జగన్ పేరుతో కొత్త పథకం : జగనన్న విద్యా దీవెనతో ఫీ రీయింబర్స్‌మెంట్

Submitted on 12 July 2019
Finance Minister Buggana Announces Educational scheme

అమరావతి: ఏపీలో ఉన్నత విద్య నభ్యసించే విద్యార్దులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా దీవెనతో  విద్యార్ధులకు  ఫీ రియింబర్స్ మెంట్ ఇవ్వనున్నారు. ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్ర నాథ్ 2019-20 వార్షిక బడ్జెట్ ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ 19శాతం పెరిగింది. రెవెన్యూ వ్యయం లక్షా 80వేల 475 కోట్లు కాగా.. రెవెన్యూ లోటు అంచనా రూ.1, 778కోట్లు అని బుగ్గన తెలిపారు. ద్రవ్య లోటు అంచనా రూ.35వేల 220కోట్లు అని తెలిపారు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 0.17శాతం, మూలధన వ్యయం రూ.32వేల 294 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉన్నత విద్య నభ్యసించే విద్యార్ధులు నిధుల సమీకరణ కోసం ఎదుర్కోంటున్న ఇబ్బందులను గుర్తించి మెట్రిక్ తర్వాత కోర్సుల్లో  చేరే విద్యార్ధులకోసం "జగనన్న విద్యాదీవెన" అనే కొత్త పధకాన్ని ప్రవేశ పెట్టింది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని కమ్యూనిటీల విద్యార్ధులకు  నూటికి నూరు శాతం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ను ప్రభుత్వం సమకూరుస్తుంది. ఇదే కాకా విద్యార్దులకు అవసరమైన పుస్తకాలు, ఆహారం, ప్రయాణం, హస్టల్  నిర్వహణ కోసం ఒక్కో విద్యార్ధికి ఏడాదికి  20 వేల రూపాయలను కూడా ప్రభుత్వం అందచేస్తుంది. ఇందుకోసం 4 వేల 962 కోట్ల రూపాయలు కేటాయించారు. దీని వల్ల రాష్ట్రంలో 15.5 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేకూరుతుందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేందనాథ్ చెప్పారు. 

అఖిల భారత సాంకేతిక విద్యా మండలిచే సూచించబడిన సిఫార్సుల ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీల్లో సిలబస్ లో మార్పులు చేసినట్లు బుగ్గన తెలిపారు. దీని ద్వారా విద్యార్ధులు పరిశ్రమల్లో నైపుణ్యం పెంచుకోటానికి ఉపయోగ పడుతుందని ఆర్ధికమంత్రి  అన్నారు. దీని ద్వారా విద్యార్ధులకు ఉద్యోగం సంపాదించుకోవటం తేలికవుతుందని తెలిపారు. మార్చిన సిలబస్ ను ఈవిద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ గుర్తింపు కళాశాలల్లో అమలు చేస్తారని ఆయన వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సిబ్బంది కోసం పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా కూడా నాణ్యమైన విద్యను అందివ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు.

Andhra Pradesh
Higher Education
Fees Reimbursement
Jagananna vidya deevena
Ys Jagan Mohan Reddy
Buggana Rajendranath Reddy
BUDJET 2019


మరిన్ని వార్తలు