రేపటితో GRP-2 'కీ' పై అభ్యంతరాలకు ఆఖరు

Submitted on 15 May 2019
Group-2 Answer Key Objection Last Date May 16th

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మే 5న మొత్తం 727 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 స్ర్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి మే 9న APPSC 'కీ'ని విడుదల చేసింది. అభ్యర్ధులకు ఆన్సర్ 'కీ' పై అభ్యంతరాలు తెలిపేందుకు మే 16 వరకు అవకాశం కల్పించింది.  రేపు (మే 16) సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఇప్పటికీ అభ్యంతరాలు తెలపని వారు తెలపవచ్చు.  

ఈ పరీక్షకు మొత్తం 2,95,036 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,28,263 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 1,77,876 (77.92%) మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మిగతా 50,387 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.  

Group-2
Screening Test
Answer Key
2019

మరిన్ని వార్తలు