చాణక్య టీజర్ అప్‌డేట్

Submitted on 13 August 2019
Gopichand Chanakya Teaser Sep 02 2019 on the Eve of Vinayak Chathurthi

మాచో స్టార్ గోపిచంద్, మెహరీన్ జంటగా.. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న స్పై థ్రిల్లర్.. 'చాణక్య'.. గోపిచంద్ నటిస్తున్న 26వ సినిమా ఇది. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ పరిసర ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోనూ షూటింగ్ జరుపుకుంది.

ఇటీవలే టాకీ పార్ట్ పూర్తవగా.. పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లింది మూవీ యూనిట్. గోపిచంద్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా చాణక్య టీజర్ అప్‌డేట్ వచ్చింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 2న చాణక్య టీజర్ రిలీజ్ చెయ్యనున్నారు.

Read Also : సాహో ది గేమ్ - టీజర్..

కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : విశాల్ చంద్రశేఖర్, మాటలు : అబ్బూరి రవి, సమర్పణ : ATV, సహ నిర్మాతలు : అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్, నిర్మాత : రామబ్రహ్మం సుంకర.
 
 

Chanakya Teaser update
Gopichand
Mehreen
Zarine Khan
AK Entertainments
Thiru

మరిన్ని వార్తలు