ఫర్ ది పీపుల్

Thursday, October 6, 2016 - 19:58

జమ్ము కశ్మీర్ ప్రాంతంలోని యూరిపై పాకిస్థాన్ చేసిన ఉగ్రదాడిలో భారత్ జవాన్లు 18మంది బలైపోయారు. దీంతో ఉగ్రమూకల పీచమణచేందుకు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పొంచి ఉన్న నరహంతక టెర్రిరిస్టులను ఏరిపారేసేందుకు సర్జికల్ దాడులతో పాకిస్థాన్ ను చావుదెబ్బ కొట్టింది. ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తూ.. కయ్యానికి కాలు దువ్వే పాక్‌కూ హెచ్చరికలు జారీ...

Sunday, February 21, 2016 - 11:44

జేఎన్ యూ ఘటన దేశ వ్యాప్తంగా రగలుతోనే ఉంది. జాతి వ్యతిరక విధానాలు చేశాడని జేఎన్ యూ నేత కన్హయ్యతో పాటు ఇతర విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కన్హయ్యను విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఏది దేశభక్తి ? ఏది దేశ ద్రోహం ? జేఎన్ యూ వివాదంలో కుట్ర ఎవరిది అనే అంశాలపై 'ఫర్ ది పీపుల్' కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విశ్లేషణ చేశారు. జేఎన్ యు...

Sunday, January 24, 2016 - 10:00

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని చుట్టూ అగ్రికల్చర్ ప్రొటక్షన్ జోన్స్ వెలుస్తున్నాయి. ఈ జోన్స్ వల్ల రైతులకు నిజంగా లాభం జరుగుతుందా ? నష్టం జరుగుతుందా ? అసలు ఈ ప్రోటక్షన్స్ జోన్స్ ఎందుకు ? ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో ఈ ప్రొటక్షన్ జోన్స్ ప్రతిపాదిస్తోంది ? వ్యవసాయ రంగానికి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. అసలు దీని వెనుక మతలబు..ఇతర విషయాలపై 'ఫర్ ది పీపుల్'...

Sunday, January 10, 2016 - 10:23

హైదరాబాద్ : బల్దియాలో ఎన్నికల నగారా మోగింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర విమర్శనాస్త్రాలతో ఎన్నికల రణరంగంలోకి దూకుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? ఈ ఎన్నికల్లో ఏఏ అంశాలపై దృష్టి సారించాలి ? వివిధ రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల సందర్భంగా ఏఏ అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది? ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రాధాన్యత...

Sunday, January 3, 2016 - 10:01

హైదరాబాద్ : ఇటీవలే కోల్ కతాలో సీపీఎం జాతీయ ప్లీనం జరిగింది. ఈ ప్లీనంలో పార్టీ నిర్మాణం పై ఏఏ అంశాలను చర్చించారు? పార్టీ నిర్మాణంపై నేతలు అంతర్మథనం, ఆత్మపరిశోధన చేసుకున్నారా? భవిష్యత్ లో పార్టీ పెరుగుదలకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థికపరమైన పోరాటాల్లో ఛాంపియన్‌గా నిలిచిన సీపీఐ(ఎం)ను, సామాజిక పోరాటాల్లోనూ అదేస్థాయిలో నిలపాలని భావిస్తోందా? 'వామపక్ష...

Sunday, December 13, 2015 - 10:03

హైదరాబాద్ : ఆకుపచ్చని విశాఖ మన్యంలోబాక్సైట్ చిచ్చు రగులుతోంది. బాక్సైట్ తవ్వకాలకు అనుమతి మంజూరు చేయకూడదని స్థానిక గిరిజనులు, వామపక్షాలు, విపక్షాలు మూకుమ్మడిగా నినదిస్తున్నా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. అస్సలు బాక్సైట్ తవ్వకాల వల్ల ఎవరి లాభం చేకూరుతుంది? ఎందుకు ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది? ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం ఎందుకు ఖాతరు చేయడం లేదు? ఈ...

Sunday, November 29, 2015 - 10:18

ప్రైవేటు రంగంలో ప్రభుత్వ నియంత్రణ ఉండాలని, ముఖ్యంగా విద్యా రంగంలో ఫీజు నియంత్రణ చట్టం ఉండాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రైవేటు విశ్వ విద్యాలయాల రాకతో విద్యారంగ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. నిజానికి ప్రైవేటు విశ్వ విద్యాలయాల వల్ల సామాన్యులకు, మధ్య...

Sunday, October 25, 2015 - 12:22

భారతదేశం అభివృద్ధి చెందాలంటే... ఆర్థికపరిస్థితి బాగుపడాలంటే మేకిన్ ఇండియా వల్ల సాధ్యం కాదని.. మేక్ ఫర్ ఇండియా వల్లే సాధ్యం అవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. 'ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి శంకుస్థాపన ఘనంగా జరిగింది. అయతే అమరావతి కల సాకారం కావడానికి ప్రపంచఆర్థిక వ్యవస్థకు సంబంధం ఏంటీ.. అనే అంశాలపై ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు విశ్లేషణ...

Sunday, October 18, 2015 - 10:08

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వచ్చిన ప్రభుత్వం వినూత్న జల విధానం ఏర్పాటు చేయడం లేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే జల విధానం ఏ విధంగా ఉంది. సాగు, తాగు నీటిని తెలంగాణలోని పది జిల్లాలకు సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోతుందా ? విధానంలో లోపాలున్నాయా ? లోపాలు ఉంటే ఏ విధంగా సరిదిద్దుకోవాలనే...

Sunday, October 11, 2015 - 10:11

అమరావతి శంకుస్థాపన ఇంత అట్టహాసంగా చేయడం అవసరమా అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు పేర్కొన్నారు. శంకుస్థాపనకు సిద్ధమైన అమరావతి రాజధాని నగర ప్రణాళిక పూర్తిగా సిద్ధంగా ఉందా ? భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందా ? వంటి అంశాలపై టెన్ టివిలో 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో రాఘవులు విశ్లేషించారు. ఆయన మాటల్లోనే.....

Sunday, October 4, 2015 - 11:58

ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు.  వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వాలు స్పందించి.. రైతులను ఆదుకుని, ఆత్మహత్యలను నివారించాలని పేర్కొన్నారు. 'తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గతంతో పోల్చితే రైతుల ఆత్మహత్యల సంఖ్య మరింత...

Sunday, September 20, 2015 - 12:59

ఎపికి ప్రత్యేకహోదాపై రాజకీయ నిర్ణయం జరగాలని.... అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇదే అంశాలపై నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' విశ్లేషణ కార్యక్రమంలో రాఘవులు పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీలు వంటి అంశాలను రాజకీయంగా పరిష్కారం చేయాలి తప్ప.. ఎవరికి నచ్చిట్లు వారు చేయాలంటే సాధ్యం కాదన్నారు....

Sunday, September 13, 2015 - 09:58

కేజీ టు పీజీ. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా ఏర్పడడానికి ముందు తెలంగాణలో రాష్ట్ర సమితి అద్భుతమైన నినాదం ఇచ్చింది. బంగారు తెలంగాణ సాకారాంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. అయితే కేజీ టు పీజీ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళుతోంది ? ప్రభుత్వ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ? ఈ అంశాలపై టెన్ టివి నిర్వహించిన 'ఫర్ ద పీపుల్ టాక్ షో విత్ రాఘవులు' కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు...

Sunday, September 6, 2015 - 12:11

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి కోసం పది లక్షల ఎకరాల భూమి ఏర్పాటు కోసం ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే పారిశ్రామిక ప్రగతి ఆశించిన స్థాయిలో సాధ్యం కావాలంటే మనకు వీలైనంత స్థాయిలో భూమి అందుబాటులో ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది....

Sunday, August 30, 2015 - 09:54

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి తాగు నీరందిస్తామని హామీనిస్తోంది. మీ ఇంటికి నల్లా నీరు రాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగమని స్వయాన సీఎం కేసీఆర్ వెల్లడిస్తున్నారు. ఈ బృహత్తర్ పథకాన్ని ఆరంభించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే వాటర్ గ్రిడ్ పథకం ఏవిధంగా ఉంది ? దాని ప్రణాళిక ఏలా ఉంది ? ఈ పథకం ప్రజలు ఆశించిన ప్రయోజనాలు...

Sunday, August 23, 2015 - 10:59

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని రూపుదిద్దుకుంటుంది. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అత్యాధునిక నగరంగా, అద్భుత నగరంగా, స్మార్ట్ సిటీ నగరంగా దీన్ని నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగినట్లుగానే ప్రణాళికలు రూపొందించామని అంటోంది. అయితే రాష్ట్ర రాజధాని నిర్మాణం ఏ విధంగా ముందుకు వెళ్తోంది...? ఈ ప్రణాళికలోని...

Sunday, August 16, 2015 - 09:50

తెలంగాణ గ్రామాలను బంగారు గ్రామాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'గ్రామ జ్యోతి' పథకానికి శ్రీకారం చుడుతోంది. గంగదేవిపల్లి వేదికగా ఆరంభం కాబోతున్న ఈ పథకం నిజంగా తెలంగాణ పల్లెలను పసిడి సీమలుగా మార్చగలుగుతుందా ? గతంలో గ్రామాభివృద్ధి కోసం అమలు చేసిన పథకాలకు భిన్నంగా ఉంటుందా ? బంగారు గ్రామాల తెలంగాణకు బాటలు వేస్తుందా ? గ్రామ జ్యోతి ఆశయం ఫలించాలంటే ఆచరణ ఎలా...

Sunday, August 9, 2015 - 11:28

ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకహోదా మీద ఆశలు పెట్టుకుంది. అయితే కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్న ఆశల మీద పూర్తిగా నీళ్లు చల్లినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా దక్కే సూచనలు కనిపించడం లేదని అన్ని పార్టీల నాయకులు వాపోతున్నారు. నిజానికి ఈ పరిస్థితికి కారణాలేంటీ..? ఎందుకిలా జరుగుతోంది.......

Sunday, August 2, 2015 - 09:48

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సహజంగానే ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని..పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో తీసుకెళుతారని ప్రజలు చాలా ఆశలతో ఉన్నారు. అలాగే బంగారు తెలంగాణ అనే నినాదం కొత్త స్వప్నాన్ని ఆచరిస్తోంది. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, విశ్వనగరంగా హైదరాబాద్ ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల ఎదుట కొత్త చిత్రపటం ఆవిష్కృతమౌతోంది...

Sunday, July 26, 2015 - 11:10

రాష్ట్ర విభజన జరిగి ఏడాది దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది ? ఆ రాష్ట్రం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు ఏ విధంగా ఉన్నాయి. ? ఏపీ రాష్టం అభివృద్ధి నమూనా ఏ విధంగా ఉండాలి ? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు..ప్రత్యామ్నాయ విధానాలపై టెన్ టివిలో 'టాక్ షో విత్ రాఘవులు' లో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విశ్లేషించారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు తెలిపారో వీడియోలో...

Monday, July 20, 2015 - 10:15

భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పాడ్డాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వం ఏర్పాడ్డాయి. వీరి పాలన జరిగి ఏడాది దాటిపోయింది. ఆయా రాష్ట్రాల పరిపాలన ఎలా ఉంది ? ఉభయ రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక విధానాలు..అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు ఏ విధంగా ఉన్నాయి. ? రెండు రాష్ట్రాల్లో అన్ని వర్గాల ప్రజలను...

Don't Miss