Cinema

Sunday, November 15, 2015 - 17:34

హైదరాబాద్ : బాలీవుడ్ సోదరీమణులు కరీనా కపూర్, కరిష్మాకపూర్ లు నగరంలోని ప్రసాద్ ఐ మ్యాక్స్ ను సందర్శించారు. 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సావాలను పురస్కరించుకుని కరిష్మా కుమార్తె సమైరా దర్శకత్వం వహించిన 'బీ హ్యాపీ' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సందర్భంగా కుమార్తె సమైరా, సోదరి కరీనా కపూర్ లతో కరిష్మా చిత్రాన్ని వీక్షించింది. 

Saturday, November 14, 2015 - 17:01

హైదరాబాద్ : సినీ నటి రేణూదేశాయ్‌ తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. ప్యారిస్‌లో జరిగిన ఉగ్రదాడి ముందు వరకు ఆమె అక్కడే ఉన్నారు. ఆమె బయల్దేరి ఇండియాకు వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. తాను బతికే ఉన్నందుకు సంతోషపడుతున్నట్లుగా ట్విట్టర్‌లో రేణూదేశాయ్‌ ట్వీట్‌ చేశారు.

 

 

Saturday, November 14, 2015 - 13:54

ఎన్టీఆర్‌, వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో మళ్లీ ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'అదుర్స్‌' విజయవంతమైన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్‌ తీయాలని ఎప్పటి నుంచో వినాయక్‌ అనుకుంటున్నారని టాక్. ఇప్పటి వరకు 'అఖిల్‌' సినిమాతో బిజీగా ఉన్న వినాయక్‌ ఈనెల 11న ఆ చిత్రం విడుదలతో ఫ్రీ అయిపోయాడు. ఇక తన తర్వాత ప్రాజెక్టుపై దృష్టి...

Saturday, November 14, 2015 - 11:22

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్'...ఇతను టాలీవుడ్ కు 2002 సంవత్సరంలో 'ఈశ్వర్' చిత్రం ద్వారా పరిచయమయ్యాడు. అనంతరం 2014 సంవత్సరంలో బాలీవుడ్ లో 'యాక్షన్ జాక్సన్' చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి 'ప్రభుదేవ' దర్శకుడు. తాజాగా 'ప్రభాస్' 'బాహుబలి' చిత్రం ద్వారా పాపులర్ అయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ తనకు...

Saturday, November 14, 2015 - 10:30

'మహేష్‌' హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ (సివిఎం) నిర్మించిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం నవంబర్‌ 14కి 15 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. తమ మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో రూపొందిన తొలి చిత్రం 'శ్రీమంతుడు' ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు...

Saturday, November 14, 2015 - 10:28

ఆశిష్‌ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్‌ కౌశిక్‌, దీక్షాపంత్‌, శృతి మోల్‌, మనాలి రాథోడ్‌ ప్రధాన పాత్రధారులుగా రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అశోక్‌ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'. 'కల్పితమా..కచ్చితమా' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుంది. ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై 'ఓ స్త్రీ రేపు రా' అని...

Saturday, November 14, 2015 - 10:27

అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో పివిపి బ్యాపర్‌పై ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించిన చిత్రం 'సైజ్‌జీరో'. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్‌ను వినూత్నంగా ప్లాన్‌ చేస్తున్నారు. 'ఈ చిత్రం కోసం అనుష్క 20కేజీలు బరువు పెరిగి మళ్ళీ తగ్గింది. అంత కమిట్‌మెంట్‌తో అనుష్క వర్క్‌ చేయడం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. కీరవాణి అందించిన...

Saturday, November 14, 2015 - 10:26

ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన ఆత్మకథ 'గన్స్‌ అండ్‌ థైస్' పుస్తకాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ పుస్తక ముఖచిత్రాన్ని శుక్రవారం తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఆయన విడుదల చేశారు. పుస్తకంలోని విషయాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని అధ్యాయాల పేర్లను ట్వీట్‌లో పేర్కొన్నారు. తాను బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ని ఇడియట్‌ అన్న విషయం.. తన సినీ...

Saturday, November 14, 2015 - 10:24

'ష్‌... కోయి హై', 'గెట్‌ గార్జియస్‌', 'ప్యార్‌ కా బంధన్‌' వంటి హిందీ టీవీ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు 'అందాల రాక్షసి'గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో సైతం పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అగ్రహీరో నాగార్జునతో నటించే లక్కీ ఛాన్స్‌ని కూడా అందిపుచ్చుకుంది....

Saturday, November 14, 2015 - 06:53

హైదరాబాద్ : అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి హైదరాబాద్‌ ముస్తాబయ్యింది. బంగారు ఏనుగు నగరానికి వచ్చేసింది. దేశ, విదేశాల నుంచి చిన్నారులు తరలివస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రారంభ వేడుక శిల్ప కళావేదికలో ఉదయం జరగనుంది. పలువురు టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఈ వేడుకలకు హాజరుకానున్నారు.

...
Friday, November 13, 2015 - 21:39

జీనియస్ ఆదిత్య టీంతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈసంరద్భంగా ప్రొడ్యూసర్ కం డెరెక్టర్ బి.సుధాకర్ గౌడ్,,, చిత్రంలో నటించిన చిన్న పిల్లలు ప్రేమ్ బాబు, రోహిత్ లు తమ సినిమా అనుభవాలను వివరించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

Friday, November 13, 2015 - 21:24

సినీ నటుడు కౌషిక్ బాబుతో టెన్ టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. తెరపై అయ్యప్పస్వామి అంటే కౌశిక్ బాబే గుర్తుకొస్తాడు. ఈ సందర్భంగా కౌషిక్ తన సినిమాల అనుభవాలను తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Friday, November 13, 2015 - 09:00

బాలకృష్ణ హీరోగా ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'డిక్టేటర్‌'. బాలకృష్ణ 99వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు ఏకధాటిగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేయాలనే తమ సంకల్పానికి...

Friday, November 13, 2015 - 06:18

                 డ్యాన్స్.. ఫైట్స్.. బాడీ ఫిట్నెస్ తో స్టయిలిస్‌ స్టార్‌ గా పేరు తెచ్చుకున్న వర్సటైల్ హీరో అల్లు అర్జున్‌ తాజాగా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. హీరోగా సినిమాల్లో బిజిగా నటిస్తూ వస్తున్న బన్ని ఇప్పుడు ప్రొడ్యూసర్ మారబోతున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'రుద్రమదేవి' సినిమాలో 'గోన గన్నారెడ్డిగా అలరించి దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు బన్నీ....

Thursday, November 12, 2015 - 20:52

ఈ సంక్రాంతికి నందమూరి హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సుకుమార్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తయింది. బాలకృష్ణ, శ్రీవాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'డిక్టేటర్‌' కూడా సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్రం బృందం సన్నాహాలు చేస్తుంది.
'డిక్టేటర్‌' సిద్ధం..
బాలకృష్ణ హీరోగా ఈరోస్‌...

Thursday, November 12, 2015 - 20:49

1958లో బాలీవుడ్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన 'చల్తీ కా నామ్‌ గాడీ' చిత్రం రీమేక్‌లో హిట్‌ పెయిర్‌గా నిలిచిన షారూఖ్‌ఖాన్‌, ఐశ్వర్యరాయ్‌ నటించబోతున్నారని సమాచారం. 2000 సంవత్సరంలో షారూఖ్‌, ఐశ్వర్య జోడీగా నటించిన తొలి చిత్రం 'జోష్‌' బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే సంవత్సరం ఇదే జోడీ 'మొహబ్బతే' చిత్రంలో నటించింది. ఆ చిత్రం సైతం ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘనవిజయం...

Thursday, November 12, 2015 - 17:23

టాలీవుడ్ మనసు కొత్తందం కోరుకుంటోంది. పాతందాల్ని కంటిన్యూ చేస్తున్నా…నయా నాజుకు సోయగాల్ని ఒడిసి పట్టేందుకు ప్రయత్నిస్తోంది. కాజల్, సమంత, శృతీహాసన్, తమన్నా, అనుష్క లాంటి సీనియర్లకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా…ఎన్ని హిట్స్ వీరి ఖాతాలో ఉన్నా… ఆడియన్స్ బోర్ ఫీలవుతున్నారు. దర్శక నిర్మాతల కంటే కూడా స్టార్ హీరోలు కూడా కొత్త హీరోయిన్ ని ట్రై చేద్దాం… అని డిసైడ్ అవుతున్నారు. దీన్ని...

Wednesday, November 11, 2015 - 18:44

అక్కినేని నట వారసత్వానికి మూడో తరం ప్రతినిధిగా తెరపైకి వచ్చాడు అఖిల్. ఇన్నాళ్ల అభిమానుల నిరీక్షణ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలతో ముగిసింది. సినిమా చూశాక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కారణం...అఖిల్...సినిమాలో పాటలు, ఫైట్లు ఇరగదీశాడన్నది వాళ్ల సంతోషానికి కారణం. మరి అభిమానులను మెప్పించిన అఖిల్....సక్సెస్ ఫుల్ సినిమాతో లాంఛ్ అయ్యాడా అంటే ముక్తకంఠంతో లేదనే సమాధానమే...

Wednesday, November 11, 2015 - 16:35

ముంబై : బాలీవుడ్ హీరో 'షారుఖ్ ఖాన్' ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి విచారించింది. దాదాపు మూడు గంటల పాటు షారుఖ్ ను ప్రశ్నించారు. తాను ఎలాంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని షారుఖ్ పేర్కొన్నట్లు సమాచారం. కోల్ కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రై.లి.షేర్లను మారిషస్ కు చెందిన జయ్ మెహతా కంపెనీకి విక్రయించడంల్ో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ షారుఖ్ కు మూడు...

Wednesday, November 11, 2015 - 15:55

అక్కినేని వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అక్కినేని అఖిల్ తన పేరును సినిమా టైటిల్ గా మార్చుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపావళి పండుగ సందర్భంగా టెన్ టివి 'అఖిల్'తో ముచ్చటించింది. చిత్ర విశేషాలతో పాటు ఇతర అంశాలపై 'అఖిల్' మాట్లాడారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో చూడండి. 

Tuesday, November 10, 2015 - 10:32

బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ లు నటించిన చిత్రం 'దిల్ వాలే' సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ని బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ 'దిల్ వాలే' అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 'అందరికీ దిల్ ఉన్నా.. అందరూ దిల్ వాలే కాలేరు' అంటూ మనసును తట్టే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. షారూక్ - కాజోల్ ఎంటర్...

Tuesday, November 10, 2015 - 10:09

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్‌ టైగర్‌'. ఈ చిత్రానికి సంబంధించి రెండు వీడియో సాంగ్స్‌ను సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు సంపత్‌నంది మాట్లాడారు. ఆడియోను హిట్‌ చేసిన ప్రేక్షకులకు,...

Tuesday, November 10, 2015 - 10:08

సల్మాన్‌ఖాన్‌, సోనమ్‌కపూర్‌ జంటగా రాజశ్రీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సూరజ్‌.ఆర్‌.భరజాత్య దర్శకత్వంలో రూపొందిన 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో' చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన ప్రమోషన్‌ మీట్‌లో షారూఖ్‌ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించిన 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రంలోని ఓ పాటకు చిత్ర బృందం నృత్యం చేసింది. ఈ వీడియోని...

Tuesday, November 10, 2015 - 10:07

1990లో విడుదలై ప్రేక్షకాదరణతో విజయం సాధించిన 'ఘాయల్‌' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'ఘాయల్‌ ఒన్స్‌ ఎగైన్‌' చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్‌ను నిర్మాత ధర్మేంద్ర విడుదల చేశారు. సన్నీడియోల్‌, సోహా ఆలీఖాన్‌, ఓంపురి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేసేందుకు ధర్మేంద్ర సన్నాహాలు చేస్తున్నారు. 'ఓ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కి విజయం...

Monday, November 9, 2015 - 13:36

హైదరాబాద్ : సెన్సేషనల్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ మెగా అభిమానులకు దీపావళి కానుకనిచ్చారు. ఆయన డైరెక్షన్‌లోనే వరుణ్‌తేజ్‌, దిశా పటాని జంటగా నటించిన లోఫర్‌ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసారు. ఇప్పుడు లోఫర్‌ ట్రైలర్‌ ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.
తల్లి సెంటిమెంట్ తో సాగే ఎమోషనల్ డ్రామానే 'లోఫర్' కథ అని దర్శకుడు పూరి ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే....

Monday, November 9, 2015 - 12:53

ముంబై : బాజీరావు మస్తానీ పోస్టర్ ను సినీ నటి దీపికా పదుకొనే ఆవిష్కరించారు. సోమవారం ముంబైలో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దీపికా సినిమా విశేషాలను వివరించారు. బాహుబలికి..ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని, ఇదొక డిఫరెంట్ చిత్రమని స్పష్టం చేశారు. 'బాజీరావు మస్తాని' చిత్రం మహారాష్ట్ర పాలకులు పీష్వాల చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందింది. ఈ...

Monday, November 9, 2015 - 07:39

బాలీలో పోలీసులకు చిక్కిన మాఫియా డాన్ ఛోటా రాజన్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ చిత్రం రూపొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ గుప్తా దర్శకత్వం హహించనున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ కథానాయకుడిగా నటించనున్నారట. ఛోటారాజన్ జీవితంపై ఎస్.హుస్సేన్‌జైదీ రచించిన బైకుల్లా టూ బ్యాంకాక్ అనే రచన ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ కథానాయికగా...

Pages

Don't Miss