హెల్త్

చర్మం మరీ పొడిబారీ ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా ఆలివ్‌ నూనెను రాయడం మంచిది. ఇది చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి పోషణనందిస్తుంది. ఫలితంగా చాలా తక్కువ సమయంలోనే చర్మంలో మార్పు కనిపిస్తుంది. దాంతోపాటు అలివ్‌ నూనె ఉన్న సబ్బుల్ని వాడటం వల్ల కూడా పీహెచ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగించాలంటే ఆలివ్‌ నూనెలో కొద్దిగా చక్కెర వేసి రాసుకుని మర్ధన చేసుకోవాలి....

అవును మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరియైన ఆహారం తీసుకోవాలి. దానితో పాటు కొంత వ్యాయామాలు చేస్తూ అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. అయితే కొంతమంది అధిక పని చేస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. నిద్ర కూడా సరిగ్గా పోరు. ఇలాంటి వారికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో విటమిన్ 'సి' ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. నారింజ,...

పౌష్ఠికాహారం కోసం మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. అలాగని మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. ఒక పరిమితిలో వీటిని తీసుకోవచ్చు. అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తుందనుకోవడం సరికాదు. శాఖాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషక పదార్థాలన్నీ...

గోరింటాకు...మహిళలు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఏ ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టాల్సిందే. ఆషాడం వచ్చిందంటే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని ఉండడమే కాకుండా ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో శరీరంలోని వేడి, బయట...

సాధారణంగా చలికాలంలో చర్మంతో పాటు పెదాల ఆరోగ్యానికి కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అందుకే మహిళలు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అందమైన అధరాల కోసం.. ఈ చిట్కాలు పాటించడం వల్ల పెదాల ఆరోగ్యంతోపాటు అందాన్నీ కాపాడుకోవచ్చు.అవేంటో చూద్దాం...
కొద్దిగా తేనెలో రోజ్‌వాటర్‌ లేదా నానబెట్టిన గులాబీ రెబ్బల పేస్టు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని రోజుకి...

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో...

వాతావరణం మారిపోయింది. వానలు కురుస్తున్నాయి. అంతలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ప్రస్తుత పరిణామంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో అనారోగ్యానికి గురవుతాం.
ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి.
బాదం...

ముఖం అందంగా కనిపించాలంటే జుట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంటుంది. కానీ ఈ జుట్టు వల్ల ఎంతోమంది వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. అందులో తెల్ల జుట్టు. తెల్లజుట్టును నల్లగా మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల కాస్మోటిక్స్..సౌందర్య సాధనాలను వాడుతుంటారు. ఎర్రగా..నల్లగా..ఇలా వివిధ రకాల కలర్స్ లో కనిపించాలని జుట్టుకు కలర్స్ వేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల సమస్యలు...

కొందరి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీని వల్ల అలర్జీ లాంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఇంట్లో దుమ్ము, ధూళి కొంచెం ఉన్నా కళ్లలో నీళ్లు కారడం, ముఖం ఎర్రబడటం, ఉదయం లేవగానే ముఖం ఉబ్బినట్లు అవుతూ ఉంటుంది. దీని వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు అవి ఏయే సమయాల్లో వస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బెడ్‌షీట్లూ, తలగడలను వారానికొకసారి వేడినీళ్లలో...

చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చడంలో ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలు ఎన్నో. వాటిలో కుంకుమ పువ్వు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో చర్మానికి కావలసిన పోషక విలువలు ఎంతో పుష్కలంగా వున్నాయి. ఈ పోషకాలు నేరుగా చర్మం మీద ప్రభావం చూపి చర్మం మెరిసేలా చేస్తాయి. కుంకుమ పువ్వు ద్వారా ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్‌ పొందవచ్చు. ఇది చర్మ సమస్యలతో పాటు పెదవులు, గోళ్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం...

ఇంటిలో వాతావరణం ఎంత మంచిగా ఉంటుందో కుటుంసభ్యులు ఆహ్లాదంగా..ఆరోగ్యకరంగా ఉంటారు. కళకళలాడే ఇళ్లు కంటికి ఇంపునే కాదు..ఒంటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇంటి చుట్టూ చెట్లు ఉంటే ఇంటికి అందాన్ని తెస్తాయి. ఇంట్లో చెట్లు ఉండడం వల్ల కొన్ని లాభాలు..
ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.
ఇంటి చుట్టూ పూల మొక్కలు, తీగ మొక్కలు పెట్టుకోవడం వల్ల...

కోడిగుడ్డు..రోజుకు ఒకసారి తినండి..ఆరోగ్యంగా ఉండండి అంటూ టీవీల్లో...ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు వస్తుంటాయి. కోడిగుడ్డు బలవర్ధకమైన ఆహారం కావడంతో పలువురు వీటిని తినడానికి ఆశక్తి చూపుతుంటారు. కానీ ఈ కోడి గుడ్లు మంచివేనా ? అనే సందేహం మాత్రం రాదు.
ఈస్ట్రోజన్ తో తయారైన ఎగ్స్ తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి.
కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా త‌క్కువ‌గా...

ఉలవలు నవధాన్యాలలో ఒకటి. ఉలవలు ఎక్కువగా తీసుకున్నవారి ఆరోగ్యం గుర్రంలా దౌడు తీస్తుందనే నానుండి ఉంది.  ఉలవలకు ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యతే ఉంది. జ్వరం, జలుబు, గ్యాస్ట్రిక్, పెప్టిక్ అల్సర్లు, కాలేయ, మూత్రపిండ సమస్యలను తగ్గిస్తుందని ఆయుర్వేద నిలుపు తెలిపారు. ప్రత్యేకంగా మహిళల్లో వచ్చే నెలసరి సమస్యకు, అధిక చెమటకు చక్కటి పరిష్కారం వీటితో సాధ్యం అని పేర్కొన్నారు. వందగ్రాముల...

సూర్యకిరణాలు చర్మానికి డైరెక్ట్ గా తాకడం వల్ల.. చర్మంలో ఉండే మెలానిన్‌లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మెలానిన్‌ శాతం తగ్గినప్పుడు ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఈ కింది చిట్కాలను పాటిస్తే మచ్చలు పోవడమే కాదు.. చర్మం కొత్త మెరుపును సంతరించు కుంటుంది.
అర స్పూన్‌ నిమ్మరసానికి కాస్తంత గ్లిజరిన్‌ జోడించి ఆ మిశ్రమాన్ని నల్లమచ్చలున్న ప్రాంతంలో రాస్తే తొందర్లోనే వాటి బాధ...

ఆధునిక జీవన విధానం గుండె మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో శరీర భాగాల్లో అన్నింటికన్నా వేగంగా పాడవుతున్న భాగం గుండె. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లు, ఇతర అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజూ 45 నుంచి 60 నిమిషాలు నడకకు కేటాయించాలి. నడిచేటపుడు కాస్త వేగాన్ని పెంచి నడిస్తే మంచిది...

ప్రతిరోజు అలంకరించుకునే వాటిలో శిరోజాలు కూడా ముఖ్యమైనవి. శిరోజాలను బట్టి మన ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు చిన్నతనంలో జట్టు తెల్లబడుతుంది. అందుకే మనం తీసుకునే ఆహారంతో పాటు కొన్ని సహజ ఉత్పత్తులతో చిట్కాలను కూడా పాటిస్తే పట్టులాంటి కురులు సొంతమవుతాయి.
ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా...

వర్షాకాలంలో బీరకాయ విరివిగా దొరుకుతుంది. కొంతమంది బీరకాయను తినాలంటే ఇష్టపడరు. కానీ ఇందులో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
బీరకాయ తినడం వల్ల సులువుగా జీర్ణమవుతుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధ పడేవారికి చక్కని ఔషధంలా పనిచేస్తుంది.
కొవ్వు...

ఒత్తిడికి గురైనప్పుడు మొదట జరిగేది శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం. శ్వాసక్రియలు సక్రమంగా జరగకపోతే గుండెకు హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు శ్వాస వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమం. అప్పుడు ఒత్తిడిని అధిగమించవచ్చు. అంటే ఆక్సిజన్‌ను లోపలకు తీసుకోవడం వల్ల ఒత్తిడి ప్రభావం తగ్గి రిలాక్స్‌గా అనిపిస్తుంది.
కుర్చీలో కానీ, నేలమీద కానీ మీ శరీరానికి అనువుగా...

మంచి ఆరోగ్యానికి చిట్కాలు..చూడండి…

  • రోజుకు ఒక నిమ్మకాయ రసం తాగడం వల్ల శరీరంలో కొవ్వును తీసేస్తుంది.
  • రోజుకు ఒక తులసి ఆకు తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
  • ప్రతి రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదు.
  • రోజు ఒక కప్పు పాలు తాగితే ఎముకలు ధృడంగా ఉంటాయి.
  • రోజులో మూడు లీటర్ల నీరు తాగాలి. దీనివల్ల రోగాలు...

అధిక బరువుతో బాధ పడుతున్నారా? ఉదయం పూట వ్యాయామాలు ఏమి చేస్తాంలే... అని చిరాకు పడుతున్నారా? డైటింగ్‌ చేద్దామనే ఆలోచనలో పడ్డారా? తిండితిప్పలు మానేసి రోగిష్టి బతుకు బతుకుతూ క్యాలరీలు, విటమిన్లు మీ చేతులారా వది లేసుకుంటున్నారా? అయితే, సులువైన పద్ధతులను పాటించి బలంగా, ఆరోగ్యంగా, నిత్య యవ్వనంగా, నవ్వుతూ జీవితాన్ని సాఫీగా కొనసాగించండి. అయితే దీనికి చిన్న చిట్కా వైద్యం మీకు...

పంటి నొప్పి..ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ఏది తిననివ్వదు..కనీసం కాఫీ..టీ..జ్యూస్ తాగాలంటే ఎంతో బాధ పడుతుంటుంటారు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. అందర్నీ తరచూ ఇబ్బంది పెడుతుంటుంది. ఈ పంటి నొప్పి వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పంటినొప్పిని తొందరగా మాయం చేసే సింపుల్ హోమ్ టిప్స్..
పచ్చి ఉల్లిపాయ తీసుకుని కొన్ని నిమిషాటు నమలండి. ఇలా చేయడం వల్ల...

ఎండకాలం వచ్చిందంటే చెమట పట్టి చికాకుగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరుగులు తీసే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. వేడి తీవ్రత ఒక వైపు.. చెమట వాసన మరోవైపు ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు చర్మసమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం కలగాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి.

  • చాలామంది ఎండాకాలం కాబట్టి చల్లనీళ్లతో స్నానం చేస్తుంటారు. ఇది చర్మానికి...

ఎముకలు శరీరానికి ఆధారం. అలాంటి ఎముకలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవాలంటే కాల్షియం గల ఆహారాల్ని అధికంగా తీసుకోవాలి. శరీరంలో కాల్షియంతో పాటు విటమిన్‌- డి తగ్గిపోవటం, థైరాయిడ్‌ గ్రంథి క్రియలో అతిగా స్పందించడం, మధుమేహం బారిన పడినవారు, వయసుమీరిన వారికి ఎముకల్లో సమస్యలు ఏర్పడుతుంటాయి. అందుచేత ఎముకలు బలంగా ఉండాలంటే.. రోజూ ఉదయం, రాత్రి పావు టీ స్పూన్‌ దాల్చిన చెక్కను మెత్తని...

చలి.. రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో పిల్లలకు, పెద్దలకు చర్మం పొడిబారడం, తెల్లగీతలు ఏర్పరడం లాంటివి ఏర్పడతాయి. ఈ చలిపులి నుంచి చర్మాన్ని ఇలా రక్షించుకుందాం. పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజు స్నానం చేసే ముందు ఒంటికి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి. స్నానానికి వాడే సబ్బులో గాఢత ఎక్కువ ఉన్న రసాయనాలు ఉండడం వల్ల అది చర్మాన్ని మరింత పాడుచేస్తుంది. అందుకే రెగ్యులర్‌ సబ్బును కాకుండా...

జుట్టుని ఆరోగ్యంగా ఎదిగేలా చేయడంతో పాటూ తగిన పోషణనందించే హెన్నాతో మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. గోరింటాకు వెంట్రుకలకు సహజమైన నలుపుదనాన్ని అందిస్తుంది. రెండు కప్పుల గోరింటాకు పొడిలో అరకప్పు ఉసిరి పొడి, రెండు చెంచాల శీకాయ పొడి, ఒక గుడ్డులోని తెల్లసొన, రెండు చెంచాల నిమ్మరసం, చెంచా చొప్పున తులసి, మందార రేకల పొడీ కలిపి... మరిగించిన టీ డికాక్షన్‌ నీళ్లలో ముందురోజు నానబెట్టాలి....

వర్షాకాలం మొదలైంది. ఈ కాలంలో అనారోగ్యాలు విజృంభిస్తాయి. వర్షంలో తడిసిన తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పలు అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. చర్మం మీద, వెంట్రుకల మొదట ప్రభావం చూపుతుంది. ఈ రెండింటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా వెంట్రుకల గురించి శ్రద్ధ తీసుకోవాలి.
తలతడిగా ఉన్నప్పుడు చుండ్రు అధికమవుతుంది. పేలూపడతాయి. చుండ్రు వల్ల మొటిమలూ తప్పవు....

బియ్యం పిండితో వంటలతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ పిండిని శరీరానికి అప్లై చేయడం ద్వారా లాభాలు కలుగుతాయి. పాతకాలంలో చర్మ రక్షణకు దీనినే ఎక్కువగా వాడేవారంట. ఇది చర్మంపై ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి దీనిని ఎలా వాడాలి ?
బియ్యం పిండి..ఓట్ మీట్..పాల పొడి మిశ్రమాలను కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో స్కిన్ టోన్ చాలా అందంగా బ్రైట్ గా మారుతుంది.
బాగా పండిన అరటి...

పొద్దున్నే కాసేపు వ్యాయామం చేస్తూ, తక్కువగా తింటుంటే... సన్నబడటం సులువు అంటారు. కానీ ఇంటి పనులు, ఆఫీసు బాధ్యతలతో తీసుకునే ఆహారం విషయం లో కచ్చితమైన ప్రణాళికను పాటించడం అంత సులువు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్యాలరీలు పెరగకుండా చూసు కోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

  • దాహంగా అనిపించినప్పుడు ఆకలి వేస్తోందని భ్రమపడి ఏదో ఒకటి తినడం చాలా మందికి...

పిల్లలు..రుచికరం..ఆకర్షణీయంగా కనిపించే కూల్ డ్రింక్స్ అంటే మక్కువ పారేసుకుంటారు..అది కొనియి..ఇది కొనియి అంటూ మారం చేస్తుంటారు. మరి వారికి ఏ డ్రింక్స్ అవసరమో..వారికి ఆరోగ్యం కలిగించే డ్రింక్స్ ఏంటో కొందరికి తెలియదు. దీనితో పిల్లలకు తరచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఇందుకు కొన్ని టిప్స్ చదవండి..
పిల్లల ఆరోగ్యానికి యాంటీఆక్సిడెంట్స్‌, పొటాషియం, ఎలకో్ట్రలైట్స్‌ అవసరం....

మహిళలకు పాతికేళ్లు దాటాయా...అయితే హెల్త్‌ టెస్ట్‌ తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాతిక సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవారు ఆరోగ్యపరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. అందులో ఒక పరీక్ష కంటి భాగానికి సంబంధించినది. దానితో పాటు స్తనాలు, మూత్ర, షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలి. అప్పటి నుండి రెండు మూడు సంవత్సరాల కొకసారి పరీక్షలు చేయించుకోవడం మంచిది. 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదలు...

మహిళలు 30 దాటినా తమ శరీరాన్ని నాజుగ్గా ఉంచుకోవాలనుకుంటారు. అయినా కొందరు ఒబిసిటీ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి మహిళలు దీర్ఘకాలం పాటు నాజూగ్గా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. సాధారణంగా మనం తీసుకునే ఆహారాన్నిబట్టే మన ఆరోగ్యం ఉంటుంది. కొవ్వు కేలరీలు తక్కువగా ఉండి ఖనిజాలు, విటమిన్లు, పీచు పదార్థాలు అత్యధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి....

కాలిఫ్లవర్, బంగాళదుంప, ఉల్లిలకు ఉదర క్యాన్సర్లను రాకుండా అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లు చైనాలోని జిజియాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. అయితే బీర్, మద్యం, ఉప్పు, నిల్వ చేసిన ఆహారపదార్థాల వల్ల క్యాన్సర్ కారకాలు పెరిగే ప్రమాదం ఉందని అద్యయనం చెప్పింది.

బ్రిటన్ లో ప్రతిరోజు ఉదరక్యాన్సర్ తో పదిహేను మంది మరణిస్తున్నారు. బాధితుల్లో పదిహేను శాతం మంది పదేళ్ల కంటే ఎక్కువ...

రోజు వారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువ, పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. మనం రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో ఏయే పదార్థాల్లో పొటాషియం పరిమాణం సమృద్ధిగా ఉంటుందో చెక్‌ చేసుకోవాలి.
ఎందుకంటే.. గుండెజబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గించుకోవాలంటే.. పొటాషియం ఎక్కువగా తీసుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ఉప్పును...

మనలో ప్రతీ ఒక్కరం ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. నిత్యం ఆరోగ్యంగా మెలగాలంటే.. రోజూ జాగింగ్‌ చేస్తే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జాగింగ్‌ చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు చెమట రూపంలో బయటకు విసర్జన చేయబడుతుందని.. తద్వారా గుండె ఆరోగ్యంగా వుంటుందని చెబుతున్నారు. జాగింగ్‌ చేయడం వల్ల గుండెపై భారం పడుతుంది. దీనివల్ల గుండె మరింత...

'చూస్తుండగానే వయసు పెరిగిపోతుంది' అంటారు చాలామంది. అయితే నాలుగు పదుల వయసు దాటిన వారు రోజూ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇప్పటిదాకా ఏం తిన్నా, ఎలా తిన్నా, ఇకనుండి ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఆహారంలో పోషక విలువలు, విటమిన్స్‌ సమృద్ధిగా ఉండేలా చూసుకోవడం మరీ మంచిది.
ఆరోగ్యకరమైన ఆహారం అంటే ముందుగా గుర్తుకొచ్చేవి పండ్లు....

వేకువ జామునే నిద్రలేస్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటామని అందిరికీ తెలిసిన విషయమే. కానీ అలా నిద్ర లేవడం అంటే చాలా కష్టమైన పనిగా భావిస్తారు చాలామంది. నిద్ర నుండి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి సమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటాం కానీ, ఉదయం మాత్రం లేవలేం బాబూ అనేవారూ ఉంటుంటారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంత మైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.

    ...

ప్రస్తుత పరిస్థితుల్లో ఆడవాళ్లు, మగ వాళ్లు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం ఎక్కువమందితో ఉంటే గొడవలు, మనస్పర్ధలు రావడం. అయితే తాజాగా ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే.. ఒంటరిగా ఉండే వాళ్లు హెల్త్ కేర్ ఎక్కువగా తీసుకోరని, ఎందుకంటే మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ఒంటరిగా ఉండేవాళ్లు వెనకాడుతారు. కూరగాయలు, మాంసం, చేపలు వంటివి కొనడానికి కూడా...

లడ్డూ, పాయసం, బర్ఫీ ఎలాంటి స్వీట్‌ కైనా మంచి సువాసనను, రుచిని అందిస్తాయి యాలకులు. ఏ తీపిపదార్థానికైనా.. కాసిన్ని యాలకులు జోడిస్తేనే అమోఘమైన రుచి వస్తుంది. తీపి వంటకాల్లో సుగంధ ద్రవ్యంగా వాడే యాలకుల్లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్‌ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్‌ రాకుండా నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత యాలక్కాయ...

ప్రస్తుత కాలంలో యువతులు ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా హైహీల్స్‌ ధరించేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కాస్తంత ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు అయితే.. హైహీల్సే వేసేందుకే ఇష్టపడుతారు. అయితే, హైహీల్స్‌ ధరించడం వల్ల అందంగా కనిపించడం కంటే.. అనారోగ్య సమస్యల బారిన పడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
హైహీల్స్‌ వేసుకోవడం వల్ల కాళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. హీల్‌ సైజ్‌...

హైదరాబాద్ : మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా, దంత సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.. ఇక దురలవాట్లు ఉన్న వారికైతే ఈ సమస్య ఎక్కువ. ఈ సమస్యలకు అనేక రకాల చికిత్సా పద్ధతులున్నాయంటుమని 'మానవి హెల్త్ కేర్' కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ హరీష్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

 

ఈ రోజుల్లో చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా అందరూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యమైనది జుట్టు రాలడం. ఇది కేవలం వాతావరణ కాలుష్యం వలన మాత్రమే రాదు. శారీరక, మానసిక సమస్యలు వచ్చినా కూడా జుట్టు రాలిపోతుంది. అది తగ్గాలంటే..ప్రతి రోజూ అల్లం టీ క్రమం తప్పకుండా తాగితే మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
కొందరి బుగ్గలు లోపలికి...

వైద్యరంగంలో వస్తున్న అధునాతన పద్ధతులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు నగరంలోనూ అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల చిన్నవయసులోనే ఎంతోమంది గుండెజబ్బుల బారిన పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించే వైద్యవిధానంలో ఒకటి క్రాస్‌బాస్‌ వైద్యవిధానం. అమెరికా వైద్యులు కనుగొన్న ఈ వైద్యవిధానం ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది...

మీ పాదాలు అందంగా ఆకర్షణీయంగా ఉండాలా? అయితే ఈ చిట్కాలు పాటించండి. వారానికి ఒక్కసారి శుభ్రంగా పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌ క్రిము లేదా రెండు చెంచాలా ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిన్‌ బాగా కలిపి చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో హెర్బల్‌ షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా...

అక్రోట్స్‌ (వాల్నట్‌ ) సాధారణంగా అందరికి తెలిసిన ఎండిన పండ్లు. పోషక విలువలు అధికంగా కలిగిన డ్రైఫ్రూట్‌. వీటితో తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను నివారించవచ్చని ఇటీవల జరిగిన పరిశోధనల్లో స్పష్టమైంది. కాస్త ఎక్కువ ధర ఉన్నప్పటికీ అనారోగ్యం వచ్చిన తర్వాత వాడే మందులతో పోల్చితే తక్కువే. ఎన్నో పోషకాలున్న అక్రోట్స్‌ తో కలిగే ప్రయోజనాలు..

- రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రించడంలో...

మెనోపాజ్‌ దశలో స్త్రీలు శారీరక సమస్యలతోపాటు మానసిక ఆందోళనకు గురవుతుంటారు. వీటన్నింటికి చెక్‌ పెట్టాలంటే... సోయా ఉన్న ఫుడ్‌ తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు. లండన్‌లోని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో నవంబర్‌ 1న జరిగిన ఎండోక్రైనాలజీ యాన్యువల్‌ మీట్‌లో ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవి ఎముకలు బలహీనపడకుండా చూస్తాయని తేల్చి చెప్పింది. ఫైబర్‌, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండి......

ఔషధాలకు నయం కాని ఆరోగ్య సమస్యలకు శస్త్రచికిత్సలు తప్పనిసరి అసవరం అవుతున్నాయి. శస్త్రచికిత్సల ద్వారా దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తున్నారు. ఆధునిక వైద్యవిధానం అందుబాటులోకి రావడంతో అటు సర్జన్స్ కు, ఇటు రోగులకు సౌలభ్యమైన సర్జరీ పద్ధతులు ఎన్నో వచ్చాయి. పెద్దపెద్ద అనారోగ్య సమస్యలకు కూడా చిన్న శస్త్రచికిత్సలతో వైద్యం అందిస్తున్నారు. తక్కువ కోతల శస్త్రచికిత్సలు ఇప్పుడు ఎంతో...

శీతాకాలంలో తేలికగా జీర్ణమయ్యే అహారాన్ని తీసుకోవాలని డైటీషియన్లు అంటున్నారు. ఈ సమయంలో సూప్స్ కి మించిన మంచి ఆహారం మరొకటి ఉండదు. సూప్‌లు జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం లేదు. అంతేకాదు, ఇవి శరీరం ఇన్‌ ఫెక్షన్లతో పోరాడటానికి ఎంతో సహాయం చేస్తాయి. ఈ చల్లటి వాతావరణంలో శరీరానికి తగిన వేడి అందుతుంది. ఒక బౌల్‌ సూప్‌ తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లవవుతుంది. దీన్ని తాగడానికి...

రోజులో మంచినీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. ఇది అందరికీ తెలిసిందే. అయితే రాత్రి సమయాల్లోనూ మంచినీళ్ళు తాగడం కూడా చాలా మంచిదంటున్నారు వైద్యులు. రాత్రి పూట చాలా మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు కడుపునిండా మంచినీళ్ళు తాగితే సులభంగా నిద్రపడుతుంది. అంతకు ముందు తీసుకున్న ఆహారంలో నూనె పదార్థాలు, జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో నీళ్ళశాతం తక్కువై, దాహార్తి...

లావుగా వున్నవాళ్లు తమ శరీర బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి మందుల ద్వారా తమ బరువను కంట్రోల్ చేసుకోవడానికి సిద్ధపడతారు. అయితే.. వాటివల్ల ప్రమాదం వుండవచ్చు. సాధారణంగానే శరీర బరువు తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే చాలని, రెగ్యులర్ గా చేస్తే బరువు తగ్గవచ్చునని చెబుతున్నారు....

Pages

Don't Miss