Cinema

Wednesday, September 23, 2015 - 14:36

అమెరికా : టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా మంచి గుర్తింపు పొందిన నటీమణులలో 'లయ' ఒకరు. అమెరికాలో ఆమె ప్రమాదానికి గురైందని వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదంపై 'లయ' స్పందించింది. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని లయ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తనకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న తన తల్లిదండ్రులు..బంధువులు..శ్రేయోభిలాషులు చాలా కంగారు...

Wednesday, September 23, 2015 - 13:53

ఎనర్జిటిక్ స్టార్ 'రామ్' హీరోగా రూపొందిన చిత్రం 'శివమ్' అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రామ్' సరసన 'రాశీ ఖన్నా' హీరోయిన్ గా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హై ఓల్టేజ్ లవ్ స్టోరీతో రూపొందిందని 'స్రవంతి' రవికిశోర్ పేర్కొన్నారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ అన్నారు...

Wednesday, September 23, 2015 - 11:29

బాలీవుడ్‌లో అలియాభట్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ఒక్కటవనున్నారనే వార్త కోడై కూస్తోంది. అలియా పెళ్ళి వార్త ఇంతగా హల్‌చల్‌ చేయడానికి ఒకే ఒక్క కారణం ఉంది. అదేంటంటే.. ఇటీవల జరిగిన సిద్ధార్థ్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో సిద్ధార్థ్‌ తల్లిదండ్రులతో అలియా డిన్నర్‌ చేయడమే కాకుండా సిద్ధార్థ్‌ ఫ్యామిలీకి స్వయంగా డిష్‌ ఐటెమ్స్‌ను వడ్డించింది. దీంతో ఈ జోడీ ప్రేమ బంధాన్ని పెళ్ళి బంధంగా మార్చుకునే...

Wednesday, September 23, 2015 - 11:12

              మిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొత్త చిత్రం 'కబాలి'. ఈ చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో జరుగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తున్న విషయం తెలిసింది. మరొక కీలక పాత్ర కోసం ఎవరి పెడితే బాగుంటుందని యూనిట్‌ ఆలోచించింది. చివరకు ఐశ్వర్య...

Wednesday, September 23, 2015 - 11:01

          'శ్రీమంతుడు' దర్శకుడు కొరటాల శివకు మహేష్‌బాబు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఆడిఎ6 మ్యాట్రిక్‌ కారును ఆయనకు బహుమతిగా అందజేశారు. 'శ్రీమంతుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన కొరటాల శివ తనకెంతో పేరు తెచ్చారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎక్కువ ఫీచర్స్‌ ఉన్న ఈ కారు తనకు బహుమతిగా ఇవ్వడం పట్ల కొరటాల వర్ణించలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆడి హైదరాబాద్‌...

Tuesday, September 22, 2015 - 16:01

ప్రముఖ మలయాళ సినీ నటుడు 'మమ్ముట్టి'ని 'సోప్' కోర్టుకు ఈడ్చడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా ? అవును ఇది నిజం. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ లోనైనా సరే ప్రముఖ సినీ తారలు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనీ ద్వారానే వారు ఎక్కువ సంపాదిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా 'మమ్ముట్టి' ఓ యాడ్ లో నటించి కష్టాల్లో పడ్డారు. తెల్లని ముఖం కోసం 'ఇందులేఖ' వైట్ సోప్...

Tuesday, September 22, 2015 - 13:44

'స్వామి రారా'..'కార్తికేయ'..'సూర్య వర్సెస్ సూర్య'.. ఇలా వరుసగా వైవిధ్య భరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న 'నిఖిల్' నటిస్తున్న తాజా చిత్రం 'శంకరాభరణం'. దీనికి సంబంధించిన న్యూ లుక్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో 'నందిత' హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ రచయిత 'కోన వెంకట్' సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి'...

Tuesday, September 22, 2015 - 10:41

ఇటీవల పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు పలువురు క్రీడా, సినీ, రాజకీయ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ వార్తల్లో నిలిచే 'రాం గోపాల్ వర్మ' 'దత్తత'లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేశారు. పలు గ్రామాల్లోని ప్రజల కన్నా..అమీర్ పేట వెనుకననున్న బస్తీల్లో దుర్భర జీవితం గడుపుతున్న ఎంతో మంది ఉన్నారని..సెలబ్రిటీలు వాటిని దత్తత తీసుకుంటారా అని...

Tuesday, September 22, 2015 - 10:22

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోదరుని తనయుడు కల్వకుంట్ల తేజేశ్వర్‌రావ్‌ (కన్నారావ్‌) చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తొలి ప్రయత్నంగా '999' చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్‌ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై 'షీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'షీ' అనే టైటిల్‌తో రూపొందున్న ఈ చిత్రకథ అద్భుతంగా...

Tuesday, September 22, 2015 - 10:14

ప్రముఖ దర్శకుడు 'మణిరత్నం' సినిమాలో నటించాలని ఎంతో మంది ఉత్సాహం చూపుతుంటారు. కానీ అలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. తాజాగా 'కార్తీ', 'దుల్కర్‌ సల్మాన్‌' హీరోలుగా రివేంజ్‌ డ్రామా నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తమిళంలో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే ఓ కథానాయికగా 'కీర్తి సురేష్‌'ను మణిరత్నం ఎంపిక చేశారు. తాజాగా మరో కథానాయికగా 'నిత్య...

Tuesday, September 22, 2015 - 09:55

మెగస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్‌ చరణ్' కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రూస్‌ లీ' అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'శ్రీను వైట్ల' దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎల్‌ఎల్‌పీ పతాకాలపై దానయ్య డి.వి.వి.నిర్మిస్తున్నారు. 'చెర్రీ' సరసన 'రకుల్‌ ప్రీత్‌సింగ్' నటించారు. ఈ చిత్రంలో 'చిరంజీవి' అతిథి పాత్రను పోషిస్తున్నారని టాక్....

Monday, September 21, 2015 - 20:32

అమీర్ ఖాన్ కథానాయకుడుగా నటిస్తున్న కొత్త చిత్రం 'దంగల్' షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఆమిర్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. పీకే తరహాలో ఈ చిత్రంలోనూ ఆమిర్ విభిన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

Monday, September 21, 2015 - 17:47

కమల్ హాసన్..విలక్షణ నటుడు ఈయన కమర్షియల్ యాడ్ లో నటిస్తున్నారా ? అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం కరెక్టే. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఏ యాడ్స్ లో నటించలేదు. తాజాగా తొలిసారిగా ఓ ప్రకటనలో కనిపించనున్నారు. 'పోతిస్' అనే టెక్స్ టైల్ షోరూం యాడ్ లో 'కమల్' నటించనున్నారు. ఈ వారంలో యాడ్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. యాడ్ రెండు నిమిషాల పాటు ఉంటుందంట. ఇప్పటి వరకు టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్...

Monday, September 21, 2015 - 17:10

ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో 'అనుష్క' ప్రధాన పాత్రధారిణిగా పివిపి పతాకంపై ప్రొడక్షన్‌ నెం.10గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'సైజ్‌ జీరో' చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్ర లోగో..టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన టీజర్ సాంగ్ తెలుగులో ఉంది. వెయిట్‌ లాస్‌ కాన్సెప్ట్ తో...

Monday, September 21, 2015 - 13:13

మెగస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను సోమవారం విడుదల చేశారు. చిత్రానికి సంబంధించిన మొదటి పోస్టర్ ను విడుదల చేసినట్లు హీరో 'రాంచరణ్' తన ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో మెగాస్టార్ 'చిరంజీవి' ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. అలాగే 'పవన్ కల్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి...

Monday, September 21, 2015 - 10:58

ప్రస్తుతం టాలీవుడ్ లో 'బ్రూస్ లీ' చిత్రంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ చిత్రంపై భారీగా హైప్స్ పెరిగిపోతున్నాయి. సినిమాకు పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చారని..మెగస్టార్ 'చిరంజీవి'..'నాగార్జున'లు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కానీ 'చిరంజీవి' మాత్రం ఓ పాత్రలో పక్కాగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన సీన్స్...

Monday, September 21, 2015 - 10:26

అక్కినేని 'నాగార్జున' తనయుడు 'అఖిల్' హీరోగా నటించిన చిత్రం 'అఖిల్' (ది పవర్ అఫ్ జువా) అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఆడియో విడుదలైంది. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ అభిమానుల సందడి తో పాటు, సినీ అతిరధ మహారధుల సమక్షంలో ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' ముఖ్యఅతిధిగా వచ్చారు. అలాగే నాగార్జున, అమల నితిన్ తో...

Sunday, September 20, 2015 - 12:31

ఇద్దరు సూపర్ స్టార్లు.. ఒకరు టాలీవుడ్ 'రాజకుమారుడు'. మరొకరు బాలీవుడ్ ' రారాజు'. బేషజాలు మర్చిపోయారు. తమది సినిమా కుటుంబమని.. ఆ సినీ వినీలాకాశంలో ఆత్మీయతలు తప్ప మరొకటి ఉండవని హద్దులు చెరిపేశారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ శనివారం 'బ్రహ్మోత్సవం' సెట్ లో ప్రత్యక్షమై ఆ చిత్ర యూనిట్ కు థ్రిల్ అందించారు. షారుఖ్ లాంటి స్టార్ తన సెట్ ని సందర్శించడంతో మహేష్ మనసు పులకించింది. ...

Sunday, September 20, 2015 - 08:59

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ కు తెలుగులో వరుసగా బంపర్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా హండ్రెడ్‌ డేస్‌ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్‌'లో అనుపమ నటించింది. అక్కడ మంచి మార్కులు రావడంతో అలాగే తెలుగు 'ప్రేమమ్‌'లో కూడా ఈ అమ్మడే నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించుకోకుండానే.. నితిన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎస్‌.రాధాకృష్ణ...

Sunday, September 20, 2015 - 08:52

హీరో రానా ట్విట్టర్ లో ఓ వెరైటీ ఫొటో పోస్టు చేయడం.. దానికి 'ప్రేమ అన్ని షేపుల్లో, సైజుల్లోనూ ఉంటుంది' అంటూ సమంత కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'బెంగుళూరు డేస్‌' రీమేక్‌లో రానా, సమంత నటిస్తున్నారు. ఈ చిత్రం తాలూకు ప్రమోషన్ లో భాగంగానే ఈ ట్వీటాయణం నడిచింది. ఇక ఈచిత్రంలో పాత్రల విషయానికి వెళితే రానాకు...

Sunday, September 20, 2015 - 08:37

             నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. సాయి నిహారిక, శరత్‌ చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం...

Sunday, September 20, 2015 - 08:35

         'ప్రేమ కథా చిత్రం', 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' ఫేమ్‌ సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది. 70ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్ కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌...

Saturday, September 19, 2015 - 15:44

నదియా..'అత్తారింటికి దారేది', 'మిర్చి' సినిమాల్లో తన నటనతో అందర్నీ మెప్పించింది. 'అత్తారింటికి దారేది' చిత్రం తరువాత 'దృశ్యం'లో పవర్‌పుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించి అందర్నీ అలరించింది. ఆ తరువాత తెలుగులో ఆమె చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించలేదు. ఇదిలా ఉంటే మరోసారి 'త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌' ఆమెతో మ్యాజిక్‌ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. 'నితిన్' నటిస్తున్న తాజా మూవీ 'అ..ఆ...

Saturday, September 19, 2015 - 12:28

హైదరాబాద్ : కార్టూన్ సీరియల్ గా ప్రపంచవ్యాప్తంగా చిన్నారులను అలరించిన జంగిల్ బుక్ .. ఇప్పుడు మూవీగా వస్తోంది. ఐరన్ మ్యాన్ మూవీ డైరెక్టర్ ఫేవ్ ర్యూ దర్శకత్వంలో... డిస్నీ రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు కోటి హిట్లు సాధించింది. నీల్ సేథీ మోగ్లీగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 16న విడుదల కానుంది.

...
Saturday, September 19, 2015 - 11:00

కంగనా రనౌత్..బాలీవుడ్ నటి..ప్రస్తుతం ఆమె ఓ నటుడి విషయంలో చాలా ఎక్సైట్ అవుతోందంట. ఆయనతో నటించడం అంటే గొప్ప విషయమని పేర్కొంటోంది. ఆయనే బాలీవుడ్ బిగ్ బి 'అమితాబ్ బచ్చన్' వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తున్నారా ? అని ఆశ్చర్యపోకండి. 'అమితాబ్', 'కంగనా' లు కలిసి ఓ యాడ్ లో నటించనున్నారు. కంగన బిగ్ బీ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. సినిమా అయినా టీవీ యాడ్ అయినా అమితాబ్ తో కలిసి...

Saturday, September 19, 2015 - 10:49

మెగాస్టార్ 'చిరంజీవి' తనయుడు 'రాంచరణ్ తేజ' నటిస్తున్న 'బ్రూస్ లీ' చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన రకరకాలైన వార్తలు బయటకొస్తున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ 'చిరంజీవి', టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున'లు కీలక పాత్రలు పోషిస్తున్నారని..వపర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' వాయిస్ ఓవర్ ఇచ్చాడని..ఇలా ఎన్నో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా 'చెర్రీ'..'చిరంజీవి'తో...

Saturday, September 19, 2015 - 08:32

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పి.వి.పి. పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో పొట్లూరి వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రానికి 'ఊపిరి' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని శుక్రవారం విడుదల చేశారు. 
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ 'తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'ఊపిరి'...

Pages

Don't Miss