Cinema

Thursday, September 27, 2018 - 15:47

హైదరాబాద్ : బాలీవుడ్‌లో మోస్ట్ హ్యపెనింగ్ మూవీ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, అమిర్‌ఖాన్, కత్రీనా కైఫ్‌లు నటిస్తున్నారు. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్‌గా...

Thursday, September 27, 2018 - 14:20

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నానీ‌ల కాంబినేషన్‌లో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, సి.అశ్వనీదత్ నిర్మించిన  చిత్రం దేవదాస్..గీతగోవిందంతో యూత్‌లో మంచిక్రేజ్ సంపాదించుకున్నరష్మిక మందన్న, మళ్ళీరావా చిత్రంతో ఆకట్టుకున్నఆకాంక్ష సింగ్  హీరోయిన్స్‌గా నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్,ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై...

Thursday, September 27, 2018 - 13:02

ఊహించని మలుపులతో, ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన టాలీవుడ్ బిగ్‌బాస్ సీజన్ 2 మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో "బిగ్‌బాస్ షోలో ఏదైనా జరగొచ్చు" అంటూ హోస్ట్ నాని చేసిన మాటలు నేడు నిజం కానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ నలుగురి మధ్యే జరపాలని నిర్ణయించుకున్న బిగ్‌బాస్, నేడు ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారని, ఎలిమినేట్ అయ్యేది నటి, యాంకర్ దీప్తి నల్లమోతని...

Wednesday, September 26, 2018 - 10:45

ఒకప్పుడు యువతను ఉర్రుతలూగించిన హీరోయిన్లలో ‘రంభ’ ఒకరు. టాలీవుడ్‌లో అగ్రహీరోలతో రోమాన్్స చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటోంది. 2010లో ఇంద్రకుమార్‌తో రంభ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం వీరిద్దరూ టొరంటోలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరిద్దిరికీ లాన్య..సాషా ఇద్దరు ఆడపిల్లలు. 2010లో రంభ, ఇంద్రకుమార్‌ల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇద్దరు టొరంటోలో స్థిరపడ్డారు....

Wednesday, September 26, 2018 - 10:31

వైరైటీ స్టైల్‌తో దూసుకపోతున్న నటుల్లో ఒకరు విజయ్ దేవరకొండ. ఇతని చిత్రాలు విజయవంతం కావడంతో పలువురు దర్శకులు ఇతనితో సినిమాలు చేయాలని తహతహలాడుతున్నారు. తాజాగా ఆయన నటించిన ‘నోటా’ విడుదలకు సిద్ధమౌతోంది. ఇదిలా ఉంటే సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే మృతి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు విజయ్ దేవరకొండతో జత కడుతోందని వార్తలు వెలువడుతున్నాయి. 
...

Wednesday, September 26, 2018 - 09:29

పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత అక్కినేని వ్యక్తిగతంగానూ, ప్రొఫెషనల్‌ గానూ మంచి జోష్ మీద ఉన్నారు. అటు సినిమాలను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నారు. సమంత, చైతన్య వివాహం జరిగి ఏడాది పూర్తి కావోస్తున్నది. వారి వివాహం గతేడాది గోవాలో అక్టోబర్ మొదటివారంలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో...

Tuesday, September 25, 2018 - 19:31

చెన్నై: దేవ్ సినిమా షూటింగ్ కోసం కులూమనాలీ వెళ్లిన హీరో కార్తీ ఇతర సినిమా యూనిట్ సభ్యలు వరదలు, కొండచెరియలు విరిగిపడటంతో అక్కడ చిక్కుకున్నారు.  అభిమానులు కార్తీ క్షేమ సమాచారం అందకపోవడంతో ఆందోళనకు గురైన నేపథ్యంలో కార్తీ ట్విట్టర్‌లో తాను క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. సినిమా యూనిట సభ్యులందరూ క్షేమంగా ఉన్నామని.. తాను మంగళవారం ఉదయం చెన్నై చేరుకొన్నట్టు...

Tuesday, September 25, 2018 - 14:04

మలయాళ సినీ  రంగంలో  ప్రముఖ సంగీత   దర్శకుడు , వయోలనిస్టు  బాలభాస్కర్ కుటుంబం మంగళవారం   తెల్లవారుఝూమున రోడ్డు ప్రమాదానికి గురైంది.  అతని రెండేళ్ల కుమార్తె  తేజస్వి  ప్రమాద స్దలంలోనే  మరణించింది,  ప్రమాదంలో  తీవ్రంగా గాయపడిన    బాల భాస్కర్  అతని  భార్య లక్ష్మి , కారు డ్రయివర్ లను తిరువనంతపురం సమీపం లోని ఒక మెడికల్ కళాశాల  ఆసుపత్రిలో  ప్రాధమిక చికిత్స  అందించిన అనంతరం మెరుగైన...

Monday, September 24, 2018 - 19:58

హైదరాబాద్ : టాలీవుడ్...ఇతర వుడ్‌లలో బయోపిక్ ల హావా కొనసాగుతోంది. రాజకీయ నేతలు..ప్రముఖుల జీవితాల ఆధారంగా చిత్రాలు రూపొందుతున్నాయి. ఇందులో కొన్ని ప్రజాదరణ పొందాయి. టాలీవులో‌లో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నేతల బయోపికలు రూపొందుతున్నాయి. వైఎస్ జీవిత ఆధారంగా ‘యాత్ర’..ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సీఎం...

Monday, September 24, 2018 - 15:27

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల వారసులు హీరోలుగా మారడం అనేది సర్వసాధారణంగా జరిగేపనే. కానీ, టెక్నీషియన్స్ పిల్లలు హీరోకావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా చాలామంది హీరోలకు ఫైట్స్ కంపోజ్ చేసిన ప్రముఖ ఫైట్ మాస్టర్ విజయ్.. ఆయన తనయుడు రాహుల్ విజయ్ ని హీరోగా పరిచయం చేస్తూ, తన కుమార్తె దివ్యా విజయ్ నిర్మాతగా,రాము కొప్పుల అనే కుర్రాడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ...

Monday, September 24, 2018 - 13:13

శ్రీనువైట్ల, ఒకప్పుడు కామెడీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. స్టార్ హీరోలతో సైతం కామెడీ చేయించి మంచి హిట్స్ అందుకున్నాడు. వరస హిట్లతో దూకుడు మీద ఉన్న వైట్ల కెరీర్, ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ లాంటి పరాజయాలతో అగాధంలో పడింది. ఇక శ్రీను పని అయిపోయింది అనుకున్నారంతా. ఆలాంటి టైంలో తనకి వెంకీ,దుబాయ్ శీను వంటి హిట్స్ ఇచ్చిన శ్రీనుని ఆదుకోవడానికి మాస్ రాజా రవితేజ లైన్ లోకి వచ్చాడు. 
...

Monday, September 24, 2018 - 10:50

చెన్నై: తమిళ దళపతి విజయ్ కొడుకు సంజయ్ తండ్రి బాటలో పయనించేందుకు అడుగులు మొదలుపెట్టాడు. గతంలో విజయ్ నటించిన ‘వెట్టైక్కరన్’ సినిమాలో సంజయ్ ఓ పాటలో మెరిసి అభిమానులను కనువిందు చేశాడు. ఇప్పుడు 18 ఏళ్ల సంజయ్ తన మొదటి షార్ట్‌ఫిల్మ్‌తో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌  ‘‘జంక్షన్’’ అనే టైటిల్ తో రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ సంజయ్ విడుదల చేశాడు....

Sunday, September 23, 2018 - 15:08

హైదరాబాద్ : యువసమ్రాట్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేవదాస్’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలోని నటీనటులు దేవదాస్ ప్రమోషన్ లో బీజీగా ఉన్నారు. ఈ సందర్భంగా నాగార్జున నానికి సంబంధించిన ఓ సీక్రెట్ ను బయటపెట్టారు. నాని ఫోన్ పిచ్చోడని వెల్లడించారు.

‘నానికి ఫోన్ చూడడం అలవాటుగా మారిపోయింది. అందులో ఏం...

Sunday, September 23, 2018 - 13:22

టాలీవుడ్...లేదా ఇతర భాషల్లో నిర్మించే సినిమాలకు సంబంధించిన అంశాలు మధ్యలోనే లీక్ అవుతూ దర్శక, నిర్మాత, హీరోలకు చికాకు కలిగిస్తుంటాయి. అంతేగాకుండా వారిని నష్టాలపాలు కూడా చేస్తుంటాయి. లీకైన దృశ్యాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. పలు సినిమాలకు సంబంధించిన కీలక సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. 

తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్...

Sunday, September 23, 2018 - 12:35

హైదరాబాద్‌ : ’అర్జున్‌ రెడ్డి’ చిత్రం విజయ్‌ దేవరకొండని ఓవర్‌ నైట్‌ స్టార్‌ని చేసింది. టాలీవుడ్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో షాలిని పాండే కథనాయికగా నటించారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళం, హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ప్రముఖ నటుడు విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ ఈ సినిమా రీమేక్‌తో కథానాయకుడిగా...

Saturday, September 22, 2018 - 14:03

మెగాస్టార్ చిరంజీవి నటుడిగా చిత్రసీమలోకి ప్రవేశించి నేటితో దిగ్విజయంగా నాలుగు దశాబ్ధాలు పూర్తయ్యాయి. టాలీవుడ్ 85 ఏళ్ళ ప్రస్థానంలో సగం చిరువే. రెండుదశాబ్ధాల పాటు నంబర్ వన్ సింహాసనంపై ఆశీనుడయ్యాడాయన.. కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలుచేస్తూ అంచెలంచెలుగా సుప్రీం హీరో స్థాయికి ఎదిగినతీరు ఎందరికో స్ఫూర్తిదాయకం.. మెరుపువేగంతో డ్యాన్స్ చెయ్యాలన్నా,తనదైన శైలి డైలాగ్ డిక్షన్,మేనరిజమ్స్...

Saturday, September 22, 2018 - 11:21

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని దృష్టిలోపెట్టుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా,భారీబడ్జెట్ కేటాయించి నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు. 
ఇదిలాఉంటే ఎన్టీఆర్ హీరోగా రామ్ చరణ్ ఒక సినిమా నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్త ఒకటి ఫిలింనగర్...

Friday, September 21, 2018 - 18:15

చియాన్ విక్రమ్ 15 సంవత్సరాలక్రితం తమిళ్ లో సామి అనే సినిమా చేసాడు. నటుడిగా తనకీ,దర్శకుడిగా  హరికీ సామి మంచిపేరు తెచ్చిపెట్టింది. తెలుగులో బాలకృష్ణ లక్ష్మీనరసింహ గా రీమేక్ చేస్తే, ఇక్కడకూడా హిట్ అయింది.. తర్వాత హరి, సూర్యతో సింగం సిరీస్ లో మూడు సినిమాలు చేసాడు. 
ఇప్పుడు విక్రమ్,హరి కాంబోలో స్వామికి సీక్వెల్ గా తమిళ్ లో  సామి  స్క్వేర్ పేరుతో రూపొంది, తెలుగులో సామి గా ఈ...

Friday, September 21, 2018 - 16:18

సమ్మోహనం సక్సెస్ తో సుధీర్ బాబు ట్రాక్ లోకి వచ్చాడు. ప్రతిభకి పెద్దపీట వేస్తూ వైవిధ్య భరితమైన సినిమాలు రూపొందించాలని తన పేరుతో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఆర్.ఎస్.నాయుడుని దర్శకుడిగా పరిచయం చేస్తూ నన్నుదోచుకుందువటే చిత్రం చేసాడు. ఈ రోజు రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.. 

కథ : -
ఐటీ కంపెనీలో పనిచేసే కార్తీక్ పనితప్ప వేరే ప్రపంచమేలేదు...

Friday, September 21, 2018 - 14:38

కింగ్ నాగార్జున,న్యాచురల్ స్టార్ నాని,గీత గోవిందం ఫేం రష్మిక,ఆకాంక్ష సింగ్ జంటగా,శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్లో,అశ్వనీదత్ నిర్మిస్తున్నదేవదాస్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అయ్యింది.. ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో ఆడియన్స్లో ఆసక్తినిపెంచిన చిత్ర బృందం ఈ ట్రైలర్ ద్వారా అంచనాలని అమాంతం పెంచేసింది.. బ్యాక్ గ్రౌండ్లో.. అంతా భ్రాంతియేనా అనే సాంగ్ ప్లే అవుతూ ఉండగా నానిని...

Friday, September 21, 2018 - 12:27

సినిమా రంగానికి చెందిన ఓ ప్రముఖ అలనాటి హీరో కూతురిపై ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ నటుడు ఎవరో కాదు...విజయ్ కుమార్...తమిళనాడు రంగానికి చెందిన ఈ నటుడు తమిళ సినిమాలే కాక తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో నటించారు. ఈయనకు మొదటి భార్య ముత్తులక్ష్మి మరియు రెండవ భార్య సినీనటి మంజుల. కూతురు వనితపై విజయ్ కుమార్ పీఎస్ లో ఫిర్యాదు చేయడం సినీ రంగంలో కలకలం రేగింది. 

...

Friday, September 21, 2018 - 11:32

ఆర్.ఎక్స్.100...చిన్నసినిమాగా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది...హీరోగా కార్తికేయకి మంచి గుర్తింపు లభించింది..ప్రస్తుతం కార్తికేయ హీరోగా హిప్పీ అనే చిత్రం రూపొందుతోంది.. టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో, తమిళ్ లో..తుపాకీ, కబాలి, స్కెచ్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కలైపులి.యస్.థాను. నిర్మాణంలో, రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా హిప్పీ చిత్రం తెరకెక్కుతోంది.. ఈ రోజు కార్తికేయ...

Friday, September 21, 2018 - 09:01

హైదరాబాద్ : దేవదాస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. దేవదాస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. నాగార్జున, నాని కథానాయకులుగా నటిస్తున్న చిత్రం దేవదాస్‌. ఆకాంక్ష సింగ్‌, రష్మికా మందన్నా నటిస్తున్న ఈ మూవీకి శ్రీరాం ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నదేవదాస్‌ ప్రస్తుతం నిర్మాణాంతర...

Thursday, September 20, 2018 - 18:51

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్,లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.. అరవిందసమేత.. వీరరాఘవ.. పూజ హెగ్డే హీరోయిన్ కాగా,తెలుగమ్మాయి ఇషా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది.. జగపతిబాబు,నాగబాబు,రావు రమేష్ కూడా నటిస్తున్నారు.. 
మొన్నామధ్య రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.. థమన్ కంపోజ్ చేసిన రెండుపాటలని...

Thursday, September 20, 2018 - 17:08

అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా,ఎన్టీఆర్ బయోపిక్లో ఆయన పాత్రపోషిస్తున్న మనవడు సుమంత్ లుక్ ఈ ఉదయం రిలీజ్ చేసింది చిత్ర బృందం.. తాతలా మారిపోయిన మనవడిని చూసి అక్కినేని అభిమానులు ఆనందపడుతూ ఉండగానే,   సాయంత్రానికి మరో సర్ప్రైజ్ ఇచ్చారు,ఎన్టీఆర్ మూవీటీమ్..ఈ లుక్ చూసినవారెవరైనా కొద్దిపాటి షాక్కి గురవడం ఖాయం.. వినాయకచవితికి,ఎన్టీఆర్ రోల్ చేస్తున్న బాలయ్య,చంద్రబాబు నాయుడు...

Thursday, September 20, 2018 - 14:30

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి చిత్రంతో, టాలీవుడ్ లో బయోపిక్‌ల ట్రెండ్ మొదలయ్యింది..  నందమూరి బాలకృష్ణ, తన తండ్రి, స్వర్గీయ, నందమూరి తారకరామారావు జీవిత గాధని, ఎన్టీఆర్ పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, వారాహి చలన చిత్రం మరియు విబ్రి మీడియా సమర్పణలో, ఎన్‌బికె ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈమూవీ రెగ్యులర్ షూటింగ్...

Thursday, September 20, 2018 - 12:37

చిత్తూరు : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. మోహన్ బాబు తల్లి లక్మ్షమ్మ(85) కన్నుమూశారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో ఇవాళ ఉదయం 6 గంటలకు ఆమె మరణించారు. ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబం విదేశాల్లో ఉన్నారు. సమాచారం అందగానే హుటాహుటిన ఇండియాకు పయనమయ్యారు. రేపు లక్మ్షమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

 

Pages

Don't Miss