ఇంటికి స్మైలీ పెయింటింగ్స్ : రచ్చ చేసిన పక్కింటోళ్లు

Submitted on 11 August 2019
Giant emojis painted on house roil California community

మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లుగా అయ్యింది ఆమె పరిస్థితి. నలుగురి మంచి కోరుకుని వివాదంలో చిక్కుకుంది ఓ మహిళ. అసలు విషయం ఏమిటంటే..


కాలిఫోర్నియాలో నివసించే  కేథరీన్ కీడ్ తన ఇంటి గోడలపై స్మైలీల పెయింటింగ్స్ వేయించింది. స్మైలీ చూడగానే ఎవరికైనా ఒత్తిడి పోయి మొహంలో చిరునవ్వు వస్తుంది.  అదే ఉద్ధేశంతో కేథరీన్ తన ఇరుగు పొరుగువారు సంతోషంగా ఉంచాలనుకుని ఇంటికి స్మైలీల పెయింటింగ్స్ వేయించింది.  వాటిని చూసి కేథరీన్ తో గొడవకు దిగారు ఇరుగు పొరుగు వారు. 

ఈ విషయంపై కేథరీన్ మాట్లాడుతూ..తన ఇంటిపొరుగున ఉన్నవారు ఎప్పుడూ ఏదో బాధలో ఉన్నట్లుగా విచారంగా కనిపిస్తుంటారని..వారిని ఆనందంగా ఉంచాలని ..తన ఇంటి గోడలపై స్మైలీ బొమ్మలు పెయింట్ చేయించానని కేథరిన్ తెలిపింది. అది వారికి నచ్చలేదు. సరికదా..సురేన్ అనే నైబర్ కేథరిన్‌తో గొడవకు దిగుతూ..కేథరిన్ చాలా ఎక్కువ చేస్తోందనీ..తమను అవమానించేందుకు ఇంటికి స్మైలీ బొమ్మల పెయింటింగ్ వేయించిందనీ ఆరోపిస్తున్నారు. ఆమె ఇంటి గోడలపై స్మైలీ బొమ్మలు వేసినప్పటి నుంచి తమ ఇంటి కిటికీలు కూడా తీయడం మానివేశామని సురేన్ ఆగ్రహంతో తెలిపారు. ఈ విచిత్ర సందర్భం కాస్తా  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

emojis
painted
house
roil California
Catherine Kead

మరిన్ని వార్తలు