మాల్ వేర్ ఇన్ఫెక్టడ్ : గూగుల్ ప్లే స్టోర్ లో 2వేల ఫేక్ యాప్స్ 

Submitted on 26 June 2019
Google's Android Play Store Has Over 2,000 Fake Apps, Most Likely Malware Claims New Study

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అలర్ట్. మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫేక్ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకుని ఫేక్ యాప్ ను ఒకసారి ఇన్ స్టాల్ చేస్తే చాలు.. మాల్ వేర్ వైరస్.. మీకు తెలియకుండానే మీ ఫోన్లో తిష్టవేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ సపోర్ట్ యాప్స్ 2వేల వరకు ఫేక్ యాప్స్ ఉన్నాయని ఓ కొత్త పరిశోధన వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉన్నారు. వేలాది మంది డెవలపర్లు రోజురోజుకీ ఎన్నో యాప్స్ డెవలప్ చేసి ప్లో స్టోర్లలో వదిలేస్తున్నారు. ఇందులో పనికి వచ్చే యాప్స్ కంటే.. ఫేక్ యాప్స్ ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం చెబుతోంది. యాప్ ప్లే స్టోర్ ఓపెన్ ప్లాట్ ఫాంగా ఉండేలా గూగుల్ ప్రతిఒక్కరికి అందుబాటులోకి తీసుకోచ్చింది.  ప్లే స్టోర్ లో ఉన్న యాప్స్ ఏది ఫేక్ ఏది ఒరిజినల్ అని గుర్తించడం కష్టమే మరి.

దురదృష్టవశాత్తూ కొన్నిసార్లు మాలిసియస్ యాప్స్ యూజర్లను చిక్కుల్లో పడేస్తున్నాయి. ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ, CSIRO, Data61కు చెందిన పరిశోధక బృందం ప్లే స్టోర్ యాప్స్ పై రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్ లో భాగంగా రెండేళ్ల పాటు గూగుల్ ప్లే స్టోర్ పై కనిపించే మిలియన్ల యాప్స్ పై నిఘా పెట్టింది. ఇందులో 2వేల వరకు ఫేక్ యాప్స్ ఉన్నట్టు గుర్తించింది. అంతేకాదు.. ఈ ఫేక్ యాప్స్ లోనే మాల్ వేర్ వైరస్ ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. పాపులర్ యాప్స్ పోలిన ఫేక్ యాప్స్ ఐకాన్ మాదిరిగా క్రియేట్ చేసి ప్లే స్టోర్లలో వదిలేస్తున్నారు.

యాప్ డిస్ర్కప్షన్ టెక్స్ట్ ను ఎట్రాక్టీవ్ గా పెట్టడం, ఫేక్ రివ్యూలను ఉంచడం చేస్తున్నారు.  ప్లే స్టోర్ నుంచి యూజర్లు ఏదైనా యాప్ ను డౌన్ లోడ్ చేసే సమయంలో యాప్.. డిస్ర్కప్షన్.. రివ్యూలను చూసి డౌన్ లోడ్ చేస్తుంటారు. ఇదే అదునుగా భావించి చాలామంది ఫేక్ యాప్స్ క్రియేటర్లు యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు. రీసెర్చర్లు ఆల్గారిథమ్ ద్వారా ప్లే స్టోర్ పై ఉన్న 7వేల 246 వరకు ఫేక్ యాప్స్ గా గుర్తించారు. ఈ యాప్స్ లో 2వేల 040 వరకు హైరిస్క్ మాల్ వేర్ ఇన్ఫెక్ట్ అయిన యాప్స్ ఉన్నట్టు గుర్తించారు. 

google
Android Play Store
Fake Apps
Malware
New Study

మరిన్ని వార్తలు