ఫస్ట్ వికెట్: టీడీపీకి ఎమ్మెల్యే అభ్యర్ధి రాజీనామా

Submitted on 27 May 2019
Gangadhara Nellore's Tdp Candidate Anaganti Harikrishna Resigns TDP

ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏపీలో టీడీపీకి 23సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీ నేతలు సమీక్షలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గట్టి షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత టీడీపీలోని ముఖ్య నాయకుల్లో ఫస్ట్ వికెట్ పడిపోయింది. గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి 2019ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆనగంటి హరికృష్ణ టీడీపీకి రాజీనామా చేశారు. నియోజకవర్గంలో ఓటమితో జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత బండి ఆనందరెడ్డి వెల్లడించారు.

పెరుమాళ్లపల్లె పోలింగ్‌ కేంద్రం పరిధిలో పార్టీకి ఓట్లు వేయించడంలో వైఫల్యం చెందానని, అందుకే మనస్తాపంతో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో 59.67శాతం ఓట్ షేర్‌తో లక్షా 3వేల 38ఓట్లు సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కె.నారాయణ స్వామి.. టీడీపీ ఎమ్మెల్యే ఆభ్యర్థి ఆనగంటి హరికృష్ణ పై 45వేల 594ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి 57వేల 444ఓట్లు వచ్చాయి. ఇదిలా ఉంటే జనసేనకు నియోజకవర్గంలో 3364ఓట్లు పడ్డాయి. నోటాకు 2279 ఓట్లు పడ్డాయి.
 

Gangadhara Nellore
tdp candidate
Anaganti Harikrishna
Resigns TDP

మరిన్ని వార్తలు