అమ్మఒడి పథకానికి జగన్ పేరు:  6వేల 4వందల 55కోట్లు కేటాయింపు 

Submitted on 12 July 2019
Funds to Amma Vodi Scheme in AP Budget 2019

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ అసెంబ్లీలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్‌ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

వైసీపీ మ్యానిఫెస్టో అమలే ప్రభుత్వ బాధ్యత అని ఆయన వెల్లడించారు. పక్షులకు ఆకాశమే బలం, చేపలకు నీళ్లే బలం, పిల్లలకు అమ్మ ఒడే బలం.. అందుకే పిల్లలకు చదవు ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో వారి సంకల్పానికి అండగా ఉండేందుకు వారికి వనరులు సమకూర్చాలని, ఒక్కొక్క తల్లికి 15వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ పథకానికి 'జగనన్న అమ్మఒడి' అనే పేరు పెట్టినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ తెలిపారు. తొలుత 1వ తరగతి నుంచి 10వ తరగతి అని అనుకున్నా కూడా ఇంటర్ విద్యార్ధులను కూడా ఈ పథకం కిందకు తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 43లక్షల మంది తల్లులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.

సీఎం గారిని ప్రాధేయపడిన తర్వాత ఈ పథకానికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. తల్లికి దేశంలో తొలిసారి ఇటువంటి పథకం సీఎం జగన్ అందించారని, అందుకే ఈ పథకానికి ఆయన పేరు పెట్టినట్లు చెప్పారు. ఈ పథకానికి 6వేల 4వందల 55కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 

Amma Vodi Scheme
ap budget 2019
Jagan


మరిన్ని వార్తలు