మా నాన్న ఉద్యోగం తిరిగి ఇవ్వండి :మోడీకి 37 లేఖలు రాసిన బాలుడు

Submitted on 8 June 2019
Give back my dad's job..8th class boy 37 letters of a boy to Prime Minister Modi

ఓ బాలుడు ప్రధాని మోడీకి వరసగా లేఖలపై లేఖలు రాస్తున్నాడు. 8వ తరగతి చదువుతున్న ఈ బాలుడు లేఖలు రాయటానికి కారణం తన తండ్రి ఉద్యోగం. మా నాన్నకు ఉద్యోగం తిరిగి ఇప్పించండని సార్’ అంటూ ఒకటి.. రెండు కాదు ఇప్పటికే 37 లెటర్లు రాశాడు. 2016 నుంచి ప్రధాని మోడీకి రాస్తూనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సర్తక్ త్రిపాఠి అనే 13 సంవత్సరాల ఈ బాలుడు రాస్తున్న లేఖలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

లేఖలు వెనక కారణం :
ఉత్తరప్రదేశ్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌(UPSE)లో బాలుడి తండ్రి ఉద్యోగం చేసేవాడు. కొన్నేళ్ల క్రితం ఓ కుంభకోణం బయటపడింది. కారణం ఎవరు అనేది తేలకముందే ఈ బాలుడి తండ్రిని ఉద్యోగం నుంచి తొలగించారు.

మా నాన్న ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం చాలా ఇబ్బందులు పడుతోంది. ఎన్నికల ప్రచారంలో మీరు ఇచ్చిన స్లోగన్‌ విన్నాను. మోడీ ప్రధానిగా ఉంటే అన్ని సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మాము. అందుకే మా రిక్వెస్ట్ ను మన్నించి.. ఆవేదన అర్థం చేసుకుని.. ఉద్యోగం తిరిగి ఇప్పించగలరు అంటూ ప్రధాని మోడీని లేఖలో కోరాడు.

మా నాన్న ఉద్యోగం పోవటానికి కారణమైన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు ఈ బాలుడు. 36 లేఖలకు స్పందించని మోడీ.. 37వ లేఖకు అయినా స్పందిస్తారో లేదో చూడాలి.

 

Uttar Pradesh 8th class boy
Prime Minister Modi
37 letters
Give back my dad's job

మరిన్ని వార్తలు