Cinema

Monday, February 6, 2017 - 16:55

హైదరాబాద్: హీరో ప్రిన్స్ మహేశ్‌బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశాడని రచయిత చంద్ర కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు మహేశ్ బాబుతో పాటు డైరెక్టర్ కొరటాల, నిర్మాత నవీన్‌లకు సమన్లు జారీ చేసింది. మార్చి 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Monday, February 6, 2017 - 16:27

కృష్ణా : ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై సినిమా తీస్తానన్నారు ఆయన తనయుడు, హీరో బాలకృష్ణ. ఎన్టీఆర్‌ పాత్రలో తానే నటిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాపై పరిశోధన జరుగుతోందని... అతి త్వరలోనే తెరకెక్కించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో నారా లోకేష్‌తో కలిసి పర్యటించిన బాలకృష్ణ... గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమిపూజ...

Sunday, February 5, 2017 - 12:00

ఒక భాషలో హీరోలుగా కనిపించిన తారలు ఇతర భాషల్లో విలన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా సౌత్ నటులు ఈ లిస్ట్ లో ముందున్నారు. పరభాషల్లో విలన్లుగా నటించడమే కాదు.. పరభాషా నటులను తమ సినిమాల్లో విలన్లుగా తీసుకుంటున్నారు. మరి ఈ కొత్త ట్రెండ్ సినిమాల్లో హల్ చల్ చేస్తోంది. సౌత్ నటులు కూడా హీరో విలన్ అన్న తేడా లేకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే ఏ క్యారెక్టర్ అయినా...

Sunday, February 5, 2017 - 07:54

సినీ రంగంలో సెంటిమెంట్ లను ఫాలో అయ్యే వారు చాలా ఎక్కువ. కుర్ర హీరోలు సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా అందారు తనకు కలిసొచ్చిన టైటిల్స్ యాక్టర్స్ ని తమ నెక్ట్స్ మూవీస్ లో కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తుంటారు. కోలీవుడ్ టాప్ స్టార్ కూడా తన నెక్ట్స్ సినిమా విషయంలో అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడట. కొంతకాలం హిట్స్ కు దూరమైన అజిత్.. సక్సెస్ ట్రాక్ ఎక్కిన తరువాత వరుస బ్లాక్...

Sunday, February 5, 2017 - 07:39

వాళ్ళది పేషన్, వాళ్ళది డిజైర్, వాళ్ళది డ్రీమ్. వాళ్లెవరో కాదు కొత్తగా సినిమా రంగం లోకి వెళ్లాలనే కళలు కంటూ కష్టపడుతున్న షార్ట్ ఫిలిం మేకర్స్. షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ యాక్టర్స్ నుండి ఫీచర్ ఫిలిం డైరెక్టర్స్, యాక్టర్స్ గా రాణిస్తున్నారు. సినిమా అనేది మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. అలాంటి సినిమాని చేరుకోవటానికి దారులు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయ్ అని చెప్పాలి. సినిమా ఒక...

Sunday, February 5, 2017 - 07:21

సినీ ఇండస్ట్రీలో రీసెంట్ గా ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. మూడే మూడు ఫ్రేమ్ లు నాలుగు మాటలు 47 సెకన్లు డ్యూరేషన్ ..కానీ ఆ ట్రైలర్ తీసుకువచ్చిన క్రేజ్ మాత్రం అంత ఇంత కాదు జస్ట్ 47 సెకన్స్ డ్యూరేషన్ లోనే ఒక మంచి లవ్ ఫీల్ ని అందించారు. సిల్వర్ స్క్రీన్ పైన కాసులు కురిపించే సబ్జక్ట్స్ చాలా వరకు లవ్ సబ్జెక్టులే. అలాంటి లవ్ ని స్క్రీన్ మీద ప్రెసెంట్ చెయ్యాలంటే ఆడియన్స్ పల్స్ తెలియాలి...

Saturday, February 4, 2017 - 21:54

హైదరాబాద్ : దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దాసరికి రెండు రోజుల క్రితం వైద్యులు సర్జరీ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పటి నుంచి దాసరిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు సినీ నటుడు కృష్ణం రాజు దాసరిని పరామర్శించారు. ఆయన త్వరగా కోల్కొవాలని...

Saturday, February 4, 2017 - 20:51

హైదరాబాద్ : దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్‌ వైద్యులు తెలిపారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన దాసరికి రెండు రోజుల క్రితం వైద్యులు సర్జరీ చేసి వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పటి నుంచి దాసరిని ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు సినీ నటుడు కృష్ణం రాజు దాసరిని పరామర్శించారు. ఆయన త్వరగా కోల్కొవాలని...

Saturday, February 4, 2017 - 20:00

హైదరాబాద్ : పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు టీజర్ రిలీజైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన శృతి హసన్ నటిస్తోంది. గోపాలా గోపాలా మూవీ డైరెక్టర్ కిశోర్ కుమార్ పార్థసాని... ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

 

Saturday, February 4, 2017 - 13:06

తూర్పుగోదావరి : కాకినాడలో సినీతార కాజల్ అగర్వాల్ సందడి చేసింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా..కాకినాడ స్థానిక భానుగుడి సెంటర్ JNTU వరకూ..సూర్యా గ్లోబల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2కె రన్ లో ఆమె పాల్గొంది. ఏపి డిప్యూటి సీఎం చినరాజప్ప సహా..పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రోజువారి జీవన శైలి ఆహారపు అలవాట్లను నియంత్రించడం...

Saturday, February 4, 2017 - 07:42

టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'రకూల్ ప్రీత్ సింగ్' హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా పేరును..ప్రచార చిత్రం ఇంకా విడుదల...

Friday, February 3, 2017 - 21:23

నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తిసురేష్ లు నటించిన 'నేను లోకల్' సినిమా ఈరోజు విడులైంది. త్రినాథ్ రావు నక్కిన డైరెక్షన్, దిల్ రాజ్ ప్రొడక్షన్ లో ఈ సినిమా తయారయింది. ఈ సినిమా ఫస్ట్ నుంచి ఇండస్త్రీలో హాట్ టాఫిక్ గానే ఉంది. 
మరి సినిమా పూర్తి రివ్యూను వీడియోలో చూద్దాం...

 

Friday, February 3, 2017 - 20:11

హైదరాబాద్ : అనారోగ్యానికి గురై కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని స్పష్టం చేశారు కిమ్స్‌ వైద్యులు. దాసరి ఆరోగ్యంపై వారు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఇంకా వెంటిలెటర్‌ సహాయంతోనే దాసరి శ్వాస తీసుకుంటున్నారని.. మరో 3రోజుల పాటు ఐసీయూలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. 

 

Friday, February 3, 2017 - 13:08

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు త్వరలోనే అందరి ముందుకు వస్తారని సినీ నటుడు, ఎంపీ చిరంజీవి పేర్కొన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని చిరంజీవి పరామర్శించారు. చిరుతో పాటు అల్లు అరవింద్, వి.వి.వినాయక్ లు కూడా ఉన్నారు. పరామర్శించిన అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. హుషారైన దాసరిని చూస్తున్నామని, చాలా సంతోషంగా ఉందన్నారు. దాసరి...

Friday, February 3, 2017 - 10:54

'రానా దగ్గుబాటి' తో 'ప్రభాస్' రెండు కోట్లు బేరం..'బాహుబలి' సినిమాతో మంచి స్క్రీన్ మేట్స్ గా మారిపోయిన 'ప్రభాస్’, ‘రానా'లు మరో అడుగు ముందుకేసి తమ సినిమాల్లో తమకున్న ఫ్రెండ్షిప్ ని చాటుతున్నారు. ’ప్రభాస్' ఈ పేరు వినగానే గుర్తొచ్చే నెక్స్ట్ వర్డ్ డార్లింగ్ ...అందర్నీ ప్రేమగా చిరునవ్వుతో డార్లింగ్ అని పిలిచే 'ప్రభాస్' తనతో 'బాహుబలి'లో లాంగ్ జర్నీ చేసిన 'రానా'ని ఇంకా ఎక్కువగా...

Friday, February 3, 2017 - 10:44

'అల్లు అర్జున్' కొత్త సినిమాకి కొత్త కష్టాలు వచ్చాయి. సినిమా మొదటి నుండి మైంటైన్ చేస్తున్న సస్పెన్సు ఒక్క సరిగా బ్రేకప్ అయి మల్లి పాచ్అప్ అయింది. ఈ సంఘటనతో అల్లుఅర్జున్ తో పాటు సినిమా యూనిట్ మొత్తం షాక్ కి గురి అయింది. 'అల్లు అర్జున్' కెరీర్ స్టార్టింగ్ నుండి తన ప్రతి సినిమా లో వైవిధ్యమైన కథను ఎంచుకుంటూనే, ఆ కధలోని పాత్రను కూడా వైవిధ్యంగా ప్రెసెంట్ చేస్తున్నాడు. సినిమా...

Friday, February 3, 2017 - 10:38

ఇండస్ట్రీ లో నెంబర్ వన్ లిస్ట్ లో పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు 'పవన్ కళ్యాణ్' అండ్ 'మహేష్ బాబు'. వారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా చాల హ్యాపీ గా ఫీల్ అవ్వాల్సిందే.. అలాంటి ఆఫర్ ని రిజెక్ట్ చేసింది ఒక డేరింగ్ అండ్ బ్యూటీ హీరోయిన్. 'రకుల్ ప్రీత్ సింగ్' ఈ పేరు వింటే చాలు అందం అభినయం రెండు గుర్తొస్తాయి. 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు', 'ధ్రువ' వంటి హిట్స్ ని 2016 లో...

Friday, February 3, 2017 - 10:11

సంక్రాంతి బరిలో భారీ పోటి తరువాత.. బాక్సాఫీస్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన ఇండస్ట్రీ ప్రముఖులు ఫిబ్రవరిలో వరుస రిలీజ్ లకు రెడీ అవుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుండటంతో నెలంతా థియేటర్లు కళకళలాడనున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి నెల సినిమాలకు అన్ సీజన్ గా భావిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం ఈ అన్ సీజన్ లోనే యంగ్ హీరోలు బరిలో దిగుతున్నారు. ముందుగా ఫిబ్రవరి 3న రెండు...

Friday, February 3, 2017 - 07:30

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' చిత్రం టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? పవర్ స్టార్ ను ఎప్పుడు చూద్దామా అని అభిమానుల ఎదురుచూపులకు తొందరలోనే తెరపడనున్నాయి. 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' నటిస్తున్న 'కాటమరాయుడు'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో..శరత్ మరార్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా...

Thursday, February 2, 2017 - 19:26

మెగా మూవీ అంటే ఫ్యాన్స్‌కు పండగే పండగ. అలాంటిది మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌ కాంబినేషన్‌లో మూవీ వస్తుందంటే ఇక చెప్పనక్కర్లేదు. చిరు, పవన్‌తో మల్టీస్టారర్‌ చిత్రానికి ప్లాన్‌ చేశారు సినీ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందిచబోతున్నారు. ఒకరు బ్రేక్‌ డ్యాన్సులతో రఫ్‌ ఆడిస్తారు...మరొకరు ఫవర్‌ ఫుల్‌ పంచ్‌ డైలాగులతో కేకపుట్టిస్తారు....

Thursday, February 2, 2017 - 16:28

హైదరాబాద్ : 'శరణం గచ్ఛామి' సినిమా విడుదలపై వివాదం ముదురుతోంది. హైదరాబాద్‌ గాంధీనగర్‌ లోని సెన్సార్‌ బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ స్టూడెంట్‌ యూనియన్‌ ముట్టడించడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శరణం గచ్ఛామి చిత్రంలో ఏ మతాన్ని కించపరిచే సన్నివేశాలు లేవని.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం...

Thursday, February 2, 2017 - 16:25

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే చూడాలని అనుకుంటున్న అభిమానుల కోరిక త్వరలో తీరనుంది. వీరిద్దరి కలయికలో ఈ ఓచిత్రం రూపొందనుంది. దీనికి సంబంధించిన విషయాలను నిర్మాత, ఎంపీ సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని పేర్కొన్నారు. ఓ కథను త్రివిక్రమ్ వెల్లడించారని, చిత్రానికి...

Thursday, February 2, 2017 - 15:33

హైదరాబాద్ : ‘శరణం గచ్చామి' సినిమాను సెన్సార్ బ్యాన్ చేయడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సినిమాను విడుదల చేయాలని డిమాండ్ వస్తున్నాయి. కుల వ్యవస్థను ప్రశ్నిస్తూ ఈ సినిమాను తీశారు. కానీ సెన్సార్ బోర్డు దీనిని బ్యాన్ చేసింది. దీనిపై టీఎస్ యూ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం గాంధీనగర్ లో ఉన్న సెన్సార్ బోర్డు...

Thursday, February 2, 2017 - 14:33

హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ, సినీ నాయకులు ఆసుపత్రికి తరలివస్తున్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎంపీ మురళీ మోహన్ తో పాటు పలువురు దాసరిని పరామర్శించారు. దాసరి కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన...

Thursday, February 2, 2017 - 12:57

టాలీవుడ్ 'ప్రిన్స్' గా పేరొందిన నటుడు 'మహేష్ బాబు'. ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా 'మహేష్' అందం మాత్రం చెక్కుచెదరడం లేదు. గ్లామరస్ కు సీక్రెట్ ఏంటీ అని కొన్ని సందర్భాల్లో పలువురు అడిగినా చిరునవ్వుతో సమాధానం చెబుతుంటాడు. కానీ అతని గ్లామరస్ సీక్రెట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి 'మహేష్' అత్యంత ప్రాధాన్యత...

Pages

Don't Miss