కస్టమర్లకు బిగ్ రిలీఫ్ : IMPS ఛార్జీలు ఎత్తేసిన SBI 

Submitted on 12 July 2019
Good news! After NEFT, RTGS, SBI makes all IMPS transactions free

SBI ఖాతాదారులకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ IMPS (ఇమ్మిడియేట్ పేమెంట్ సర్వీసు) ఛార్జీలు ఎత్తేసింది. ఈ కొత్త నిబంధన ఆగస్టు 1, 2019 నుంచి అమల్లోకి రానుంది. Yono యాప్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా IMPS మనీ ట్రాన్స్‌పర్ చేసే యూజర్లకు జీరో ఛార్జీలు ఉంటాయి. అంటే.. ఎలాంటి ఛార్జీలు ఉండవు అని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. NEFT, RTGS ట్రాన్స్ జెక్షన్లపై ఛార్జీలు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. 

NEFT ద్వారా రూ.2లక్షల లోపు లావాదేవీలకు ఛార్జీలు వర్తించవు. ఈ నిబంధన అన్ని బ్యాంకుల్లో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే.. కేవలం NEFT, RTGS లావాదేవీలపై మాత్రమే జోరో ఛార్జీలు వర్తిస్తాయి. కానీ, IMPS ద్వారా చేసే లావాదేవీలపై మాత్రం బ్యాంకులు ఛార్జీలు విధిస్తున్నాయి. IMPS ద్వారా వెయ్యి లోపు నగదు బదిలీ చేస్తే ఎలాంటి ఛార్జీలు విధించవు. ఆపై నగదు బదిలీలు జరిపితే రూ.2 నుంచి ఛార్జీలు విధిస్తోంది.

ఎస్‌బీఐ తాజా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 1 నుంచి IMPS లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. సాధారణంగా IMPS సర్వీసు 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఎస్ బీఐ రివైజ్ చేసిన IMPS ఛార్జీల ప్రకారం.. (రూ.1001 నుంచి రూ.10వేలు, రూ.10వేల 01 నుంచి రూ.25వేలు, రూ.25వేల 01 నుంచి రూ.1లక్ష, రూ.1లక్ష 001 నుంచి రూ.2లక్షలు) వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. 

మార్చి నెలాఖరుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగించిన ఎస్బీఐ కస్టమర్ల సంఖ్య 6 కోట్లుకు పైగా చేరుకుంది. మరోవైపు 1.41 కోట్ల మంది యూజర్లు మొబైల్ బ్యాంకు సర్వీసులను వినియోగించుకుంటున్నారు. మొత్తం మీద 18శాతం వరకు మొబైల్ బ్యాంకింగ్ ట్రాన్స్ జెక్షన్స్ లోనే మార్కెట్ షేర్ అవుతున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. 

neft
rtgs
SBI
all IMPS
transactions free
RBI


మరిన్ని వార్తలు