Cinema

Monday, July 23, 2018 - 11:38

ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆనంతోత్సాహాల మధ్య వివాహం చేసుకున్న అక్కినేని జంట నాగ చైతన్య, సమంతాలు అంతే ఆనందగా వివాహం అనంతరం కూడా సందడి సందడిగా వారి దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. హిట్ పెయిర్ గా పేరొందిన ఈ జంట మరోసారి తెరపై అక్కినేని అభిమానులను, ప్రేక్షకులను అలరించనున్నారు. వివాహానికి ముందు తరువాత కూడా సమంతా సినిమాలు సూపర్ హిట్ హవాను కొనసాగిస్తున్నాయి. మరోపక్క...

Monday, July 23, 2018 - 10:38

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న వేళ సోషల్ మీడియాలో చిన్ని చిన్న పొరపాట్లు జరుగతుండటం సహజంగా జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో ఒకటైన ట్విట్టర్ ను సెలబ్రిటీలు తమ సందేశాలుగా వినిగిస్తుండటం పరిపాటిగా మారిపోయింది. ఈ క్రమంలో ట్విట్టర్ లో చిన్నిపాటి అంతరాయం ఏర్పడినా దానిపై కూడా సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలో మోగా పవర్ స్టార్ భార్య ఉపాసన ట్విట్టర్ లో తలెత్తిన...

Sunday, July 22, 2018 - 08:12

సంగారెడ్డి : జిల్లాలోని బోల్లారంలోని డిజైర్‌ సొసైటీలోఉన్న ఎయిడ్స్‌ బాధిత పిల్లలను బిగ్‌బాస్‌ 2 పార్టిసిపెంట్‌ భానుశ్రీ కలిశారు. బాధిత పిల్లలకు భోజనం పెట్టి వారితో డాన్సులు చేశారు. పిల్లలతో గడపడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

 

Saturday, July 21, 2018 - 20:21

'ఆటకదరా శివ' మూవీ టీంతో టెన్ టివి స్పెషల్ షో నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో ఉదయ్, డైరెక్టర్ చంద్రసిద్ధార్థ, నటుడు చంటి మాట్లాడుతూ తమ సినిమా అనుభవాలను తెలిపారు. డైరెక్టర్ దశరథ్, గేయి రచయిత చైతన్య ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పి పట్నాయక్ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Saturday, July 21, 2018 - 17:12

సినిమా అంటే రంగుల ప్రపంచం. బైటనుండి చూస్తే అంతా రంగుల ప్రపంచంలాగనే కనిపిస్తుంది. దగ్గరకెళ్లి చూస్తేనే తెలుస్తాయి అసలైన రంగులు. ఒకరిని సెలక్ట్ చేసిన పాత్రల్లోకి మరొకరు ఆటో మేటిగ్గా వచ్చేస్తారు. ఒకరి అవకాశాలను మరొకరు సునాయాసంగా జేజిక్కించుకుంటారు. ఫలానా సినిమాలోల ఫలానా వ్యక్తి అని ప్రకటించినా..కొంతమేరకు షూటింగ్ కూడా జరిగిపోయినా..వెండి తెరపై వారు కనిపించేంత వరకూ ఆ పాత్రలో...

Saturday, July 21, 2018 - 16:17

కంటెంట్ వుంటే చాలు ఆ సినిమా చిన్నదా? పెద్దదా? అని సిని ప్రేక్షకులు పట్టించుకోరు. దీంతో తెలుగు తెరపై చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. కంటెంట్ వుంటే చాలు పెద్ద సినిమాలతో సమానంగా చిన్న సినిమాలు వసూళ్లను రాబడుతున్నాయి. ప్రేమకథతో వస్తున్న ఈ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా మారి సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై 'పేపర్...

Saturday, July 21, 2018 - 15:53

తెలుగు సినిమా పరిశ్రమలో మరో వారసుడు బెల్లంకొండ శ్రీను. అల్లుడి శీను అంటు వచ్చి మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ శీను తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు 'సాక్ష్యం' తో రానున్నాడు. దర్శకుడు శ్రీవాస్ గత చిత్రాలు కూడా మాస్ ఆడియన్స్ ను మెప్పించినవే కావటం మరో విశేషం. ఈ ఇద్దరి మాస్ కాంబినేషన్ లో రూపొందిన 'సాక్ష్యం' చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రావలసి వుంది. కాగా ఈ సినిమాకి...

Saturday, July 21, 2018 - 15:45

ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'జై లవ కుశ' ముందుగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ నటనకు ఈ సినిమా ఒక మచ్చు తునక. మూడు వేరేషన్ గల త్రిపాత్రాభినంతో..తారక్ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాడు. ముఖ్యంగా నెగిటివ్ షేడ్ లో తారక్ నటన అద్భుతమని చెప్పాలి. కష్టపడి, ఇష్టపడి చేసిన పనికి తప్పకుండా ఫలితం దక్కుతుంది అనే మాటకు నిదర్శనం ఈ 'జై లవకుశ' సినిమా. బాబీ దర్శకత్వం వహించిన ఈ...

Saturday, July 21, 2018 - 10:53

టాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాతగా పేరొందిన 'దిల్' రాజు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఎంతో మంది కొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు. ఆయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం 'లవర్'. ఈ సినిమాను అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. గతంలో 'అలా ఎలా’సినిమా ద్వారా దర్శకుడిగా ఇతను పరిచయమయ్యారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న...

Wednesday, July 18, 2018 - 18:47

లవర్ మూవీ హీరోయిన్ రిధితో టెన్ టివి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె తన సిని అనుభవాలను తెలిపారు. సినీ కెరీర్ ను వివరించారు. పలు ఆసక్తికర విషయాలు వెలిబుచ్చారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

Wednesday, July 18, 2018 - 17:22

చెన్నై : తమిళ నటి ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాట పలు సినిమాలు, సీరియల్స్‌లలో ప్రియాంక నటించింది. అయితే కుటుంబకలహాలే ప్రియాంక ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Monday, July 16, 2018 - 13:11

'మహానటి'గా కీర్తి సురేశ్ నటన విమర్శకులు ప్రశంసల్ని అందుకుంది. తన ముగ్ధ మనోహరమైన నటనతో హేమా హేమీలను మెప్పించటమేకాకుండా వారి ప్రశంసల్ని కూడా పొందింది కీర్తీ సురేశ్. ఇక ఆ సినిమా దేశ విదేశాలలో సాధించిన వసూళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేశారు. కీర్తీకి మహానటి సినిమా ఒక వరమనే చెప్పాలి. అవకాశం రావటం ఒక ఎత్తు అయితే..నటనలో మహానటిని గుర్తు చేయటం సాధారణవిషయం కాదు. ఆ సినిమాను ఒప్పుకోవటం...

Sunday, July 15, 2018 - 16:35

విజయవాడ : కానూరులోని సోమనాథ్‌ ఆసుపత్రిలో క్యాన్సర్ రోగులను హీరో జగపతి బాబు పరామర్శించారు. రూట్స్ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో క్యాన్సర్‌కి ఉచిత వైద్యం చేయడాన్ని ఆయన అభినందించారు. బాధితులను అన్ని విధాలా అదుకోవడం మంచి పరిణామమని, ఈ తరహా వైద్యాన్ని అందించడం ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని జగపతి బాబు అన్నారు. ప్రజలందరూ కాలానుగుణంగా అనారోగ్యానికి గురికాకుండా...

Saturday, July 14, 2018 - 20:44

కామన్ మెన్ కోటాలో 'బిగ్ బాస్ -2' హౌస్ లోకి వెళ్లిన 'సంజన' తొలి వారంలోనే ఎలిమినేట్ కావడం ఆమె అభిమానులను ఆశ్చర్యపరిచింది. అనూహ్య మలుపులు వద్ద ఇతరులతో పోటీ పడిన సంజన చివరకు ఎలిమినేట్ అయ్యింది. ఈ సందర్భంగా టెన్ టివి ఆమెతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె సంచలన విషయాలు వెల్లడించారు. ఈసారి ఎలాగైనా 'సంజన'ను ఇంటినుంచి పంపించేయాలని తేజస్వీ,తనీష్ ప్లాన్ చేశారని...'సంజన',...

Saturday, July 14, 2018 - 09:45

హైదరాబాద్ : టాలీవుడ్ లో విషాదం నెలకొంది. తెలుగు చిత్ర పరిశ్రమ మరో సీనియర్ నటుడిని కోల్పోయింది. సీనియర్ సినీనటుడు వినోద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మృతి చెందారు. బ్రెయిన్ స్ట్రోక్ తో తెల్లవారుజామున 2 గంటలకు వినోద్ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆయన అనార్యోగంతో బాధపడుతున్నారు. హీరోగా ప్రస్తానం మొదలు పెట్టిన వినోద్ 300 పైగా చిత్రాల్లో నటించారు....

Thursday, July 12, 2018 - 19:04

'విజేత' సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందొ సినిమా చూసొచ్చిన వాళ్ల మాటల్లోనే...'విజేత’ సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్. చూశాం 'విజేత' సినిమాపై టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ...ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత 'విజేత సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి.

 

Thursday, July 12, 2018 - 19:00

'RX100' సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందో సినిమా చూసొచ్చిన వాళ్ల మాటల్లోనే విందాం. 'RX100' సినిమా చూసిన ప్రేక్షకుల ఫీలింగ్స్ 'RX100' సినిమాపై టెన్ టివి సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి ఉన్నారు ఆ రివ్యూ...ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత 'RX100' సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ కోసం వీడియో...

Thursday, July 12, 2018 - 15:24

తెలుగులో బిగ్ బాస్ 2ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతోంది. కొంతమంది సభ్యుల మధ్య వుండే గ్రూప్స్ ను సున్నితంగానే కాకుండా సూటిగా బిగ్ నిర్వాహకులు విడదీసి వారిలో వారికే పోటీలు,టార్గెట్ లు పెట్టి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ హిట్ కావ‌డంతో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ భారీ అంచనాల మ‌ధ్య మొద‌లైంది. సీజన్ 1కి యంగ్ టైగర్...

Thursday, July 12, 2018 - 14:18

చిత్తూరు : తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వర్థమాన నటుడు 'హరి' ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో పలు టీవీ కామెడీ షోల్లో నటించాడు. ఇతనిపై 20 ఎర్రచందనం కేసులున్నాయని..పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్నా ఇతను టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓ సినిమా కోసం రహస్యంగా ఫైనాన్స్ చేసింది హరి అని పోలీసులు అనుమానిస్తున్నారు....

Monday, July 9, 2018 - 13:11

హైదరాబాద్ : శ్రీరాముడిపై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కత్తి మహేష్ వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్మ యాత్ర చేస్తానన్న స్వామి పరిపూర్ణానంద స్వామిని గృహ నిర్భందం చేయడం..కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేయడం వంటి పరిణామాలు జరిగాయి. కత్తి మహేష్ ను ఏపీ పోలీసులు చిత్తూరు జిల్లాకు తరలించారు.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి ఇంటి వద్ద...

Monday, July 9, 2018 - 11:14

హైదరాబాద్ : పరిపూర్ణానంద స్వామిని పోలీసులు ఇంటి నుండి బయటకు రానివ్వడం లేదు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి సోమవారం వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు గృహ నిర్భందం చేశారు. హిందూ ధర్మ యాత్రకు అనుమతి లేదని రాచకొండ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు ఆయన యాత్ర చేపడితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు....

Monday, July 9, 2018 - 11:12

హైదరాబాద్ : సినీ క్రిటిక్ కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు పడింది. ఆయన్ను నగరం నుండి బహిష్కరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఆయన్ను ఏపీ పోలీసులకు అప్పచెప్పారు. ఇటీవలే శ్రీరాముడి విషయంలో కత్తి మహేష్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం రేగింది. కత్తి మహేష్ పై వెంటనే అరెస్టు చేయాలని..చర్యలు తీసుకోవాలంటూ...

Pages

Don't Miss