ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల..మరణం తరువాత సంపాదిస్తున్న సెలబ్రిటీలు..

18:12 - November 1, 2018

అమెరికా : పాప్ ప్రపంచంలో అతనికి సాటి ఎవ్వరూ లేరు. రారు. అంతటి పేరు ప్రఖ్యాతులు తన స్వయంకృషితోనే సంపాదించుకున్న గొప్ప సింగర్ మైఖేల్ జాక్సన్. అతని పేరే ఓ ప్రభంజనం, ఓ సంచలనం, ఓ అభిమానం, ఓ వైబ్రేషన్. నల్లజాతీయుడై మైఖేల్ తన జీవితంలో తెల్లటి శరీరంకోసం కోట్లాది డాలర్లలను ఖర్చు పెట్టాడంటారు. అతని  శరీరానికి ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయో లెక్కే లేదు. ఓ సంగీత సామ్రాజం కూలిపోయిన వేళ అభిమానులు తట్టుకోలేకపోయారు. అతని పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సంగీత సామ్రాజ్యం కూలిపోయినా..అతను చరిత్ర సృష్టిస్తునే వున్నాడు. 

Image result for forbes death celabrites listపాప్‌ రారాజు మైఖెల్‌ జాక్సన్‌ చనిపోయి కొన్నేళ్లవుతున్నప్పటికీ అత్యధికంగా సంపాదిస్తున్న డెడ్‌ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌.. చనిపోయిన తర్వాత కూడా డబ్బులు సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. అందులో మైఖెల్‌ జాక్సన్‌ మొదటి స్థానంలో ఉన్నారు. జాక్సన్‌ గతేడాది 400 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. అదెలాగంటే.. లండన్‌కు చెందిన ఈఎంఐ మ్యూజిక్‌ కంపెనీలో జాక్సన్‌కు వాటాలు ఉన్నాయి.జాక్సన్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అన్నీ దాదాపు ఈఎంఐ సంస్థే కొనుగోలు చేసింది. జాక్సన్‌కు చెందిన ప్రైవేట్‌ ఏజెంట్ల ద్వారా ఈ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను సోనీ సంస్థ 287 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ అమ్మకాల ప్రక్రియ ద్వారా జాక్సన్‌ పరోక్షంగా దాదాపు 400 మిలియన్‌ డాలర్లు సంపాదించారు. అలా 2009లో చనిపోయిన జాక్సన్‌ ఇప్పటివరకు 1.8 బిలియన్‌ డాలర్స్‌ను సంపాదించారు. 

  • Image result for forbesమైఖేల్ జాక్సన్      : 1.8 బిలియన్‌ డాలర్స్ 
  • మ్యూజిక్‌ లెజెండ్‌ ఎల్విస్‌ ప్రెస్లే: 31 మిలియన్‌ డాలర్స్  
  • గోల్ఫ్‌ క్రీడాకారుడు ఆర్నాల్డ్‌ పామర్: 27 మిలియన్‌ డాలర్స్ 
  • ప్లేబాయ్‌ సంస్థ వ్యవస్థాపకుడు హ్యూగ్‌ హెఫ్నర్‌: 11.7 మిలియన్‌ డాలర్స్ 
  • ఆ తర్వాతి స్థానాల్లో ప్రముఖ గాయకుడు బాబ్‌ మార్లే, రచయిత స్యూస్‌, గాయని మార్నిల్‌ మన్రో ఉన్నారు.

 

 


 

Don't Miss