Cinema

Saturday, September 5, 2015 - 09:33

ముంబై : బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు ఆదేశ్ శ్రీవాత్సవ(51) మృతి చెందారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన అందేరిలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
...

Friday, September 4, 2015 - 13:33

హైదరాబాద్ : ప్ర‌ధాని ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేపట్టిన స్వ‌చ్ఛ భారత్దేశంలోని ప‌లు ప్ర‌ముఖులు ఎంతో బాధ్య‌తగా తీసుకుని దేశాన్ని ప‌రిశుభ్రం చేయాల‌ని శ్ర‌మించారు. ఈ స్వ‌చ్ఛ భారత్ మిష‌న్ కార్య‌క్ర‌మానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ గా సినీ న‌టి, నిర్మాత ల‌క్ష్మి మంచు ఎంపికయింది. స్వచ్ఛ్ భారత్‌ తెలంగాణ అంబాసిడర్‌గా ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు మంచు...

Thursday, September 3, 2015 - 17:32

ఈ శుక్రవారం టాలీవుడ్‌లో ఇద్దరు హీరోల మధ్య బిగ్ ఫైట్ జరుగబోతోంది. 'నాని' హీరోగా తెరకెక్కిన 'భలే భలే మగాడివోయ్'.. 'విష్ణు' నటించిన 'డైనమైట్' సినిమాలు ఈ శుక్రవారం రానున్నాయి. కమర్షియల్ సక్సెస్ కోసం ఈసారి హీరోలతో పాటు డైరెక్టర్స్ కూడా పోటీ పడుతున్నారు. ఈ మధ్య అంతగా హిట్ లు లేని విష్ణు ఈ సినిమా ద్వారా మంచి విజయం సాధిస్తాడని టాక్. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న 'నాని' సినిమా...

Thursday, September 3, 2015 - 10:44

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌(సివిఎం)లు నిర్మించిన 'శ్రీమంతుడు' చిత్రం 25 రోజుల్లోనే 154 కోట్ల గ్రాస్‌ను, 95,32,42,733 రూపాయల షేర్‌ సాధించి 'బాహుబలి' మినహా టాలీవుడ్‌ ఇండిస్టీకి నెంబర్‌ వన్‌ హిట్‌గా నిలిచిందని ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా మహేష్‌...

Wednesday, September 2, 2015 - 08:49

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ విడుదల చేశారు. పోలీస్ డ్రెస్ లో, ఎర్ర శాలువా బుజంపై దరించి గుర్రాన్ని పట్టుకుని పవన్ స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే టీజర్ ఒక్క రోజులోనే లక్షల హిట్స్ దక్కించుకుంది. 

Tuesday, September 1, 2015 - 20:31

హైదరాబాద్‌ : ఎవరైనా సరే తనకు తాను ఎదగాలని కానీ.. అండదండలు చూసుకుని ముందుకెళ్లకూడదని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. వరుణ్‌తేజ కంచె సినిమా ట్రైలర్‌ విడుదల సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ... పెద్ద సినిమా ఫ్యామిలీ నుండి వస్తున్నవారికి ఆ కుటుంబం నుండి రావడం ఎంత వరమో.. అంతే శాపమన్నారు. ఇండస్ట్రీలో ముందు నుండి కొనసాగుతున్న వారు సలహాలు ఇస్తుంటారని, ప్రతి విషయాన్ని...

Tuesday, September 1, 2015 - 17:56

హైదరాబాద్ : అతడి పేరు ఒక సంచలనం..అతడి మాట..ఒక ప్రభంజనం..అతడి చూపు..ఒక ప్రకంపనం..అతడి మ్యానరిజమ్..ఒక విస్ఫోటనం..దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరపై తిరుగులేని పవర్ తో..చెలరేగుతున్న ఆ ఆరడుగుల బుల్లెట్ పవన్ కళ్యాణ్. ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

పవన్ అంటే ఒక స్టైల్..
పవర్ స్టార్ అంటే ఒక స్టైల్. అతడి నడక, మాటలు,...

Tuesday, September 1, 2015 - 11:35

మెగా ఫ్యామిలీ నుండి వెండి తెరకు పరిచయమైన 'వరుణ్ తేజ్' తాజాగా నటిస్తున్న 'కంచె' సినిమా ట్రైలర్ విడుదలైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 'క్రిష్' దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'ప్రగ్వా జైస్వాల్' హీరోయిన్ గా నటిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో 'కంచె' చిత్రం తెరకెక్కినట్లు సమాచారం. బ్రిటీష్ వారికి, జమీందార్...

Tuesday, September 1, 2015 - 10:47

హైదరాబాద్ : దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఢిల్లీ హైకోర్టు రూ. పది లక్షల జరిమాన విధించింది. 2007 సంవత్సరంలో వర్మ 'ఆగ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించాడు. 1975లో హిందీలో విజయం సాధించిన 'షో'లే చిత్రానికి ఇది రీమెక్. ఒరిజినల్ సినిమాలో సన్నివేశాలు..పాత్రలు..నేపథ్య సంగీతాన్ని కాపీ చేశారని 'షో'లే నిర్మాత మనవడు సచ్చా సిప్పి కాపీరైట్ కింద వర్మపై గతంలో కేసు పెట్టిన సంగతి...

Monday, August 31, 2015 - 18:45

హైదరాబాద్ : పద్మాలయా శాఖమూరి మల్లికార్జునరావు తనయుడు శివ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్‌గా జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్‌, గోవర్షిణి ఫిలింస్‌ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అనగనగా ఒక చిత్రమ్‌'. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుని 'యు బై ఎ' సర్టిఫికెట్‌ను పొందిందీ చిత్రం. ఈ సందర్భంగా దర్శక,...

Monday, August 31, 2015 - 18:20

భిన్న నేపథ్యాలతో రూపొందిన 'మసాన్‌', 'ధనక్‌', 'బ్లాక్‌ హార్స్‌ మెమరీస్‌' చిత్రాలు 20వ బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ప్రదర్శితం కానున్నాయి. ఒకే నిర్మాణ సంస్థ దృశ్యం ఫిలిమ్స్‌ ఈ మూడు చిత్రాల్ని నిర్మించడం విశేషం. నీరజ్‌ గవాన్‌ దర్శకత్వంలో 'మసాన్‌', నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో 'ధనక్‌', శ్యామ్‌రామ్‌ అలీది దర్శకత్వంలో 'బ్లాక్‌ హార్స్‌ మెమరీస్‌' చిత్రాలు రూపొందాయి. ఈ...

Monday, August 31, 2015 - 18:11

చెన్నై: దక్షిణాది సినీ పరిశ్రమలోని నటీనటుల ఆత్మీయ కలయిక శనివారం సాయంత్రం చెన్నై ఒలివ్‌ బీచ్‌లోని నీనారెడ్డి గెస్ట్‌హౌస్‌లో జరిగింది. 1980 నాటి నటీనటులంతా ఈ అరుదైన గెట్‌ టు గెదర్‌లో పాల్గొని సందడి చేశారు. చిరంజీవి, వెంకటేష్‌, ప్రభు, భానుచందర్‌, నరేష్‌, సుమన్‌, మోహన్‌లాల్‌, భాగ్యరాజా, సత్యరాజ్‌, జాకీషరాఫ్‌, జయసుధ, సుమలత, సుహాసిని, రాధ, రాధిక, శోభన, ఖుష్బూ,...

Monday, August 31, 2015 - 08:01

నితిన్‌, సమంత నాయకా నాయికలుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించబోయే చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు సెప్టెంబర్‌ మూడోవారంలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను నిర్మాత రాధాకృష్ణ మీడియాకు తెలియచేశారు. 'త్రివిక్రమ్‌' దర్శకత్వంలో ఇప్పటికే తమ బ్యానర్‌ ద్వారా 'జులాయి', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి'...

Saturday, August 29, 2015 - 22:01

ఎప్పుడెప్పుడా అని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్కినేని వంశంలో మూడో తరానికి చెందిన మరో హీరో తెరంగేట్రం చేసేశాడు. అఖిల్ హీరోగా.. అదే పేరుతో వస్తున్న సినిమా టీజర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ స్వయంగా వచ్చి ఈ టీజర్ విడుదల చేశారు. అఖిల్ ను మొదటి సినిమాలోనే తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలతో పరిచయం దర్శకుడు వీవీ వినాయక్ చేశాడు.

 

Saturday, August 29, 2015 - 17:32

'అక్కినేని నాగార్జున' జన్మదిన కానుకలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. 'నాగార్జున' నట వారసుడు 'నాగ చైతన్య' నటిస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో చైతన్య విడుదల చేశాడు. అనంతరం సాయంత్రం ఐదు గంటలకు చిత్ర టీజర్ విడుదల చేశారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్ రెహమాన్...

Saturday, August 29, 2015 - 12:10

'అక్కినేని నాగార్జున' నటిస్తున్న ‘సొగ్గాడే చిన్ని నాయన’ టీజర్ విడుదలైంది. శనివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో 'నాగ్' డబుల్ రోల్ చేస్తున్నట్లు టాక్. ఇక నాగ్ కు జోడిగా 'రమ్యకృష్ణ', 'లావణ్య త్రిపాఠి'లు నటిస్తున్నారు. ఇన్నేళ్ళ తరువాత...

Saturday, August 29, 2015 - 10:28

అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే రూపం, నాగార్జున ప్రత్యేకత. ముఖ్యంగా రొమాంటిక్ లుక్ ఆయన ట్రేడ్ మార్క్ స్టైల్. ఎంత వయసొచ్చినా ఇంకా నవయవ్వనుడిగా కనిపించడం ఆయకు మాత్రమే సాధ్యమైంది. అందుకే ఆయన టాలీవుడ్ కు ఎప్పటికీ మన్మధుడు. నాగార్జున మొదటి సినిమా నుంచి నిన్న మొన్నటి సినిమా వరుకూ పరిశీలిస్తే ఒక విషయం క్లియర్ గా తెలుస్తుంది. ఆయన ఎన్ని మాస్ సినిమాలు, ఇంకెన్ని క్లాస్ సినిమాలు చేసినా.....

Friday, August 28, 2015 - 23:02

            టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి గాడ్ ఫాదర్స్ లేకుండానే హీరోగా ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినా సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా అలరిస్తూ వస్తున్నారు హీరో సుమన్.  ఆయన పుట్టిన రోజు సందర్భంగా 10టీవీ ప్రేక్షకులతో తన స్మృతులను, పంచుకున్నారు. తను సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఒక మిరాకిల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ...

Friday, August 28, 2015 - 17:43

'ఊరు మనకు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేదా లావయిపోతాం' అంటూ వచ్చిన సందేశాత్మక కమర్షియల్ చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రానికి మరిని సొగబులు అద్దబోతోంది చిత్ర యూనిట్. 'శ్రీమంతుడు' చిత్రంలో కొన్ని సన్నివేశాలను జత చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ అధినేతలు గురువారం వెల్లడించారు. ప్రస్తుతం మూడో వారం...

Friday, August 28, 2015 - 17:34

తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ఆస్కార్ రేసులో ఉంది. ప్రముఖ దర్శకుడు అమోల్‌ పాలేకర్‌ నేతృత్వంలో ఆస్కార్‌ ఎంపిక ప్యానల్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. వారు భారత్‌ తరఫున ఆస్కార్‌ అకాడమీ అవార్డుల నామినేషన్స్‌కి పంపాల్సిన 45 సినిమాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్‌ చేయాలని మన తెలుగు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారు టాలీవుడ్‌ నుంచి 'బాహుబలి'...

Thursday, August 27, 2015 - 17:34

ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున తనయుడు 'అఖిల్' తొలిసారిగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ గురువారం విడుదలైంది. 'అఖిల్' పేరిట ఈ పోస్టర్ విడుదలైంది. 29వ తేదీన 'నాగార్జున' పుట్టిన రోజు కానుకగా టీజర్ ని విడుదల చేస్తారని టాలీవుడ్ టాక్. ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నటుడు నితిన్...

Thursday, August 27, 2015 - 16:28

రాజేంద్రప్రసాద్ హీరోగా గతంలో వచ్చిన 'లేడీస్ టైలర్' చిత్రం మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు వంశీ దీనికి స్వీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్రలో సీక్వెల్ లో 'రాజ్ తరుణ్' నటించనున్నాడు. ఇందులో 'రాజేంద్రప్రసాద్' కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారంట.'సన్ అఫ్ లేడీస్ టైలర్' అనే టైటిల్ ని ఫిక్స్ చెయ్యనున్నారని టాక్. మధుర శ్రీధర్...

Thursday, August 27, 2015 - 16:13

పురుషులు మారాల్సిన సమయం వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేర్కొంది. ఓ టివి ఛానెల్ తో ఆమె మాట్లాడింది. తాను సినీ రంగంలోకి ప్రవేశించినప్పుడు కొంతమంది వక్రదృష్టితో చూసేవారని, కొంతమందైతే చులకనగా మాట్లాడేవారని పేర్కొంది. హీరోయిన్లు..హీరోలు లేదా నిర్మాతలపై ఆధార పడుతారని, అలాంటి వారు 'క్యా కరేగీ' అంటూ వ్యంగ్యంగా అడుగుతారని తెలిపింది. మహిళలపై పురుషుల అభిప్రాయాలు మార్చుకోవాలని,...

Thursday, August 27, 2015 - 11:43

హైదరాబాద్ : కన్యాశుల్కం అనగానే మనకు గుర్తొచ్చేది గురజాడ అప్పారావుగారు. కాని నాటి నేటి తరానికి కూడా గుర్తొచ్చేది ఎన్టీఆర్‌, సావిత్రి. సిగరెట్‌ తాగనోడు దున్నపోతై పుట్టున్‌ అంటూ గిరీశం కేరెక్టర్‌లో లీనమైపోయి ఎన్టీఆర్‌ పొగ వదులుతుంటే ఇప్పటికీ సరదాగా ఉంటుంది. సాత్వికంగా ఉండే సావిత్రి సైతం కవ్వింపు మాటలతో కులుకుతూ చేసిన నటనతో పెదవులపై చిరునవ్వు రాకుండా మానదు. ఇక సుబ్బిశెట్టి...

Thursday, August 27, 2015 - 10:41

హైదరాబాద్ : శ్రీమంతుడి రాక కోసం ఆ గ్రామం ఎన్నేళ్లగానో వేచి చూస్తోంది. రాజకుమారుడి.. పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూ గ్రామ కూడలిలో పెద్దలు, మహిళలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎప్పడెప్పుడు వస్తాడా.. మా నేలమీద ఎప్పుడు అడుగు పెడతాడా అని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఆ గ్రామం ఒక్కడి కోసం ఇంతలా ఎందుకు ఎదురుచూస్తోంది? శ్రీమంతుడి కాన్సెప్టా? లేక...

Thursday, August 27, 2015 - 09:54

చెన్నై : మళయాళ నటి 'నీతూ కృష్ణ వాసు' (28)ను పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు పత్రాలు సమర్పించి యూఎస్ కాన్సులేట్ ను మోసం చేయడంతో పాటు దొంగదారిలో అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నించిందనే కాన్సులేట్ అధికారుల ఫిర్యాదు మేరకు నటిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ తాను మోస పోయానని కృష్ణ వాసు వాపోయినట్లు తెలుస్తోంది. చెన్నై వెళ్లి వీసా తీసుకోవాలంటే రూ.2లక్షలు అవుతుందని...

Wednesday, August 26, 2015 - 20:03

పవర్ స్టార్ 'పవన్ కల్యాణ్' నటించే చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలు పెంచుకుంటుంటారు. చిత్రానికి సంబంధించిన మొదటి ఫొటో, టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అంతలా కేజ్రీ పెంచుకున్న పవన్ కల్యాణ్ తాజాగా 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఆగస్టు 15న విడుదల చేసిన...

Pages

Don't Miss