కోర్టు ఆవరణలోనే : యూపీ బార్ కౌన్సిల్ చీఫ్ ని కాల్చి చంపేశాడు

Submitted on 12 June 2019
First Female President Of UP Bar Council Shot Dead In Agra Court Premises

ఉత్తరప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌  అధ్యక్షురాలు  దర్వేశ్‌ యాదవ్‌ హత్యకు గురయ్యారు. జూన్-9,2019న ప్రయాగ్ రాజ్ లో యూపీ బార్‌ కౌన్సిల్‌ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయిన ఆమె బుధవారం(జూన్-12,2019) ఆగ్రా సివిల్ కోర్టు ఆవరణలో సహచర న్యాయవాది మనీష్ శర్మ జరిపిన కాల్పుల్లో హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు.ఆగ్రా జిల్లా కోర్టులో ఆమె ఇవాళ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాగత స్వీకారం తీసుకునేందుకు వెళ్తుండగా మనీష్ శర్మ ఆమెపై కాల్పులు జరిపాడు.అనంతరం మనీష్ తనను తాను కాల్చుకున్నాడు.

వెంటనే ఇద్దరినీ పుష్పాంజలి హాస్పిటల్ కు తరలించగా దర్వేశ్ యాదవ్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మనీష్ శర్మ పరస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆగ్రా జిల్లా కోర్టులో ఆమె నేడు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాగత స్వీకారం తీసుకునేందుకు వెళ్తుండగా హత్యకు గురయ్యారు. దర్వేశ్‌పై కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు మనీశ్‌ తనకు తానుగా కాల్చుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
సీనియర్ లాయర్ అరవింద్ మిశ్రా చాంబర్ లో మనీష్ శర్మ, దర్వేశ్ యాదవ్ ల మధ్య పెద్ద వాగ్వాదం జరిగిందని,దీంతో కోపోద్రిక్తుడైన మనీష్ ఆమెపై కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

UP
BAR COUNCIL
DARVESH YADAV
shot
Dead
MANISH SHARMA
Agra
CIVIL COURT
FIRST
FEMALE PRESIDENT

మరిన్ని వార్తలు