Cinema

Monday, September 11, 2017 - 13:29

హైదరాబాద్‌: అలనాటి మేటి తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానటి. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ ఒదిగిపోయారు. సమంత, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సావిత్రిగా కీర్తి ఎలా కనిపించనున్నారనే విషయంపై ఆసక్తినెలకొంది. కాగా మహానటి సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు బయటికి వచ్చాయి. వీటిలో కీర్తి సావిత్రి గెటప్‌...

Monday, September 11, 2017 - 12:57

పవన్ స్టార్ పవన్ కల్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్ తెలుగు ప్రేక్షలకుల ముందు ప్రత్యక్షం కానుంది. అందులో హిందీలో హిట్టయిన నాచ్ బలియే టీవీ షో తెలుగు వెర్షన్‌కి రేణు హోస్ట్‌గా వ్యవహరించనుంది. ఈ స్లాట్‌కి రీప్లేస్‌మెంట్‌గా నాచ్ బలియే తెలుగు వెర్షన్‌ని టెలికాస్ట్ చేయాలని ఆ ఛానెల్ ప్లాన్ చేసింది. హిందీలో మాధురిదీక్షిత్ చేస్తున్న జడ్జి రోల్‌ని తెలుగులో రేణుదేశాయ్ టేకప్ చేసింది....

Monday, September 11, 2017 - 12:05

నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన 102వ చిత్రం లో బాలయ్య సరసన నయనతార, మలయాళ నటి నటాషా దోషి నటిస్తున్నారు. కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో బ్రహ్మానందం, మురళీ మోహన్, సంద్య జనక్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కుంభకోణంలో షూటింగ్ జరుపుకుంటోంది.

Monday, September 11, 2017 - 12:00

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్ర ట్రైలర్ ఆదివారం విడుదల అయ్యింది. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో మూడు పాత్రలను పోషిస్తుండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై 'జై లవ కుశ' రూపొందుతోంది. బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా,...

Sunday, September 10, 2017 - 12:00

నందమూరి 'బాలకృష్ణ' ఫిలిం మేకింగ్ లో స్పీడ్ పెంచాడు. తన ఎనర్జీ లెవెల్స్ తో డైలాగ్స్ అదరగొడుతూ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. 'పైసా వసూల్' సినిమా రిలీజ్ అయింది రిజల్ట్స్ ఎలా ఉనా 'బాలయ్య' మరో సినిమా చేయబోతున్నాడు. 'పైసా వసూల్’ రిజల్ట్ చూశాక అందరూ నందమూరి బాలకృష్ణ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడుతోందని టాక్. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన...

Sunday, September 10, 2017 - 11:33

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్ర ట్రైలర్ ఆదివారం విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ విడుదలయ్యాయి కూడా. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో మూడు పాత్రలను పోషిస్తుండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. అంతేగాకుండా ఆయా పాత్రలు దేనికవే భిన్నంగా ఉన్నాయి....

Sunday, September 10, 2017 - 10:24

‘ఐయామ్ వెయిటింగ్' అనే డైలాగ్ తనకెంతో ఇష్టమని టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' వ్యాఖ్యానించారు. తమిళంలో 'కత్తి' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో 'హీరో' ఈ డైలాగ్ పలుకుతాడు. తెలుగులో మెగాస్టార్ 'చిరంజీవి' ‘ఖైదీ నెంబర్150’ గా రీమెక్ అయ్యింది. విజయ్ ‘కత్తి' సినిమాను రీమెక్ చేయాలని అనుకున్నట్లు..కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు.

ప్రిన్స్ 'మహేష్ బాబు' నటించిన...

Saturday, September 9, 2017 - 13:26

సినిమా వాళ్ళు వ్యాపారం లోకి దిగటం కొత్తేమి కాదు. రియల్ ఎస్టేట్, హోటల్స్ పబ్స్, ఇలా ప్రతి బిసినెస్ లో రాణిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా హిట్ ట్రాక్ లో దూసుకెళ్తున్న హీరో కొత్తగా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడు. మరి ఆ హీరో ఎవరు ? 'ప్రభాస్' అంటే ఒకప్పుడు లోకల్...

Saturday, September 9, 2017 - 13:15

సినిమాల్లో రాణించాలని చాలామంది కళలుకంటారు. సినిమా ఇండస్ట్రీ లో కొత్తవాళ్లకు ప్లేస్ రావడం చాల కష్టం ..వారసత్వం ఉన్న ఈ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే కొంచం కష్టమైన పనే. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడ ఒక హిట్ సినిమా కోసం తెగ తాపత్రేయ పడుతున్నాడు ఈ యంగ్ హీరో. 'నాగార్జున' వారసుడు 'అఖిల్...

Saturday, September 9, 2017 - 13:01

హైదరాబాద్ : నగరంలోని సుచిత్రలో చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ కాజల్ అగర్వాల్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. 9 వ చెన్నయ్ షాపింగ్ మాల్ ప్రారంభం అయింది.  
మరిన్ని వివరాలను వీడియలో చూద్దాం...

Saturday, September 9, 2017 - 08:10

హైదరాబాద్ : దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డును ప్రదానం చేయనున్నట్టు సినీ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో రాజమౌళికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. సెప్టెంబర్‌ 17న సాయంత్రం 4.30కు శిల్ప కళావేదికగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో అక్కినేని...

Friday, September 8, 2017 - 12:53

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతుల ఫొటోలు తీస్తే నేరమా ? వారి ఫొటోలు తీయవద్దా ? తీస్తే చావబాదుతారా ? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వారి ఫొటోలు తీసిన ఫిల్మ్ జర్నలిస్టులపై బౌన్సర్లు విరుచకపడుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

గురువారం రాత్రి శిల్పా భర్త రాజ్ కుంద్రాతో కలిసి ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ కు వెళ్లింది. ఈ విషయం...

Friday, September 8, 2017 - 12:02

అక్కినేని నాగ‌చైత‌న్య, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం 'యుద్ధం శ‌ర‌ణం'. వారాహి చల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి నిర్మాత‌గా కృష్ణ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం తెర‌కెక్కింది. యుద్ధం శరణం మూవీ టీమ్ తో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నాగచైతన్య, లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ సినిమా విశేషాలను తెలిపారు. తమ అనుభవాలను వివరించారు. వారు తెలిపిన పలు...

Friday, September 8, 2017 - 10:49

‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా' అంటూ 'కుశ' పాత్రలో 'ఎన్టీఆర్' పలికిన డైలాగ్ అభిమానులను అలరిస్తోంది. ఆయన తాజా చిత్రం 'జై లవ కుశ' టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో 'ఎన్టీఆర్'..’జై', ‘లవ', ‘కుశ' పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈపాత్రలకు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ లను చిత్ర బృందం విడుదల చేస్తోంది.

ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్...

Thursday, September 7, 2017 - 12:12

టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' తాజా చిత్రం 'స్పైడర్' రిలీజ్ కు సిద్ధమౌతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చిత్ర షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన విషయాలు గతంలో తెలియకపోతుండడంతో అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అనంతరం మహేష్ కు సంబంధించిన పోస్టర్స్..టీజర్స్ విడుదల చేయడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. మురుగదాస్...

Thursday, September 7, 2017 - 11:19

బాలీవుడ్ నటి 'పరిణీతి చోప్రా'కు అరుదైన గౌరవం దక్కింది. బాలీవుడ్ లో అందాల భామగా పేరొందిన ఈ నటి ఎన్నో జాతీయ ఫిలిం అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. చాలా బ్రాండ్లకు..ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆస్ట్రేలియా టూరిజం రాయబారిగా నియమితులయ్యారు. ఆస్ట్రేలియా పర్యటక శాఖ రాయబారిగా వ్యవహరించనున్న తొలి భారతీయ మహిళ కూడా పరిణీతే. ఫ్రెండ్‌ ఆఫ్‌...

Thursday, September 7, 2017 - 11:12

మెగాస్టార్ 'చిరంజీవి' దుస్తుల కోసం చ్రిత బృందం అన్వేషణ సాగిస్తోంది. ఆయన తాజా చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాల వరకు వెండి తెరకు దూరంగా ఉన్న 'చిరు' ఇటీవలే 'ఖైదీ నెంబర్ 150’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనంతరం కొంత గ్యాప్ తీసుకుని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు...

Thursday, September 7, 2017 - 10:55

టాలీవుడ్ లో వివాదస్పదంగా మారిన 'అర్జున్ రెడ్డి' సినిమాపై ఇతర నటులు స్పందిస్తున్నారు. పలువురు విమర్శలు చేస్తుండగా మరికొందరు కితాబునిస్తున్నారు. తాజాగా దీనిపై టాలీవుడ్ స్వీటీ 'అనుష్క' కూడా స్పందించారు. విజయ్ దేవరకొండ- షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా 'అర్జున్ రెడ్డి' సినిమా తెరకెక్కింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై కలెక్షన్ల వర్షం...

Thursday, September 7, 2017 - 10:18

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు రేపు పండుగ. ఎందుకంటే ఆయన నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన మరో టీజర్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు టీజర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. దీనిని చూసిన అభిమానులు టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ'...

Wednesday, September 6, 2017 - 15:02

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ కొడుకు మహధాన్ వెండి తెరపై కనిపించనున్నాడు. మహధాన్ రాజాది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్‌రాజు ధ్రువీకరించారు. ‘‘మాస్ మహరాజ్ రవితేజ కుమారుడు మహధాన్‌ను మా సినిమాలో పరిచయం చేస్తున్నాం. అతడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ రవితేజ కుమారుడితో కలసి సెట్స్‌లో దిగిన ఫొటోను దిల్‌...

Wednesday, September 6, 2017 - 14:29

విజయ్ దేవరకొండ మూవీ అర్జున్ రెడ్డి వసూళ్ళ సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో 1.5 మిలియన్ మార్క్ ను దాటి 2 మిలియన్ల మార్క్ (20 లక్షల డాలర్ల) దిశగా పరుగులు తీస్తోంది. నార్త్ అమెరికాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో ఈ మూవీ 15 వ స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రాల్లో 11 వ ప్లేస్ దక్కించుకుందని తెలుస్తోంది.

Tuesday, September 5, 2017 - 12:55

బాలీవుడ్ అలనాటి హీరో 'దిలీప్ కుమార్' ను హీరోయిన్ 'ప్రియాంక చోప్రా' కలిసింది. తీవ్ర అనారోగ్యం కారణంగా దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరి కొద్ది రోజుల క్రితం డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి ప్రియాంక చోప్రా ఆయన నివాసానికి వెళ్లింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను దిలీప్ సతీమణి సైరా బాను పోస్టు చేశారు. ప్ర‌స్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిల‌క‌డ...

Tuesday, September 5, 2017 - 11:11

టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకరైన 'బాలకృష్ణ' సినిమాల జోరు పెంచారు. వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' ఘన విజయం అనంతరం వరుసగా సినిమాలకు సైన్ చేసేస్తున్నారు. తాజాగా 101 సినిమాగా వచ్చిన 'పైసా వసూల్' మంచి టాక్ నే తెచ్చుకుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సరికొత్త బాలయ్యను చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం వెంటనే మరోసినిమా మొదలెట్టేశారు....

Tuesday, September 5, 2017 - 11:02

'యే హాలీ..యే హాలీ..హాలీబీ అనే పాటతో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముందుకొచ్చాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'స్పైడర్' పాటలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా రెండో పాటను విడుదల చేసింది. ఈ పాట మహేష్ అభిమానులను అలరిస్తోంది.

మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయినట్లు తెలుస్తోంది....

Tuesday, September 5, 2017 - 08:21

బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరొందిన యాంకర్ 'అనసూయ' తరచూ వార్తల్లోకి ఎక్కుతుంది. తన నటన..అందంతో బుల్లితెర అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ వెండితెరపై కూడా తళుక్కుమంటోంది. గతంలో ఆమె నటించిన సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పోస్టు చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్ తేజ', ‘సమంత' జంటగా ఓ సినిమా...

Pages

Don't Miss