హ్యాకర్స్ వాడిన స్పైవేర్ ఇదే : వాట్సాప్ యూజర్లు జాగ్రత్త!.. 150 కోట్ల మందికి అలర్ట్

Submitted on 14 May 2019
Hackers develop spy software to listen in on WhatsApp users

వాట్సాప్.. వాట్సాప్.. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ కామన్ అయిపోయింది. ఉదయం లేవగానే ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాల్సిందే. లేదంటే.. ఆ రోజు ముందుకు సాగదంతే. వీడియోలు.. ఫొటోలు, న్యూస్ ఏంటా అని చూసేస్తుంటారు. వాట్సాప్ చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేరు. ఫోన్లో.. సౌండ్ వస్తే చాలు.. వెంటనే వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తుంటారు.

ఫోన్లో నెట్ ఉందిగా.. వాట్సాప్ కాల్స్ చేస్తుంటారు. వీడియో కాల్స్ కూడా చేసి స్నేహితులు బంధువులతో తెగ మాట్లాడుతుంటారు. ఎవరూ చూడటం లేదు.. వినడం లేదులే అని ధీమాగా ఉంటారు. కానీ, మీ వాట్సాప్ కాల్స్ హ్యాకర్లు వింటున్నారు? అని తెలుసా? మీకు తెలియకుండానే రహస్యంగా మీ డివైజ్ లోని సమాచారాన్ని పూర్తిగా  హ్యాకర్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉందని గుర్తించారా? అయితే తస్మాత్ జాగ్రత్త. హ్యాకర్లు వింటున్నారు.. మీ వాట్సాప్ కాల్స్.

ఇది నిజమేనా?
ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వాట్సాప్ యూజర్లు ఉన్నారో తెలుసా? సుమారుగా 1.5 బిలియన్లు (150 కోట్లు)మంది యూజర్లు వాట్సాప్ వాడుతున్నారు. 180దేశాల్లోని కోట్లాది మంది వాట్సాప్ యూజర్లను ఓ వార్త ఇప్పుడు వణికిస్తోంది. ఈ వార్త విన్న చాలామంది యూజర్లు.. తమ స్మార్ట్ ఫోన్లలో నుంచి ఏకంగా వాట్సాప్ డిలీట్ చేస్తున్నారంట. హ్యాకర్లు వాట్సాప్ కాల్స్ హ్యాక్ చేసేందుకు కొత్త స్పైవేర్ సాఫ్ట్ వేర్ డెవలప్ చేశారు. అదే.. స్పైవేర్ పిగాసస్. ఈ పేరు వింటనే వాట్సాప్ యూజర్లు హడలి చస్తున్నారు.

హ్యాకర్ల కంట్రోల్లోకి మీ డేటా :
ఈ స్పైవేర్.. వాట్సాప్ అకౌంట్ లోకి మాల్ వేర్ కోడ్ ను ఇంజెక్ట్ చేస్తుంది. దాంతో వాట్సాప్ చాటింగ్, కాల్స్, టెక్స్ట్ మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు అన్ని పూర్తిగా హ్యాకర్లు కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. దీంతో వాట్సాప్ కాల్స్ లో యూజర్లు ఏం మాట్లాడుకుంటున్నారో రహస్యంగా హ్యాకర్లు వినే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసిన యూజర్లు తమ డివైజ్ లనుంచి వాట్సాప్ డిలీట్ చేస్తున్నారంట. 

డోంట్ ఫీయర్.. అప్ డేట్ చేసుకోండి : 
మరోవైపు ప్రముఖ వాట్సాప్ మెసేంజర్ యాప్.. తమ యూజర్లకు వరుసగా నోటిఫికేషన్లు పంపిస్తోంది. హ్యాకర్ల నుంచి యూజర్ల ప్రైవసీని ప్రొటక్ట్ చేసేందుకు వాట్సాప్ ను వెంటనే అప్ గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తోంది. కోట్లాది మంది యూజర్లకు వాట్సాప్ నోటిఫికేషన్ల ద్వారా ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తోంది. భయపడాల్సిన పనిలేదు.. కొత్త అప్ డేట్ తో వాట్సాప్ హ్యాకింగ్ ఇష్యూను ఫిక్స్ చేసినట్టు చెబుతోంది..

యూజర్లు చేయాల్సిందిల్లా.. తమ స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ ను అప్ గ్రేడ్ చేసుకోవడమే.. స్మార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ ను కూడా తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన సూచనలతో అలర్ట్ చేస్తోంది వాట్సాప్. 

Hackers
spy software
Whatsapp Users

మరిన్ని వార్తలు