గుజరాత్ లో వాయు తుఫాన్: కుప్పకూలిన సోమనాథ్ ప్రధాన ద్వారం

Submitted on 13 June 2019
Gujarat Cyclone Vayu : Somnath Temple Shed Main Entrance Collapsed

 అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాను  గుజరాత్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాయు తుఫాన్ ధాటికి ప్రఖ్యాత దేవాలయం సోమనాథ్ ఆలయం ఎంట్రన్స్ ద్వారం షెడ్ కుప్పకూలిపోయింది. వాయు ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికే 2.75 లక్షలమందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


గుజరాత్ ను వణికిస్తున్న ఈ వాయు తుపాన్ దిశ మార్చుకుని  సముద్రం దిశగా కదులుతోందని, గుజరాత్ లో తీరం తాకదని భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది. గురువారం (జూన్ 13,2019) ఉదయం ఐఎండీ  ప్రకటించింది.ప్రస్తుతం ఈ తుపాను కేటగిరీ 2 లో ఉంది. అది కాస్త బలహీన పడి కేటగిరీ 1 గా మారుతుందని చెప్పారు. అయితే వాయు తుపాను ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భారీ ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. దీని కారణంగా నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.


అరేబియా సముద్రతీరాన వెలసిన పుణ్యక్షేత్రం సోమనాథ్ దేవాలయం. వెరావల్‌ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్య క్షేత్రము సోమనాథేశ్వరుడి దేవాలయం. అతి ప్రాచీనమైనది, పురాణప్రాశస్త్యం కలది అయిన మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా భారీ బండరాళ్ళతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది సోమనాథ్ దేవాలయం. ఈ క్రమంలో గుజరాత్ లో బీభత్సం సృష్టిస్తున్న వాయు తుఫాను సోమనాథ్ దేవాలయం సమీపంలో ప్రభావం చూపుతోంది. 

Gujarat
Cyclone Vayu
somnath temple
Main Entrance
shed
Collapsed

మరిన్ని వార్తలు