ఏంటీ బాదుడు : బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేస్తే.. పన్ను కట్టాలి

Submitted on 10 June 2019
Govt may introduce tax on cash withdrawal of Rs 10 lakh in a year

డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పన్ను పోటుకి రెడీ అవుతోంది. ఏడాదిలో బ్యాంకుల నుంచి రూ.10లక్షలు విత్ డ్రా చేస్తే ట్యాక్స్ విధించే యోచనలో ఉంది. సంవత్సరంలో పది లక్షలు విత్ డ్రా చేసే వారి నుంచి పన్ను వసూలు చేయాలని చూస్తోంది. త్వరలోనే ఈ నిబంధన తీసుకురావాలని, దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
Also Read : ఆ ఆరుగురు దోషులు : కథువా చిన్నారి రేప్, మర్డర్ కేసులో కోర్టు తీర్పు

పేపర్ కరెన్సీ వాడకాన్ని తగ్గించడం, క్యాష్ లెస్ లావాదేవీలు, డిజిటల్ పేమెంట్స్ పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ కొత్త రూల్ తీసుకురావాలని చూస్తోంది. మరో ప్రతిపాదన కూడా ఉంది. ఎక్కువ మొత్తం విత్ డ్రా చేయాలంటే ఆధార్ తప్పనిసరి చేయనుంది. ఇలా చేయడం ద్వారా వ్యక్తుల లావాదేవీలను సులభంగా ట్రాక్ చేయొచ్చని భావిస్తోంది. అలాగే పన్ను చెల్లింపులు సరి చేయొచ్చని భావిస్తోంది.

చాలా మంది వ్యక్తులకు, వ్యాపారాలకు ఏడాదికి రూ.10లక్షలు మించి విత్ డ్రా చేయాల్సిన అవసరం ఉండదని కేంద్రం అంచనా వేసింది. దీంతో బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసే నగదు పది లక్షలు దాటితే ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది.

అయితే పేద, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆన్ లైన్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలు తొలగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్ మస్ట్ చేశారు.
Also Read : కస్టమర్ కు కట్టండి : సోనీ టీవీ కంపెనీకి రూ.3లక్షల జరిమానా

Govt
introduce
Tax
cash withdrawal
Rs 10 lakh
Year
RBI
cashless transactions
neft
rtgs
banks
paper less currency

మరిన్ని వార్తలు