తిరిగి ఇచ్చేశాడు : ఆలయానికి విరాళం ఇచ్చిన బిచ్చగాడు

Submitted on 10 June 2019
he is not a beggar, he is a donor

ఈ ప్ర‌పంచంలో క‌ష్ట‌మైన విష‌యాల్లో సంపాద‌న ఒక‌టి. అది డబ్బు కావ‌చ్చు, కీర్తి కావ‌చ్చు..వాటిని సంపాదించడం... సంపాదించిన దాన్ని ప‌దిమందికి పంచే సేవా దృక్ఫ‌ధం ఉన్న‌వారే శాశ్వ‌త ఐశ్చ‌ర్య‌వంతులుగా మిగిలిపోతారు. ఎంత ఇస్తే అంత తిరిగి వ‌స్తుందన్న ప్ర‌కృతి సూత్రాన్ని అవ‌గ‌తం చేసుకుని ఆచ‌ర‌ణ‌లో పెడితే అత్యద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. డ‌బ్బు సంపాద‌నే ప్ర‌ధాన వ్యాప‌కంగా చేసుకున్న నేటి స‌మాజంలో తిరిగి ఇవ్వ‌డం అన్న‌ది ప‌రిమితంగానే క‌నిపిస్తోంది.
Also Read : ఆ ఆరుగురు దోషులు : కథువా చిన్నారి రేప్, మర్డర్ కేసులో కోర్టు తీర్పు

బిల్ గేట్స్ , మార్క్ జుకెర్ బ‌ర్గ్ వంటి అప‌ర కుబేరులు స‌మాజ సేవ కోసం ఎన్నో మిలియ‌న్ డాల‌ర్ల‌ను వెచ్చిస్తున్నారు. వీళ్ళందరూ కష్టపడి, వ్యాపారం చేసి సంపాదించిన డబ్బును సమాజసేవ కోసం ఉపయోగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా  చీపురు పల్లిలో  ఒక యాచకుడు తాను యాచించగా వచ్చిన సొమ్మును దాచి పెట్టి దేవాలయాల్లో భక్తుల వసతి కోసం విరాళంగా ఇస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నాడు. గత రెండేళ్లలో 3లక్షల 35 వేల రూపాయలు ఇలా విరాళంగా అంద చేశాడు.

 శ్రీకాకుళం జిల్లా  రేగిడి ఆముదాలవలస మండలం  ఒప్పంగి గ్రామానికి చెందిన  చేబోలు కామరాజు 60 ఏళ్ళ కిందట  వ్యాపారం నిమిత్తం చీపురు పల్లి వచ్చి అక్కడే ఉండిపోయాడు. కొన్నేళ్ళ కిందట  రెండు కాళ్లూ చచ్చుబడిపోవటంతో  ఏ దిక్కూలేక పోవటంతో ,నీలకంఠేశ్వరస్వామి ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు.  ఆయన యాచన ద్వారా వచ్చిన ధనాన్ని కూడబెట్టి రూ.3.05లక్షల రూపాయలను రెండు విడతలుగా  నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి విరాళంగా అందచేశాడు. ఇటీవల  చీపుర పల్లి శివారు లోని రావివలస వద్ద ఏర్పాటు చేసిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తుల సౌకర్యంకోసంషెడ్డు నిర్మాణానికి మరో రూ.30 వేల ను విరాళంగా అందచేశాడు. 
Also Read : కస్టమర్ కు కట్టండి : సోనీ టీవీ కంపెనీకి రూ.3లక్షల జరిమానా

Andhra Pradesh
Srikakulam
beggar
charity
Donation

మరిన్ని వార్తలు