Cinema

Friday, January 19, 2018 - 06:29

హైదరాబాద్ : కత్తి వర్సెస్‌ పవన్‌ అభిమానులు వివాదం మరింత ముదురుతోంది. సినీక్రిటిక్‌ కత్తిమహేశ్‌పై హైదరాబాద్‌ కొండాపూర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఓయూ జేఏసీ ఖండించింది. తెలంగాణ వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని జేఏసీ నేతలు హెచ్చరించారు. దాడికి నిరసనగా ఇవాళ పవన్‌ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని పలుపునిచ్చారు.  

Thursday, January 18, 2018 - 12:16

ఢిల్లీ : 'పద్మావత్' సినిమా విడుదలకు కష్టాలు తీరాయి. ఎట్టకేలకు ఈనెల 25న దేశ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. 'పద్మావత్' నిర్మాతలు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ లో పద్మావత్ సినిమాను నిషేధించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని...

Thursday, January 18, 2018 - 08:26

హైదరాబాద్ : ఎన్టీఆర్ 22వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ లో పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఘాట్ కు చేరుకుని పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, హరికృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, భువనేశ్వరీలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక యుగపరుషుడని, ఆయన కడుపున పుట్టడం తమ పునర్జన్మ...

Wednesday, January 17, 2018 - 16:04

ఢిల్లీ : 'పద్మావత్‌' సినిమా మళ్లీ సుప్రీంకోర్టుకెక్కింది. ఈ నెల 25న విడుదల కాబోతున్న 'పద్మావత్‌' సినిమాపై రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెన్సార్‌ బోర్డు అనుమతిచ్చాక సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని... తమ సినిమా అన్ని...

Tuesday, January 16, 2018 - 18:19

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'జై సింహా' సినిమాపై మహీంద్ర ఆటోమోబైల్స్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహింద్ర స్పందించారు. జైసింహా సినిమాలో బాలకృష్ణ బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశాన్ని విష్ణు చైతన్య అనే నెటిజన్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్విటర్‌లో పంపించారు. బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న సన్నివేశం తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌ అవుతోందని.. దీన్ని మీరు...

Monday, January 15, 2018 - 16:56

తమిళ నటుడు 'సూర్య'కు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయి మంచి విజయాలు సాధించాయి. దీనితో ఆయన టాలీవుడ్ పై కూడా మనస్సు పారేసుకుంటుంటారు. తాజాగా ఆయన నటించిన 'గ్యాంగ్' సినిమా ఇటీవలే తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా 'సూర్య' సోమవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమండ్రిలోని ఓ థియేటర్ లో అభిమానులతో కలిసి 'గ్యాంగ్' సినిమా చూశారు...

Monday, January 15, 2018 - 11:57

జబర్దస్త్ టీమ్ తో 10టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్టులు జీవన్, శ్రీను, వినోద్, వెంకీ మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Monday, January 15, 2018 - 08:47

సినీనటి హరితేజతో 10టివి ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా హరితేజ మాట్లాడుతూ తన సినీ, సీరియల్ కెరీర్ గురించి వివరించారు. పుట్టినప్పటి నుంచి డ్యాన్స్ ఇష్టమని చెప్పారు. తమ ఫ్యామిలీ మొత్తం సింగర్స్ అని అన్నారు. మరిన్ని వివరాలను ఆమె మాటల్లోనే... 
'బిగ్ బాస్ షో ఒక ప్లాట్ ఫామ్. నిజాం కాలేజీలో బీఏ పూర్తి చేశారు. చిన్నారి నా ఫస్ట్ సీరియల్. నేను వారే వారిని ఇమిటేట్ చేస్తాను...

Sunday, January 14, 2018 - 19:49

'పెళ్లిచూపులు' సినిమా చూసిన వారు 'ప్రియదర్శి'ని మర్చిపోరు. అందులో హీరో ఫ్రెండ్‌గా కనిపించి డైలాగ్స్ తో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. షార్ట్ ఫిలింస్..డైరెక్షన్..స్ర్కిప్ట్ రైటింగ్ తో ఆల్ రౌండర్ గా మారిపోయాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా నవ యువ కమెడియన్ 'ప్రియదర్శి'తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు...

Sunday, January 14, 2018 - 12:02

సింగర్ విజయలక్ష్మీతో 10 టివి చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పాటల కెరీర్ వివరించారు. చిన్నప్పటి నుంచి సినిమా పాటలపై ఎక్కువ ఇంట్రస్ట్ ఉందన్నారు. తనకు గ్రాస్పింగ్ ఎక్కువ అన్నారు. అమ్మనాన్నలిద్దరూ సింగర్స్ అని తెలిపారు. 8 సం.రాల నుండి పాటలు పాడుతున్నానని తెలిపారు. మొదటిసారిగా రవీంధ్ర భారతిలో స్టేజ్ పై సాంగ్ పాడానని తెలిపారు. తన ఆల్ టైమ్ హీరో హీరోయిన్స్...

Saturday, January 13, 2018 - 19:59

'ప్రభాకర్ గౌడ్' తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించాడు. 'బాహుబలి' సినిమాతో 'కాలకేయుడి' పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 'గబ్బర్ సింగ్’, 'దూసుకెళ్తా’, 'దూకుడు’, 'కృష్ణం వందే జగద్గురుం’, 'దొంగాట' ఇలా కొన్ని చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నటుడు. ‘కాళకేయ' ప్రభాకర్ గా గుర్తింపు పొందిన ఈ నటుడు...

Saturday, January 13, 2018 - 15:00

తండాలో జన్మించింది..ఆమె చదువు సొంతూరు తండాలను చదువుకుంది. అనంతరం పట్టణంలో కూడా చదువు కొనసాగింది. ఆమెనే నేడు బుల్లితెర అదరగొడుతోంది...తెలంగాణ యాస, భాషతో ఔరా అనిపించుకుంటున్నది. ఆమెనే 'మంగ్లీ'.. ఆమె అసలు పేరు 'మంగ్లి' కాదు 'సత్యవతి’. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆమె పాడిన ఓ పాట యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ''పుట్టిన ఊరి చూసి నయనాలే, కృష్ణా గోదావరి నదులాయే అన్నట్టు''.. సాగే...

Saturday, January 13, 2018 - 12:47

హైదరాబాద్ : జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు కాలం కలిసిరావడం లేదా? సినిమాల పరంగా పవన్‌ పవర్‌ తగ్గుతోందా? రాజకీయంగా జనసేనాని జనంలోకి వెళ్లలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి జరుగుతున్న పరిణామాలు.  ఒక పక్క  సినిమాలు ప్లాప్‌. ఇంకోపక్క రాజకీయ విమర్శలు. మరోపక్క వ్యక్తిగత ఆరోపణలు... వెరసి పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.  పవన్‌కు ఎదురవుతున్న ప్రతికూల...

Friday, January 12, 2018 - 19:18

నటమూరి నందమూరి 'బాలకృష్ణ' సంక్రాంతి పండుగ సందర్భంగా తన తాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆయనకిది 102వ చిత్రం. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ‘జైసింహా’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన మరోసారి 'నయనతార నటించగా మరో హీరోయిన్ గా నటాషాదోషి, హరి ప్రియ కథానాయికలుగా నటించారు. 'బాలకృష్ణ' 'నయనతార' కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు విజయవంతమైన...

Thursday, January 11, 2018 - 19:51

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో సినీ క్రిటిక్ కత్తి మహేష్...సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య విమర్శల యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. సాగదీస్తే ఎంతదూరమైనా సాగే అవకాశం ఉందని టెన్ టివి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇద్దరూ సంయమనం పాటించాలని, విమర్శలు కొనసాగిస్తే ఎంతదూరమైనా పోవచ్చన్నారు. 

Thursday, January 11, 2018 - 17:47

హైదరాబాద్ : ప్రియాంక చోప్రా నటిగా హాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే, నిర్మాతగా ప్రాంతీయ భాషల్లో సినిమాలను నిర్మిస్తూ నూతన ప్రతిభను ప్రోత్సహిస్తోంది. 2016లో నిర్మించిన 'వెంటిలేటర్‌' మరాఠి చిత్రానికి మూడు జాతీయ అవార్డులు లభించాయి. అలాగే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమై పురస్కారాలను దక్కించుకుంది. తాజాగా మరో మరాఠి చిత్రాన్ని...

Thursday, January 11, 2018 - 17:44

ఆర్‌.బాల్కీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కంగనా రనౌత్‌ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ వికలాంగ మహిళా అరుణిమ సిన్హా జీవితం ఆధారంగా ఆర్‌.బాల్కీ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో అరుణిమ సిన్హా పాత్రకు కంగనాను ఎంపిక చేశారట. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మెంటర్‌ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం కంగనా ప్రత్యేక శిక్షణ కూడా...

Thursday, January 11, 2018 - 16:16

'స్పైడర్‌' సినిమా తర్వాత రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు తెలుగులో కంటే హిందీ, తమిళ చిత్రాల్లోనే నటించే మంచి మంచి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం పలు ఇతర భాషా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్‌ తాజాగా తెలుగులోనూ ఓ రెండు ప్రాజెక్టుల్లో నటించేందుకు పచ్చజెండా ఊపిందని సమాచారం. అయితే ఈ రెండు ప్రాజెక్టులు కూడా మల్టీస్టారర్‌ చిత్రాలు కావడం విశేషం. వీటిలో మొదటగా నాగార్జున, నాని కలిసి నటిస్తున్న...

Thursday, January 11, 2018 - 16:09

ఆరుపదుల వయసులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారు. మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'గాయత్రి'. మదన్‌ రామిగాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇందులో ఇటీవల కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించారు. యాక్షన్‌ స్టంట్లను సొంతంగా చేసి మోహన్‌బాబు అందరినీ ఆశ్చర్యపరిచారట. మోహన్‌బాబు చేసిన స్టంట్లకు ఆశ్చర్యపోయిన యాక్షన్‌ డైరెక్టర్‌ కనల్‌...

Thursday, January 11, 2018 - 15:58

హీరో రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందంట. త్వరలోనే పట్టాలెక్కబోతుందట. శ్రీనువైట్ల మార్క్‌ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అమెరికాలో ఎక్కువ శాతం సాగే ఈ చిత్రంలో రవితేజ ఎన్‌ఆర్‌ఐగా కనిపించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ ఫైనల్‌ దశలో ఉందని, ఫైనలైజ్‌ అయ్యాక సినిమాను మొదలు పెట్టేందుకు చిత్ర బృందం ముమ్మర సన్నాహాల్లో...

Thursday, January 11, 2018 - 12:16

హైదరాబాద్ : అజ్ఞాతవాసి సినిమాపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. పవన్ కల్యాణ్ కన్నా కత్తి మహేషే అందంగా ఉన్నాడని, టెన్ టీవీ చర్చ క్లిప్ ను వర్మ పోస్ట్ చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, January 10, 2018 - 19:06

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న సినిమా 'అజ్ఞాతవాసి'. 'పవన్ కళ్యాణ్' హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నుండి కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ ఫిలిం 'అజ్ఞాతవాసి' సినిమా. ఈ సినిమా ఇవాళ్టి 'నేడే విడుదల' రివ్యూ టైం లో ఉంది. రైటర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని డైరెక్షన్ లో కూడా సూపర్ హిట్...

Wednesday, January 10, 2018 - 15:19

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'..మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' కాంబినేషన్ లో రూపొందిన 'అజ్ఞాత వాసి'.. చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాను చూడటానికి అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. మరి

సినిమా ఎలా ఉంది ? ప్రేక్షకులను మెప్పించిందా ? అనే దానిపై టెన్ టివి ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ చర్చలో కత్తి మహేష్ (సినీ క్రిటిక్), కృష్ణ సాయిరాం (టెన్ టివి...

Pages

Don't Miss