మరింత ప్రియం : పెరగనున్న బంగారం ధరలు

Submitted on 10 June 2019
Gold may touch 1,390 dollars level as outlook brightens

బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. బంగారం ధరలు పెరగనున్నాయి. మార్గెట్ వర్గాల ప్రకారం పసిడి మరింత ప్రియం కానుంది. గోల్డ్ ప్రైస్ 1,350 డాలర్ల మార్కును దాటొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు తేల్చారు. దానికి పెద్దగా సమయం పట్టదని, త్వరలోనే అది జరుగుతుందని చెబుతున్నారు. ఏడాది కాలంగా చూస్తే గత వారంలో పసిడి మార్కెట్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఇదే ఊపు కొనసాగిస్తే.. కీలకమైన దీర్ఘకాలిక నిరోధ స్థాయి 1,350 డాలర్ల మార్కును సమీప కాలంలోనే క్రాస్ చేయొచ్చని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి అమెరికా, చైనా కారణం అని విశ్లేషిస్తున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం బంగారం ధరలపై పడింది.
Also Read : కస్టమర్ కు కట్టండి : సోనీ టీవీ కంపెనీకి రూ.3లక్షల జరిమానా
 
చైనాకు చెందిన ఉత్పత్తులపై అమెరికా భారీగా ఆంక్షలు విధించింది. చైనా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అటు అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ రేటు పడిపోతోంది. ఇది కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోంది. అమెరికాలో ఉద్యోగ కల్పన లెక్కలు నిరుత్సాహంగా ఉన్నాయి. దీని ప్రభావం బంగారం ధరలపై పడింది. బంగారం ధరలు మళ్లీ 1,350 డాలర్ల చేరువకు దగ్గరయ్యాయని వివరిస్తున్నారు. ఫ్యూచర్స్‌ మార్కెట్ లో ఆగస్టు కాంట్రాక్టుకి సంబంధించి పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 2.7 శాతం పెరిగి ఒక దశలో 1,347.10 డాలర్లుగా ట్రేడ్ అయ్యింది.

పసిడి ధర పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ చెప్పారు. 2019 చివరినాటికి ఔన్సుకు 1,400 డాలర్లకు కూడా చేరగలిగే సత్తా కనిపిస్తోందని అన్నారు. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ.. సాంకేతికంగా కొన్ని గట్టి నిరోధ స్థాయులు కూడా ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. 2015లో కనిష్ట స్థాయిని తాకినప్పటి నుంచి 1,350 నిరోధ స్థాయిని పసిడి ఇప్పటిదాకా 8 సార్లు పరీక్షిస్తూ వస్తోంది. మొత్తంగా గోల్డ్ ధర 1,350 డాలర్లకి పైన పటిష్టంగా ముగిసిన పక్షంలో మధ్య కాలికంగా ఆ తర్వాత 1,360.. 1,375 స్థాయులకు చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరలు పెరగనున్నాయనే వార్తలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముందు ముందు బంగారం కొనే పరిస్థితి ఉంటుందో లేదో అని వర్రీ అవుతున్నారు.

ఆదివారం (జూన్ 9,2019) బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల గ్రాము బంగారం రూ..9 పెరిగి రూ.3,399 దగ్గర స్థిరపడింది. 22 క్యారెట్ల  గ్రాము బంగారం రూ.9 పెరిగి రూ.3,123 దగ్గర కొనసాగుతోంది. వెండి కూడా బంగారం దారిలోనే ప్రయాణించింది. కిలో వెండి ధర రూ.20 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో వెండి రూ.39,860 కి లభిస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.33వేల 990 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31వేల 230 గా ఉంది.
Also Read : ఆ ఆరుగురు దోషులు : కథువా చిన్నారి రేప్, మర్డర్ కేసులో కోర్టు తీర్పు

trade war
effect
gold
prices high
Increase
bullion market
america
China
global
economy

మరిన్ని వార్తలు