న‌డుము నొప్పిని త‌గ్గించే ప‌వ‌ర్‌ఫుల్‌ చిట్కాలు!

Submitted on 8 June 2019
Health Tips To Reduce Back Pain

ఈ రోజుల్లో న‌డుము నొప్పి వ‌చ్చిందంటే చాలు. పెయిన్ కిల్ల‌ర్స్‌, నొప్పి నివారణ మందులు వాడ‌డం మరీ ఎక్కువైపోయింది. నడుము నొప్పి రాకుండా నివారించాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయడమే పరిష్కారం.  సాధారణంగా వయసు పెరగడం కారణంగా డిస్కు అరిగిపోవడం కనిపిస్తుంది. ఎక్కువ సేపు కూర్చున్నా, నిల్చున్నా నొప్పి ఎక్కువ అవుతుంది. డిస్కు అరుగుతున్నకొద్దీ సమస్య తీవ్రం అవుతుంది. నడుము నొప్పికి నడక మంచి ఫలితాన్నిస్తుంది. ఆఫీసుల్లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవాళ్లలో, బరువు ఎక్కువగా ఉండేవాళ్లలో నడుము నొప్పి ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఇలాంటి వాళ్లు నడుము నొప్పి రాకుండా ముందు జాగ్రత్తపడాలి అంటున్నారు డాక్టర్లు.  

ఎక్కువ మందిలో కనిపించేదీ వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుమునొప్పి... ఈ నొప్పిని అలక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరం, వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి నడుము నొప్పి సమస్యలకు ఏ యే చికిత్సలున్నాయో, అది రాకుండా ఎలా జాగ్రత్తపడాలో తెలుసా..? 

* నివారణ ఏమిటీ....? 
నడుము నొప్పికి వ్యాయామాలు చేయడం ఉత్తమం. కటిక నేలపై వెల్లకిలా పడుకుని శరీరానికి విశ్రాంతినిస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీటన్నింటికంటే యోగాసనాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో ప్రత్యేకించి మకరాసనం, సర్పాసనం, భుజంగాసనం, వజ్రాసనం, చక్రాసనం, శలాభాసనాలు నడుం నొప్పి నివారణకు సూపర్ గా పనిచేస్తాయి. నడుము నొప్పి తీవ్రంగా వున్నప్పుడు ఆసనాల జోలికి వెళితే ప్రమాదం. మొదట నొప్పి తగ్గించుకోవడానికి కాస్త వేడినీళ్ళ కాపడం, చమురు మర్ధనా జరపాలి. తరువాతనే యోగాసనాలకు వెళ్ళాల్సి ఉంటుంది. మరో విషయమేమిటంటే యోగాలో ఆసనాలు వయసునుబట్టి ఆధారపడి ఉంటాయి. ఆసనాలు వేసే సమయంలో యోగా నిపుణులను సంప్రదించి ఆసనాన్ని ఎన్నుకోవాలి. 

health tips
Reduce Back Pain
2019

మరిన్ని వార్తలు