అమెజాన్.. ఈ గ్వారానా పండు తింటే.. కేన్సర్ దరి చేరదు!

Submitted on 1 July 2019
Health Benefits of Guarana Fruit

గ్వారానా పండు అంటే ఏంటో తెలుసా మీకు..? ఎవరికి తెలిసుండదు. ఈ పండ్లు చూడటానికి అచ్చం మనిషి కళ్ల లాగానే ఉంటాయి. అసలు ఇలాంటి పండ్లు కూడా ఉన్నాయంటే నమ్మడం కొంచెం కష్టం కానీ.. నమ్మక తప్పదు. ఈ పండ్లు దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో పాకుతూ వెళ్లే గ్వారానా మొక్కలకు కాస్తాయి. వీటితో టానిక్‌లు, ట్యాబ్లెట్లూ తయారు చేస్తారు. 

మనం ఈ పండ్లను కొందామన్నా దొరకవు.  ఎందుకంటే ఇవి మామూలు పండ్లు కావు. వీటికి చాలా ఔషధ గుణాలున్నాయి. ఎంతో ఎనర్జీ ఇస్తాయి కూడా. కేన్సర్‌తో పోరాడతాయి. అధిక బరువు తగ్గిస్తాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

గ్వారానా వల్ల ప్రయోజనాలు:
> ఈ పండ్లలో తలనొప్పి, ఫీవర్, కాలిన గాయాల్ని నయం చేయగల అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. 
> ఈ పండు కాస్త పుల్లగా ఉంటుంది. దీని నుంచి గ్వారానా పౌడర్ తయారు చేస్తారు. ఈ పౌడర్‌ను నీటిలో కలిపి తాగితే... ఎక్కువ కాలం జీవిస్తామని అమెజాన్ ప్రజలు నమ్ముతారు.
>  కాఫీ గింజల్లో ఉండే కెఫైన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కెఫైన్ గ్వారానా బెర్రీస్‌లో ఉంటుంది.
> ఈ పండ్ల ఉత్పత్తిలో... 70 శాతాన్ని ఎనర్జీ డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తున్నారు. మిగతా 30 శాతం కాస్మొటిక్స్ లో వాడుతున్నారు. 
> మన ఎముకలు బలంగా ఉండేందుకు ఈ పండులోని పోషకాలు మేలు చేస్తాయి.
> మతిమరపుతో ఇబ్బంది పడేవారికి దివ్య ఫలంలా పనిచేస్తోంది గ్వారానా. దీనితో తయారుచేసిన మందులను వాడే వారికి జ్ఞాపక శక్తి పెరుగుతోందని పరిశోధనల్లో తేలింది.  
> అంతేకాదు కేన్సర్ తగ్గంచడానికి అద్భుతమైన ఔషదాలు గ్వారానాలో ఉన్నాయని తేలింది. ఈ పండ్లలోని  బీ1, బీ2, బీ3, బీ4, ఏ2, సీ1 వంటి పోషకాలు... కేన్సర్ వ్యాధిని తరిమికొట్టగలవు. 

Health Benefits
Guarana Fruit
2019

మరిన్ని వార్తలు