పుత్తడి ధరలు పైపైకి: 10గ్రాముల బంగారం ధర రూ.74 వేలు

Submitted on 13 August 2019
Gold Rate In Pakistan, Price On 12 August 2019

పుత్తడి ధరలు పైపైకి వెళ్తూనే ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరల పరుగుకు ఇప్పట్లో అయితే బ్రేక్‌లు పడే అవకాశం లేనట్లే ఉంది. ఫెడ్‌ వడ్డీరేటు, అమెరికా చైనా ట్రేడ్‌వార్‌ లాంటి అంతర్జాతీయ పరిణామాలు, స్థానిక వర్తకుల నుండి డిమాండ్ పెరిగిన క్రమంలో బంగారం ధర భారీగా పెరుగుతూ పోతుంది.

భారత్ లో బంగారం ధరలు రూ.38 వేలు మార్క్‌ను ఇప్పటికే దాటేసింది. అంతేకాదు త్వరలో రూ.40వేలకు కూడా బంగారం ధరలు చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ లో అంచనాలు వినిపిస్తున్నాయి. వెండి కూడా దాదాపు ఇందే రేంజ్‌లో పరుగులు తీస్తుంది.

ఇదిలా ఉంటే పాకిస్తాన్‌లో అయితే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాకిస్తాన్‌లో ఇండియాతో పోలిస్తే బంగారం ధర రెండింతలు ఎక్కువగా ఉంటుంది. అయితే సోమవారం(2019 ఆగస్ట్ 12) పాకిస్తాన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.74,588గా ఉంది. పాకిస్తాన్ పరిమాణంలో తులా బార్స్ బంగారం రూ.87,000గా ఉంది. పాకిస్తాన్‌లోని ఒక్కో నగరంలో ఒక్కో ధర పలుకుతూ ఉంటుంది. 

పాకిస్తాన్‌లోని కరాచిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,588 ఉండగా, 24 క్యారెట్ల తుల బార్ రూ.87,000, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,373గా ఉంది. లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, క్వెట్టా, సియాల్‌కోట్ నగరాల్లో 24 క్యారెట్లు, 24 క్యారెట్లు తుల బార్స్, 22 క్యారెట్ల బంగారం వరుసగా.. రూ.74,588, రూ.87,000, రూ.68,373గా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

Gold Rate
Pakistan
price
12 August 2019

మరిన్ని వార్తలు