విద్యార్ధినుల జుట్టు కత్తిరించి అమ్ముకోవాలనుకున్న ప్రిన్సిపల్ 

Submitted on 13 August 2019
Gurukula school Principal who wants to cut and sell students hair In Medak

మెదక్ ఎస్సీ, ఎస్టీ హాస్టల్ లో విద్యార్థినుల జుట్టుని ప్రిన్సిపల్ కత్తిరించిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గురుకుల హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు రోజూ తల స్నానం చేస్తున్నారని ప్రిన్సిపల్ అరుణ 180 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది. బాలికలు ఏడుస్తున్నా వినలేదు. 180మంది బాలికల జుట్టును కత్తిరించి క్రాఫ్ చేయించింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే కొడతానని బెదిరించింది. దీంతో వారు భయపడి సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో పిల్లల్ని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు వారందరికీ జుట్టు లేకపోవటంతో షాక్ తిన్నారు. ఏం జరిగిందని అడగటంతో ఏడుస్తూ జరిగిన విషయాన్ని చెప్పారు.

దీంతో ప్రిన్సిపల్ ను బాలికల తల్లిదండ్రులు నిలదీశారు. వారితోనూ ప్రిన్సిపల్ దురుసుగా వ్యవహరించింది. హాస్టల్ లో నీటి సమస్య  ఉందని, బాలికలు రోజూ తల స్నానం చేస్తున్నారని, నీటి సమస్య తగ్గించటానికే జుట్టు కత్తిరించాను అని దర్జాగా చెప్పింది అరుణ. నీటి సమస్య ఉంటే మరో విధంగా చేయాలి కానీ.. ఇలా చేయటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

దేవుడి మొక్కు ఉంది జుట్టు కత్తిరించొద్దని ఏడ్చినా వినిపించుకోలేదని.. బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి జుట్టుని కత్తిరించి వేయించిందని విద్యార్థినులు ఏడుస్తూ చెప్పారు. కత్తిరించిన జుట్టుని ప్రిన్సిపల్ అరుణ కిలో రూ.3వేలు చొప్పున మూడు కిలోల జుట్టును అమ్ముకోవటానికి యత్నించిందని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లల వెంట్రుకలు కత్తిరించి తమకే అమ్మాలని ప్రిన్సిపల్ యత్నించిందని..దాని గురించి తమకు ఫోన్ చేసి 3 కిలోల వెంట్రుకలు ఉన్నాయి..కొంటావా అని అడిగిందనీ..ఎంత ఉంటాయని అని అడిగితే..మూడు కిలోలు ఉంటాయని చెప్పిందనీ..కానీ ఆమె పేరు మాత్రం చెప్పలేదనీ..తమకు అనుమానం వచ్చి..ఆరా తీస్తే ఈ విషయం బయటపడిందని అంటున్నారు. వారిలో తమ పిల్లలు ఉన్నారని ఓ మహిళ తెలిపింది. ఈ ఘటన కలెక్టర్ దృష్టికి వెళ్లటంతో విచారణకు ఆదేశించారు.

medak
Gurukula school
PRINCIPAL
Aruna
girls
Hair cuting
sell hair

మరిన్ని వార్తలు