ఏపీలో గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టు ప్రారంభం

Submitted on 26 May 2019
Group-1 screening test start in AP

ఏపీలో గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టు ప్రారంభమైంది. ఒక పరీక్ష ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనుంది. రెండో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. ఏపీపీఎస్సీ 258 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. 169 పోస్టులకు లక్షా 14 వేల 473 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. 

రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 16 వేల 644 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 3 వేల 468 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 144 సెక్షన్ విధించారు. 

పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి... అభ్యర్థులు చాలా ఎక్కువగా ఉన్నారని అభ్యర్థులు తెలిపారు. హెవీ సిలబస్ ఉందని, కాంపిటీషన్ ఎక్కువగా ఉందన్నారు. 1:12, 1:15 రేషియో తీస్తున్నారు దీంతో గ్రామీణ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని... కాబట్టి పాత పద్ధతి ప్రకారం.. 1:50 రేషియో తీయాలని కోరారు. 
 

Group-1
Screening Test
start
AP
258 test centers

మరిన్ని వార్తలు