రంగు మారింది: బీజేపీ కండువాలు కప్పుకున్న టీడీపీ ఎంపీలు

Submitted on 20 June 2019
four Rajya Sabha members of TDP joined BJP

ఏపీ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. గురువారం (జూన్ 20, 2019) సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు బీజేపీలో చేరారు. సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లకు కండువాలు కప్పి.. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. అనారోగ్యం కారణంగా గరికపాటి మోహన్ రావు హాజరు కాలేదు.

ప్రధాని మోడీ నాయకత్వం నచ్చే నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరారని జేపీ నడ్డా తెలిపారు. టీడీపీ నేతల చేరికతో ఏపీలో బీజేపీ బలం పెరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఎంపీలు నమ్మారని, అందుకే బీజేపీలో చేరారని నడ్డా తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. కేంద్రం సహకారం ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశం మనోగతం ఎలా ఉందో అందరం చూస్తూనే ఉన్నామని చెప్పారు. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే బీజేపీలో చేరామన్న సుజనా చౌదరి.. దేశాభివృద్ధికి తమ వంతు సాయం చేస్తామన్నారు.

అంతకముందు తాము టీడీపీని వీడినట్టు రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఎంపీలు లేఖ ఇచ్చారు. ఇకపై తమను టీడీపీ సభ్యులుగా కాకుండా ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని వెంకయ్యను కోరారు. అనర్హత వేటు పడకుండా ఫిరాయింపు ఎంపీలు ఈ ఎత్తు వేశారు.

TDP
FOUR
Rajya Sabha members
join
BJP
Delhi
JP NADDA

మరిన్ని వార్తలు