటిస్తానని సినీ నటుడు ప్రభాస్‌ ప్రకటించారు. నేషనల్ లెవల్ లో బాహుబలి ఫీవర్ ఇంకా కొనసాగుతోంది. విడుదలైన అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రిలీజ్ తరువాత ప్రెస్ మీట్ లకు హాజరు కానీ చిత్ర యూనిట్ తాజాగా చెన్నైలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, శివగామి రమ్యకృష్ణ, తమిళ దర్శకులు రాజేష్‌, లింగుసామి, నిర్మాతలు టి.శివ, సీవీ...

Monday, July 20, 2015 - 18:44

రాజమండ్రి: ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద గోదావరి పుష్కరాలకు విచ్చేశారు. రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో సోదరి, సోదరుడితో కలిసి ఆమె పుణ్యస్నానం ఆచరించారు. జన్మభూమి రాజమండ్రిలో పుష్కర స్నానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని జయప్రద అన్నారు.

 

Monday, July 20, 2015 - 12:41

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ "భజ్ రంగీ బాయీజాన్" కొత్త రికార్డు నెలకొల్పింది. మూడురోజుల్లోనే వందకోట్లు కలెక్ట్‌ చేసి బాక్సాఫీసును షేక్ చేసింది. నిన్నటి వరకు ఈ మూవీ 102కోట్ల 60లక్షలు వసూళ్లు చేసింది. తొలిరోజు 27కోట్లను కొల్లగొట్టిన భజ్ రంగీ.. శని, ఆదివారాల్లో 75కోట్ల 60లక్షలను తన ఖాతాలో వేసుకుంది. మూవీని రిలీజ్ చేసిన ఎరోస్.. ఈ విషయాన్ని అధికారికంగా...

Monday, July 20, 2015 - 11:25

సల్మాన్‌ఖాన్‌ కెరీర్‌లోనే 'భజరంగీ భాయిజాన్‌' ఉత్తమ చిత్రం. సల్మాన్ ఈ సినిమాలో తన నటనతో నన్ను ఏడ్పించాడు. ఈ సినిమాలో సల్మాన్ అదరగొట్టేశాడంటూ బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆదివారం ముంబైలో అమీర్‌ ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం, 'ఇప్పటివరకు సల్మాన్‌ నటించిన సినిమాల్లో 'భజరంగీ..' ద బెస్ట్‌, మంచి కథ, సంభాషణలు, కబీర్‌ఖాన్‌ చాలా బాగా...

Sunday, July 19, 2015 - 10:40

''పోయిన సారి మిమ్మల్ని నిరుత్సాహ పరిచా..అభిమానులు నన్ను క్షమించండి'' అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన 'శ్రీమంతుడు' పాటల విడుదల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రంలో ప్రిన్స్ కు జోడిగా శృతి హాసన్ నటించింది. తొలి సిడీని సినీ నటుడు వెంకటేష్ ఆవిష్కరించగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడారు. దేవీ...

Sunday, July 19, 2015 - 07:57

హైదరాబాద్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురి ఆధిపత్యం పోవాలంటన్నారు చిన్న నిర్మాతలు నట్టికుమార్, ప్రసన్నకుమార్. ఈ ఆదివారం జరగనున్న తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల్లో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లపై పోటీకి దిగబోతున్నట్లు తెలిపారు.
పలు పదవుల కోసం రెండు పానెల్స్ కు చెందినవారు పోటీ పడుతున్నారు. సురేష్‌బాబు, సుధాకర్‌రెడ్డిలది ఒక...

Sunday, July 19, 2015 - 07:48

హైదరాబాద్ : రాంగోపాల్ వర్మ..ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కలకలం సృష్టిస్తుంటారు. సమయం..సందర్భం అసలే ఉండదు. ఎప్పుడు ఎలా మాట్లాడుతారో తనకే తెలియదు. ట్విటర్‌లో క్షణానికో ట్వీట్‌తో... తనుకు తాను గుర్తు చేస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి 150వ సినిమాపై వర్మ తనదైన శైలిలో స్పందించారు...

Saturday, July 18, 2015 - 16:56

ముంబై: రంజాన్ పర్వదినం సందర్భంగా... బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్‌... శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారమే విడుదలైన భజరంగి భాయ్‌జాన్‌ సినిమా చూడాలని ఆతృతతో ఎదురుచూస్తున్నానని... ఈ రాత్రి సెకెండ్‌ షోకు వెళ్లనున్నట్లు అమీర్‌ఖాన్‌ వెల్లడించారు.

 

Pages

Don't Miss