నలుగురు మంత్రుల రాజీనామా కోరిన గోవా సీఎం

Submitted on 12 July 2019
GOA CM SEEKS RESIGNATION OF FOUR MINISTERS

రెండు రోజుల క్రితం పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చేందుకు గోవా సీఎం ప్రమోద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కేబినెట్ మంత్రలు రాజీనామా చేయాలని సీఎం కోరారు. సీఎం రాజీనామా చేయాలని కోరిన నలుగురు మంత్రులలో ముగ్గురు గోవా ఫార్వార్డ్ పార్టీకి చెందిన విజయ్ సర్దేశాయ్,జయేష్ సల్గోన్కర్,వినోద్ పాలేకర్ లు కాగా ఒకరు స్వతంత్ర్య అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన వ్యక్తి. ఈ నలుగురి స్థానంలో కొత్తగా మరో నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు.

మేం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నాం. బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చల తర్వాత రాష్ట్రంలోని బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వంలో చేరడం జరిగింది. ప్రస్తుతమున్న బీజేపీ రాష్ట్ర నాయకులు అప్పటి చర్చల్లో భాగస్వాములుగా లేరని సావంత్ డిమాండ్ పై గోవా ఫార్వార్డ్ పార్టీ మంత్రులు ట్విట్టర్ వేదికగా తమ గోడు వెళ్లబోసుకున్నారు. కేంద్రంలోని ఎన్డీయే నాయకత్వంతో మాట్లాడిన తర్వాతే తాము ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు.

బుధవారం(జులై-10,2019) ;ప్రతిపక్ష నాయకుడితో సహా 10మంది గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.కాంగ్రెస్ సీఎల్పీని బీజేపీలో విలీనం చేయాలని వారు స్పీకర్ ని కోరిన విషయం తెలిసిందే.

Goa
CM
seeks
resignation
FOUR MINISTERS
BJP
NDA
CENTRAL LEADERS
Congress
MERGE


మరిన్ని వార్తలు