Cinema

Monday, July 6, 2015 - 18:45

మళయాళంలో ఘనవిజయం సాధించిన 'ప్రేమమ్‌' చిత్రాన్ని రామ్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే 'ప్రేమమ్‌' చిత్రానికి సంబంధించి రీమేక్‌ రైట్స్ ను నిర్మాత స్రవంతి రవికిషోర్‌ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు సమాచారం. 'పండగ చేస్కో' చిత్రం తర్వాత రామ్‌ 'శివమ్‌', 'హరికథ' చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సరైన విజయాలు లేని రామ్‌కి ఈ సరికొత్త...

Monday, July 6, 2015 - 18:40

అక్షరుకుమార్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా అన్నదమ్ములుగా కరణ్‌జోహార్‌ నిర్మిస్తున్న 'బ్రదర్స్' చిత్రంలోని ఓ స్పెషల్‌ మాస్‌ మసాలా సాంగ్‌లో కరీనా కపూర్‌ మెరవనుంది. 'మేరా నామ్‌ మేరీ' అంటూ సాగే ఐటమ్‌ సాంగ్‌లో అందాల్ని ఆరబోస్తూ స్పైసీగా ఉన్న కరీనాకపూర్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను నిర్మాత కరణ్‌ జోహార్‌ విడుదల చేశారు. 'ఫెవికాల్‌ సే...' ఐటమ్‌ సాంగ్‌తో ఓ ఊపుఊపేసిన కరీనా, ఈ చిత్రంలో సైతం హాట్...

Monday, July 6, 2015 - 18:33

భారత మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'అజహర్‌' పేరుతో బాలీవుడ్‌లో సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో అజహర్‌ పాత్రలో ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. అజారుద్దీన్‌ భార్య సంగీత బిజ్లానీ పాత్ర కోసం నర్గీస్‌ ఫక్రీని సంప్రదించారట. కథ నచ్చి నర్గీస్‌ కూడా అంగీకారం తెలపడంతో సినిమాపై మరికొంత ఆసక్తి నెలకొంది. తొలుత ఈ పాత్ర కోసం కరీనాకపూర్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్...

Monday, July 6, 2015 - 17:33

హైదరాబాద్ : నేను ఏది పడితే అది మాట్లాడనని సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు రాజకీయాలు కొత్త అని, దేశం పట్ల నాకు అవగాహన ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపై కూడా ఆయన అభిప్రాయాలు తెలిపారు...

Sunday, July 5, 2015 - 21:09

సినీనటి, బాహుబలి హీరోయిన్ తమన్నాతో టెన్ టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా తమన్నా బాహుబలి సినిమా షూటింగ్ అనుభవాలను వివరించారు. సినిమా అద్భుతంగా ఉంటుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Friday, July 3, 2015 - 06:42

జైపూర్ : సినీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, హేమమాలిని గాయపడ్డారు. మధుర నుంచి జైపూర్ వైపు వెళ్తున్న ఆమె ప్రయాణిస్తున్న బెంజ్ కారు దౌసా వద్ద ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆల్టోలో ప్రయాణిస్తన్న నాలుగేళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కాగా హేమమాలిని...

Thursday, July 2, 2015 - 19:06

పి.వి.పి. పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి. వి.ప్రసాద్‌ దర్శకత్వంలో నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రం తాజా షెడ్యూల్‌ యూరప్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ..'నా కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ కమర్షియల్‌ చిత్రమవుతుంది' అని చెప్పారు. 'నాగార్జునలాంటి స్టార్‌తో తొలిసారిగా తెలుగు స్ట్రయిట్‌...

Thursday, July 2, 2015 - 18:46

మంచు లక్ష్మికి తెలుగు సినిమా ప్రేక్షకుల పై విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో తెలుగు సినిమా ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ మంచులక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది. రియలిస్టిక్ సబ్జెక్ట్స్, కమర్షియాలిటీ లేని సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఆదరించడం లేదో తనకు అర్ధం కావడం లేదని దీనివల్ల మంచి సినిమాలను తీయాలని కోరిక ఉన్నా ఏమి చేయలేక మౌనం వహించవలసి వస్తోందని కామెంట్స్ చేసింది....

Thursday, July 2, 2015 - 18:46

హైదరాబాద్‌: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ తన పెళ్లిపై దృష్టిపడింది. పెళ్ళి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సల్మాన్‌ఖాన్‌ తెలిపారు. ఒక పత్రిక కోసం ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'బాలీవుడ్‌ నటుడు సాహిద్‌ కపూర్‌ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటున్నారు. మీకు ఆలాంటి ఆలోచన ఏమైనా ఉందా' అని విలేకరులు ఆడిగిన ప్రశ్నకు సల్మాన్‌ స్పందించారు. '...

Thursday, July 2, 2015 - 14:25

హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్‌ అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లో పవన్‌కి ఆంటీగా సింగర్‌ సునీత నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. నిజానికి సింగర్‌ సునీతని చాలామంది దర్శకులు సినిమాల్లో ఇంట్రడ్యూస్‌ చేయడానికి ప్రయత్నించారు. కాని అవేవీ వర్కవుట్‌ కాలేదు. నిజానికి మహేష్‌బాబు మూవీలో నటిస్తుందనే వార్తలొచ్చాయి. కాని అవేవీ నిజం కాలేదు. తాజాగా త్రివిక్రమ్‌ మూవీలో పవన్‌ పిన్నిగా...

Wednesday, July 1, 2015 - 18:45

అజిత్‌...తమిళ అగ్రనటుడిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆయనొక పక్కా ప్రొఫెషనల్‌ ఫైలట్‌గా ఆర్‌సి ప్లేన్స్‌, హెలికాప్టర్స్‌ నడుపుతారనిగాని, ఫార్ములా 2 కారు రేసింగ్స్‌లో పాల్గొంటారని, అద్భుతమైన ఫొటోల్ని తీసే ఫొటోగ్రాఫర్‌ అనే సంగతి చాలా మందికి తెలీయదు. ఆయనలోని ఇన్ని కోణాల జాబితాలోకి మరో కొత్త కోణం జత కానుంది. త్వరలోనే ఓ షార్ట్‌ ఫిల్మ్‌తో ఆయన దర్శకుడిగా మారబోతున్నారు. స్క్రిప్ట్‌...

Wednesday, July 1, 2015 - 17:37

తపస్‌ జేనా, ప్రదీప్‌ దాష్‌ దర్శకత్వంలో.. సంబిత్‌, కె.కె, మౌసుమి, స్నేహ, ఎల్లి ప్రధాన పాత్రల్లో, ప్రదీప్‌ కుమార్‌ అర్ర నిర్మించిన 'ప్రమాదం' చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో కె.కె మాట్లాడుతూ, 'ఇది పూర్తి స్థాయి హర్రర్‌ చిత్రం. హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కోసం అందరు హార్డ్‌ వర్క్‌ చేశారు. అందరి...

Wednesday, July 1, 2015 - 17:18

విక్టరీ వెంకటేష్‌, మాంత్రిక దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' వంటి చిత్రాలు వచ్చాయి. మళయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన 'భాస్కర్‌ ద రాస్కెల్‌' చిత్రాన్ని ఈ కాంబినేషన్‌లో రీమేక్‌ చేస్తున్నారని తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రీమేక్‌ హక్కుల్ని డి.సురేష్‌బాబు...

Wednesday, July 1, 2015 - 13:38

హైదరాబాద్ : తనను చూడాలని ఉందని కేన్సర్ బాధిత చిన్నారుల కోరికను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తీర్చారు. నగరంలోని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కలుసుకున్న బన్సీ సరదాగా ముచ్చటించారు. గంటపాటు చిన్నారులతో అల్లు అర్జున్ ఉల్లాసంగా గడిపారు. చిన్నారుల ఆరోగ్య సమాచారాన్ని కుటుంబ సభ్యులు..వైద్యులను బన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా...

Monday, June 29, 2015 - 13:44

హైదరాబాద్ : టెన్‌ టీవీ ప్రయత్నానికి ఫలితం దక్కింది. వేదం ఫేం నాగయ్యకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లక్ష రూపాయాల ఆర్థికసాయం చేశారు. నాగయ్య కష్టాలపై టెన్‌ టీవీ నిన్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. కష్టాల్లో కళాకారుడిని ఆదుకునే ప్రయత్నం చేసింది. టెన్‌టీవీ ప్రసారానికి భారీ స్పందన వస్తోంది. నాగయ్యకు ఆర్థిక సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. కళాకారున్ని...

Monday, June 29, 2015 - 13:39

హైదరాబాద్ : జనసేన అధినేత 'పవన్‌ కళ్యాణ్‌' ట్విట్టర్‌లో మరోసారి స్పందించారు. ఓటుకు నోటు కేసు, ఫోన్‌ ట్యాపింగ్‌, సెక్షన్‌-8పై రెండు రోజుల్లో స్పందిస్తానని చెప్పారు. లేదంటే ఈ వారంలో ప్రెస్‌మీట్‌ పెడుతానని ట్విట్టర్‌లో పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. 

Sunday, June 28, 2015 - 16:17

క్రిష్ దర్శకత్వం లో రూపొందిన 'వేదం' చిత్రంలో రాములు పాత్రలో 'నాగయ్య' తెలుగు తెరకు పరిచయమయ్యాడు. 'వేదం' సినిమాలో సిరిసిల్ల నేత కార్మికుడిగా చేసిన పాత్రలో నాగయ్య నటించలేదు జీవించాడు అనేక ప్రశంనలు లభించాయి. కానీ తర్వాత ఒకటీ అరా చిత్రాల్లో కనిపించినా పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తనకు అవకాశాలు ఎవరైనా ఇవ్వకపోతారా అనే ఆశతో ఫిల్మ్ నగర్ లో అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ...

Sunday, June 28, 2015 - 14:38

'జక్కన్న' టాలీవుడ్ లో ఓ 'మాయల మాంత్రికుడు' తన విజువలైజేషన్ ను తెరమీద చూపించడంలో దిట్ట. 400 ఏళ్ల వెనక్కి వెళ్లి మరీ ప్రేక్షకులను మెస్మరైస్ చేశాడు. ఇప్పుడు భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో 'బాహుబలి' నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రాసుకున్న కథకు 2.30 గంటలు సరిపోవని రెండు పార్టులుగా తీస్తున్నాడు. అయితే ఇంత ఇమాజినేషన్ ఫవర్ ఉన్న రాజమౌళి మేథో శక్తి...

Sunday, June 28, 2015 - 14:25

వేదాద్రి ఫిలింస్‌ సమర్పణలో ప్రిన్స్‌, సునైన, అశ్విన్‌ హీరో హీరోయిన్లుగా 9స్టార్‌ ప్రొడక్షన్స్‌ బేనర్‌పై రూపొందుతోన్న చిత్రం 'పెళ్లికి ముందు ప్రేమకథ'. మధు గోపు దర్శకత్వంలో సుధాకర్‌ పట్నం, నాగేశ్వరరావు సిహెచ్‌వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో చిత్రం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి అల్లరి నరేష్‌ క్లాప్‌ కొట్టగా, అనంత్‌ రెడ్డి కెమేరా స్విచ్చాన్‌ చేశారు....

Sunday, June 28, 2015 - 14:22

నయన తార, ఉదయనిధి స్టాలిన్ కాంబినేషన్ లో వస్తున్న 'శ్రీనుగాడి లవ్ స్టోరీ' సినిమాకు కష్టాలమీద కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ సినిమా కష్టాల గురించి నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆవేదన చెప్పుకున్నారు. పెద్ద సినిమాల రిలీజ్‌కు సంబంధించి సరైన ప్లానింగ్‌ లేకపోవడం కారణంగా ఒకటికి రెండుసార్లు వాయిదా పడుతుండడం.. చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతోందని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ...

Sunday, June 28, 2015 - 14:15

       మోహన్‌బాబు, అల్లరినరేష్‌ కాంబినేషన్‌లో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ,'ఇదొక వైవిధ్యమైన కథ. నాన్నగారు, అల్లరినరేష్‌ కాంబినేషన్‌లో రూపొందే ఈ భారీ చిత్రం షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించనున్నాం. 'బొమ్మన బ్రదర్స్‌ చందన సిస్టర్స్‌', 'ఢమరుకం' వంటి విజయవంతమైన చిత్రాలకు...

Sunday, June 28, 2015 - 14:09

తను సాధించిన ఫిల్మ్ ఫేర్ అవార్డును స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావుకు అంకితం చేస్తున్నట్లు టాలీవుడ్ హీరో అల్లుఅర్జును ప్రకటించారు.  ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2015 లో బాగంగా 'రేసుగుర్రం' చిత్రానికి అల్లు అర్జున్ ఉత్తమనటుడి అవార్డు పొందాడు. కాగా ఈ అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'నేను పొందిన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావుకు అంకితమివ్వడం ఆనందంగా...

Sunday, June 28, 2015 - 13:59

              బార్యా భర్తలిరువురూ సినిమా రంగంలోనే పని చేస్తున్నారు. కానీ ఇంత వరకు ఒక్క  సినిమాలోనూ కలిసి చేయలేదు. ఇప్పుడు ఓ ప్రాజెక్టులో ఆ జంట తొలిసారిగా కలిసి చేయబోతోంది. బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ, ఆమె భర్త, పాటల రచయిత జావేద్‌ అక్తర్‌, షబానా సోదరుడు, సినిమాటోగ్రాఫర్‌ బాబా అజ్మీ కలిసి ఒకే సినిమాకు పనిచేయబోతున్నారు. ఉపాధ్యాయుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ బాలీవుడ్‌...

Pages

Don't Miss