వచ్చాడయ్యో సామీ! : లాలూకి బెయిల్

Submitted on 12 July 2019
Fodder scam: Jharkhand HC grants bail to Lalu Prasad Yadav

డియోఘర్ ఖజానాకు సంబంధించిన పశుగ్రాసం కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు ఇవాళ(జులై-12,2019) బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్యంతో ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (RIMS)లో ట్రీట్మెంట్ పొందుతున్న లాలూ...వైద్య కారణాలు,వృద్ధాప్యం దృష్ట్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరడంతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000కు రెండు ష్యూరిటీలతో బెయిలు మంజూరుకు జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్ ఆదేశించారు.

ఈ కేసులో ఇంతకముందు ఆయనకు కోర్టు 3.5 ఏళ్లు జైలుశిక్ష విధించింది. అయితే 1990లలో బీహార్‌లో చోటు చేసుకున్న కోట్లాది రూపాయల పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన మిగతా కేసుల్లో వివిధ జైలు శిక్షలున్నందున లాలూ జైలులోనే ఉండాల్సి వస్తుందని తెలుస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్ లో...సుప్రీం కోర్టు లాలు బెయిల్ పిటీషన్ ను తిరస్కరించిన విషయం తెలిసిందే. 4 నెలలుగా జైల్లో ఉన్నానంటూ ఆయన చేసిన వాదనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో ఆయనకు పడ్డ 14 ఏళ్ల జైలుశిక్షతో పోలిస్తే 24 నెలలు పెద్ద లెక్కలోనిదేమీ కాదని తెలిపింది. 

laluprasad yadav
bail
FODDER SCAM
RANCHI HIGH COURT
grants
Jharkhand
BIHAR


మరిన్ని వార్తలు