ఇక ఎంత క్యాష్ అయినా పంపుకోవచ్చు : జులై 1 నుంచి ఉచితం

Submitted on 12 June 2019
Fund transfers via RTGS, NEFT to cost less from July 1 

బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ మరో ఊరట ఇచ్చింది. ఆన్ లైన్ ఛార్జీలు రద్దు చేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా జరిపే లావాదేవీలపై విధించే చార్జీలను ఎత్తివేసింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై ఇక నుంచి ఎలాంటి చెల్లింపులు జరపాల్సిన అవసరం లేదు. ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ ఖాతాదారులకు అందించాలని ఆర్బీఐ సూచించింది. జూన్ 6న పరపతి సమీక్షలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో నగదు ట్రాన్సఫర్  చేసేందుకు ఆర్టీజీఎస్‌, రూ.2 లక్షల్లోపు నగదును బదిలీ చేసేందుకు నెఫ్ట్‌ ఉపయోగపడతాయి.

సాధారణంగా ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకుల నుంచి ఆర్బీఐ కనీస రుసుము వసూలు చేసేది. దీంతో బ్యాంకులు  ఆ చార్జీలను వినియోగదారుల నుంచి రాబట్టేవి. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు చలామణి తగ్గించడం, డిజిటల్‌  లావాదేవీలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తాజాగా ఈ ఛార్జీలను ఆర్బీఐ రద్దు చేసింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా జరిపే నగదు  బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని వెల్లడించింది. బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి ఆ రుసుములు  వసూలు చేయొద్దని ఆర్బీఐ ఆదేశించింది. ప్రస్తుతం ఎస్బీఐ.. నెఫ్ట్‌ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్టీజీస్‌  లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది.

Fund transfers
rtgs
neft
July 1st
RBI
banks
SBI
online transfers

మరిన్ని వార్తలు