ఎర్ర క్యాప్సికం తో ఎన్నో ఉపయోగాలు

Submitted on 8 June 2019
Health Tips: Many Uses With Red Capsicum

నిగనిగలాడుతూ చూడగానే పండేమోననిపించే ఎర్ర క్యాప్సికంలో 30 రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయట.. ఇవి విశృంఖల కణాలతో పోరాడుతూ క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి.  ఇందులో విటమిన్‌- A దండిగా ఉండటం వల్ల ఎర్ర క్యాప్సికంతో కంటి చూపు సైతం మెరగవుతుంది. ఇది మిరపకాయలు, మిరియాల మాదిరిగా కారంతో మంట పుట్టించకుండానే మన జీవక్రియల వేగం పుంజుకునేలా చేస్తుంది. 

రక్తహీనతతో బాధపడేవారికీ ఇదెంతో మేలు చేస్తుంది. దీనిలోని విటమిన్‌ - C ఉంటుంది. ఇది రోజూ తింటుంటే శరీరం మనం తిన్న ఆహారం నుంచి ఐరన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇక మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవ్వాలంటే అందుకు విటమిన్‌- B6 చాలా అవసరం. అందుకే ఆహారంలో ఎర్ర క్యాప్సికం ను కూడా అప్పుడప్పుడు తీసుకోండి. 

health tips
Many Uses
Red Capsicum
2019

మరిన్ని వార్తలు