హెల్త్

మహిళల్లో నిద్రలేమితో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు ప్రస్తుతం పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ప్రసవం తర్వాత వారంలో రెండు, మూడు రోజులు నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇక ఉద్యోగాలు చేసే మహిళలు... సగటున పనిదినాల్లో రోజూ ఏడుగంటల ఇరవై నిమిషాల పాటు, సెలవు దినాలలో ఎనిమిది గంటల ఇరవైనిమిషాల పాటు నిద్రపోతున్నారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో...

పక్షవాతం (బ్రెయిన్‌ స్ట్రోక్‌) ఉన్నట్టుండి మన జీవితాన్ని అంధకారంలోకి నెడుతుంది. అప్పటివరకు ఎంతో సంతోషంగా అటూఇటూ తిరిగిన వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతారు. కాళ్లూ, చేతులూ పడిపోయి వికలాంగుల్లా మారిపోతారు. పక్షవాతం బారిన పడినవారిలో కొందరు వికలాంగులై బతుకీడుస్తుంటే, మరికొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు పక్షవాతం బారిన పడితే ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. కానీ,...

రాత్రిపూట ద్రాక్ష పండ్లు తింటే హాయిగా నిద్రపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్, ఫ్లేవనాయిడ్స్ అధిక మొత్తంలో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాలకూరలో అధికంగా ఉండే పొటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి...

నేటి కాలుష్య వాతావరణంలో చర్మానికి రక్షణ చాలా అవసరం. దీనికోసం ఇంట్లో దొరికే వాటితోనే సహజసిద్దమైన ఫేస్‌ ఫ్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఒక బంగాళదుంపను ఉడికించుకుని ముక్కలుగా కోసుకోవాలి. ఒక చెంచా బంగాళాదుంప గుజ్జును అరచెంచా పెరుగుతో జత చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓట్స్‌,...

జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ సమస్యగా ప్రతి ఒక్కరికీ ఉంది.తలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కొన్ని బాక్టీరియా ఫంగస్‌ వల్ల, కాలుష్యం వల్ల చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు వల్ల తల్లో ఎక్కువగా దురద, తెల్లగా పొట్టుపొట్టుగా రాలుతుంటుంది. ఈ సమస్యను నివారించడానికి అలోవెరా సమర్థవంతంగా పనిచేస్తుందని డెర్మిటాలజిస్టులు అంటున్నారు.

  • కలబందలో ఉండే పెక్టిన్‌ అనే రసాయనం తలలో...

ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం సహజం. కానీ చాలా మంది మహిళలు ఆ సమయంలో ఎంతో కీలకమైన దంతాల విషయంలో మాత్రం కొంత అలసత్వం చూపుతుంటారు. దంత సమస్యలను తేలికగా తీసుకుంటుంటారు. అలాంటి స్థితి పుట్టబోయే బిడ్డ దంతాలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి ప్రెగ్నెన్సీ సమయంలో దంతాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో తెలుసుకుందాం. మరిన్ని...

శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారిపోయి అసహనానికి గురిచేస్తుంది. కాబట్టి చర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలామంది పార్లర్లనో, క్రీములనో అన్వేషిస్తుంటారు. అయితే ఎన్ని వాడినా చర్మం రసాయనాలకు అలవాటు పడి పాడైపోతుందే కానీ సహజసిధ్ధంగా ఉండదు. అందుకే శీతా కాలంలో చర్మ సౌందర్యానికి ఇంట్లో వాడే చిట్కాలను మీకందిస్తున్నాం. అవేంటో ఒకసారి చదవండి..

  • పొడిచర్మం కలిగినవారు చర్మాన్ని...

వాతావరణ కాలుష్యం, రకరకాల షాంపూల వాడకంతో చిన్నవారి నుండి పెద్దల వరకు అందరికీ తెల్ల జుట్టు సర్వసాధారణమైంది. దాంతో డై వేసుకోవడం తప్పని సరైపోయింది. చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. అయితే జుట్టుకు రంగు వేసుకునే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

  • జుట్టుకు రంగు...

తీపి పులుపూ కలగలిసిన ఎండు ద్రాక్షా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలను ఒకసారి చూద్దాం..

  • ఎండు ద్రాక్షల్ని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
  • శారీరక శ్రమ చేసే వారికీ, చిన్నారులకు ఎండు ద్రాక్షల్ని ఎంత తినిపిస్తే అంత మంచిది.
  • క్యాన్సర్‌ కారకాలతో పోరాడగలిగే గుణం వీటి...

చక్కని రుచిని అంతే చక్కని ఆరోగ్యాన్ని అందించే పెరుగుకి మరికొన్ని వంటింటి పదార్ధాలను జతచేస్తే మెరుపులీనే అందం మీసొంతమవుతుంది. అదెలాగంటే,అరకప్పు పెరుగులో చెంచా వేప పిండి, అర చెంచా నిమ్మరసం, చెంచా ఆలివ్‌ నూనె కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే వెంట్రుకలు పట్టుకుచ్చుల్లా తయారవడంతో పాటు చుండ్రు సమస్య అదుపులో ఉంటుంది.

  • పెరుగులో మెంతిగింజల్ని రాత్రి...

మీరు స్మార్ట్‌గా యాక్టివ్‌గా ఉండాలనుకుంటున్నారా? అయితే దానిమ్మ జ్యూస్‌ తాగండి అంటున్నారు వైద్య నిపుణులు. ఈ రసం తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీయాక్సిడెంట్స్‌ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తలనొప్పి తీవ్రంగా వేధిస్తోందా? కళ్ల దగ్గర దురదగా ఉందా? ముక్కు ఇరువైపులా ముట్టుకుంటే నొప్పిగా ఉందా? అయితే మీరు సైనసైటిస్‌తో బాధపడుతున్నట్టే. ముఖంలో కళ్ళ దగ్గర, ముక్కు పక్క భాగంల్లోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. ఈ భాగంలో ఇన్ఫెక్షన్ సోకి వాచి పోవడాన్ని సైనసైటిస్ (Sinusitis) అంటారు.

వాతావరణ మార్పులు జరిగినప్పుడల్లా...

అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. లేకపోతే ఏదో ఒక రూపంలో అనారోగ్యం బయటపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం తగ్గితే చాలా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జరిగే 300 రకాల రసాయనిక చర్యల్లో దీనిపాత్ర ఉంటుంది. గుండె కొట్టుకోవడం నుండి కండరాలు, హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం పాత్ర ఉంటుంది. మెగ్నీషియం తగ్గితే తలెత్తే సమస్యల్లో ముఖ్యమైనవి ఆకలి లేకపోవడం...

సాయంత్రం వేళ చల్లగాలులు గిలిగింతలు పెడుతుంటే వేడివేడి బఠాణీలు తింటూ.. శీతాకాలాన్ని ఎంజాయ్ చేయడం చాలా మందికి ఇష్టం. మనసుకు రిలాక్స్‌ ఇచ్చే ఈ అలవాటులో శాస్త్రీయ కారణాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే శీతాకాలంలో మందగించే జీర్ణక్రియను బఠాణీలు వేగవంతం చేస్తాయి. అందుకే బఠాణీలు తింటే మనసుకే కాదు.. శరీరానికి కూడా అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా మార్కెట్‌లోకి వచ్చే బఠాణీలలో...

ప్రతి ఇంట్లో ఉండే కలబంద ఎన్నో రకాల మేలు చేస్తుంది. అందానికే కాదు.. ఆరోగ్యానికి కలబంద ఉపయోగపడుతుంది. ఇది సన్‌స్క్రీన్‌ గానూ పనిచేస్తూ, స్కిన్‌ ఎలర్జీలను కూడా దూరం చేస్తుంది.

  • రోజ్‌ వాటర్‌, కలబంద రసం సమానంగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారిన చర్మంపై పూస్తే చర్మం కళకళ లాడుతుంది.
  • కలబంద రసంలో కాస్తా కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని మోచేతులు,...

టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన కాళ్ళకు శ్రమ తగ్గించి కంటికి శ్రమ పెంచుతున్నాయనటంలో నిజం లేకపోలేదు. గంటలతరబడి కంప్యూటర్‌ స్క్రీన్‌కి కళ్ళను అతికించి ఉద్యోగాలు చేస్తునవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిని కంటికి సంబంధించిన సమస్యలు త్వరగా చుట్టుముడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు....

మన శరీరానికి అవసరమయ్యే క్యాల్షియమ్‌, మాంగనీస్‌, కాపర్‌, మెగ్నీషియమ్‌ పోషకాలు ఖర్జూరంలో పుష్కలంగా లభిస్తాయి. పైగా పై పోషకాలు మనలో కండరాల, నరాల శక్తిని పెంపొందిస్తాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి కాపర్‌ చాలా అవసరం. ఎముకలకు మెగ్నీషియమ్‌ చాలా మేలు. అంతే కాదు ఖర్జూరం తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. మూత్రపిండాలలోని రాళ్లు కరిగేందుకు ఖర్జూరపండు తరచుగా తింటూ...

రెండు వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీ, పరుషులను ఒక్కటి చేసే బంధం వివాహం. అలా భిన్న నేపథ్యాలతో ఒక్కటయ్యే జంటలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. మరి ఆ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలనే అంశాలపై మానవి నిర్వహించిన నిర్భయ కార్యక్రమంలో సైక్రియాటిస్టు.. పూర్ణిమనాగరాజు పాల్గొని, మాట్లాడారు. భార్యాభర్తల రిలేషనషిప్ మధ్య వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి...

సీజనల్‌ వారీగా వచ్చే పూలు ఎన్నో ఉన్నా.. డిసెంబర్‌ పూలది ఓ ప్రత్యేకత. గట్టువెంట సహజంగా విరబూసే ఈ పూలు శీతాకాలంలో వలసవచ్చే చిన్నచిన్న పక్షులకు మకరందాన్ని అందిస్తాయి. ఊదారంగు, బంగారు వర్ణం, అరుదుగా తెలుపు, లేతగులాబీ వర్ణాలలో కనిపించే ఈ పూలు తెలియనివారు ఉండరు. నవంబర్‌ నెల చివరి నుంచే చిగురులు తొడిగి.. డిసెంబర్‌ నెల ప్రారంభం నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు విరబూస్తాయి. తక్కువ...

తినే ఆహారంలో టమాటా ఉపయోగిస్తాం. అయితే టమాటా ఆహారంగానే కాదు, చర్మసౌందర్యానికీ సహాయపడుతుంది. ఇందులో బోలెడు మేలు చేసే పోషకాలున్నాయి. జిడ్డు చర్మంతో బాధపడేవారికి టమాటాలు బాగా ఉపయోగపడతాయి. టమాటాని ముక్కలుగా కోసి, ముఖానికీ చేతులకీ రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకొని, బ్లాక్‌ హెడ్స్‌ తగ్గుతాయని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే ఖరీదైన...

రోజూ పెరట్లో కనిపించే తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు మొదలైనవాటిని నివారించేందుకు తులసి ఆకులు సహాయపడతాయి. రింగ్‌వార్మ్ లాంటి చర్మసంబంధ వ్యాధులకు తులసి ఆకుల రసం రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ల్యూకోడెర్లాలో ప్రకృతి...

అప్పుడే పుట్టిన పసిపాపకు మొదటి ఆహారం తల్లి పాలు. ఆ బిడ్డకు భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి తల్లి పాలు కాపాడతాయి. అంతే కాదు బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలకు కావల్సిన పోషకాలను పాలు అందిస్తాయి. అందుకే పుట్టిన ఆరు నెలల వరకు బిడ్డకు తల్లి పాల అవసరం గురించి ప్రతి డాక్టర్‌ వివరిస్తారు. ప్రతి మనిషి శరీరానికి అవసరమైన కనీస ప్రోటీన్లు, కొవ్వు పాల ద్వారా అందుతాయి....

ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ముఖ్యమైనవి. సెబాషియస్‌ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్‌) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్‌ ఎక్కువైనా బ్లాక్‌ హెడ్స్‌ సమస్య వస్తుంది. వాతావరణంలోని కాలుష్యం, దుమ్ముధూళి కూడా ఇందుకు కారణం అవుతాయి. బ్లాక్‌హెడ్స్ ను గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని...

నేటి పోటీ ప్రపంచంలో చిన్న పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కాలంతో పోటీ పడుతున్నారు. ఈ వేగంలో అనునిత్యం మానసిక ఆందోళనలు, ఒత్తిడికి గురవుతున్నారు. తద్వారా జ్ఞాపకశక్తి మందగిస్తోంది. విద్యార్థులు అయితే సబ్జెక్టుల మోతతో సతమతమైపోతున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే జ్ఞాపకశక్తి చాలా అవసరం. జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు బాదంపాలు ఎంతో ఉపకరిస్తాయని నిపుణులు...

మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. కాని అన్ని సీజన్‌లలో దొరికేపండు అరటి పండు. అందరిదకీ అందుబాటు ధరలో ఉంటుంది. చిన్నవారి నుండి పెద్ద వారికి నచ్చిన పండు. అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది. అరటిపండులో చాలా రకాలున్నాయి. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అరటిపండుతో...

శీతాకాలం వచ్చేసింది. ఈ చలికాలంలో ప్రధానంగా జలుబు సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇందుకు ఏవోవో మందులు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే సామాన్యంగా దొరికే చిన్న చిన్న వాటితోనే జలుబును తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు..

  • జలుబును తగ్గించడంలో తులసి చాలా బాగా పనిచేస్తుంది. గుప్పెడు తులసి ఆకులు, చిటికెడు రాళ్ల ఉప్పును కలపాలి. ఇది నమిలి మింగాలి. తులసి టీ తాగినా కూడా జలుబును తగ్గించుకోవచ్చు...

కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉండే నేరేడులో ఔషధాల విలువలు ఆపారంగా ఉన్నాయి. ఆకులు, గింజలు ఆరోగ్యానికి రక్షణ కల్పించేవి. దీన్ని కొన్ని పాంతాల్లో కాలాజామున్ గా పిలుస్తారు. చూడటానికి వంకాయరంగులో మిలమిలా మెరిసి పోతుంటాయి. వగరు వగరుగా ఉండడంతో కొందరు చిన్న పిల్లలు ఇష్టపడరు. నేరేడును ఆయుర్వేదంలో అపరసంజీవనిగా పేర్కొంటారు. చెక్కర వ్యాధి ఉన్న వారికి మామిడి తీపి చేదు చేస్తే నేరేడు వగరు...

చలికాలం ప్రారంభమైంది. 40 ఫారన్‌ హీట్‌ సెంటీగ్రేడ్‌ వేడి ఉండే నగరాల్లో సైతం ఈ కాలంలో ఉదయం, సాయంత్రాల్లో చలి ఎక్కువగా ఉండటం సహజం. శీతాకాలంలో చల్లని వాతావరణం అంటే అందరూ ఇష్టపడే అంశమే. అయితే చలి గిలిగింతలతో పాటు అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా చర్మ సంబంధిత సమస్యలూ వస్తుంటాయి. ముఖ్యంగా తల, మాడు, ముఖమూ, కాళ్ళూచేతులపై దురదలు వస్తుంటాయి. ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల్ని...

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దానిమ్మ పండ్లలో ఉన్నాయి. అయితే, దానిమ్మ తొక్కలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. దానిమ్మ తొక్కను సన్‌స్క్రీన్‌గా, మాయిశ్చరైజర్‌గా, ఫేషియల్‌స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో దానిమ్మతొక్కలో ఉండే ఏజెంట్స్ చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని కనుగొన్నారు. దానిమ్మ తొక్కను ఫౌడర్‌గా...

ఇంటి ముంగిట్లో, నాలుగు మొక్కలుంటే పచ్చగా కళకళ్లాడుతుంది. అదే అపార్ట్ మెంట్ అయితే కుండీల్లో ఒదిగిన మొక్కలు వచ్చిపోయే వారికి స్వాగతం పలుగకుతాయి. చిన్నమొక్కలే కదా అనుకుంటే పొరపాటే మనస్సు పెట్టి ఎంచుకుంటే అలంకరణకు ఉపయోగపడతాయి. ఆరోగ్యాన్నీ అందిస్తాయి. ముఖ్యంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషదమొక్కలు పెంచుకుంటే చాలు ఇంట్లో ఉండే చిన్న..పెద్ద..ముసలి అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా...

కొంత మందిని చూడగానే వయసు తక్కువగానే ఉన్నా వారి ముఖంలో వచ్చే ముడతలు మాత్రం వయసుపైబడినట్లు కనిపించేలా చేస్తాయి. ఇందుకు కారణం వారి ముఖం మీద చేరిన మృత కణాలు. వాటిని తొలగించేందుకు ముఖానికి చక్కని ఫేషియల్‌ మాస్క్‌ వేసుకుంటే వయసు తక్కువగా కనిపిస్తారు. మరి మీరూ వయసు తక్కువగా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి.
 చర్మం పొడిబారినట్లుగా కాకుండా మృదువుగా ఉంటేనే...

హైదరాబాద్ : మహిళల జీవిత గమనంలో మెనోపాజ్ దశ ఎంతో కీలకమైనది. జీవక్రియలలో అనేక మార్పులు చోటు చేసుకునే ఈ దశలో ఎంతో మంది మహిళలు ఆస్టియో పోరోసిస్ బారిన పడుతున్నారు. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఇవాళ్టి హెల్త్ కేర్ లో డాక్టర్ వివరించారు. మరి మీరూ చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

అసలే చలికాలం. చలికి తట్టుకోలేక సూర్యరశ్మి తగిలితే బాగుండును అనిపిస్తుంది కదూ. అదే ఎండాకాలం అయితే వేడి తట్టుకోలేకపోతున్నాం. ఏసీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా కాలాన్ని బట్టి వాతావరణంలో మార్పులు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఏకాలంలో అయినా సూర్యరశ్మి ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే శరీరానికి కావలసిన విటమిన్‌ డి, కాల్షియం దీని నుంచే అందుతుంది కాబట్టి.
చలికాలంలో వాతావరణం చల్లగా...

బొప్పాయి పండులో వున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. అందరికీ అందుబాటు ధరలో ప్రతి చోటా లభిస్తుంది. మన ఆరోగ్యానికి బొప్పాయిపండు ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి...

ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో బ్రేక్‌ ఫాస్ట్ చాలా ముఖ్యం. ఉదయం పూట తినే ఆహారమే రోజంతా మనలో ఉత్తేజాన్ని నింపుతుంది. కనుక తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అయితే ఉదయం పూట కేకులు తినడం సరికాదు. చక్కెర, వెన్నతో చేసినవి పొద్దున్నే తినడం వల్ల శరీరంలోకి ఎక్కువ క్యాలరీలు చేరతాయి. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అరుగుదల అంతగా ఉండదు. పొట్టలో ఇబ్బందితో అసౌకర్యానికి...

హైబీపీతో పాటు రక్తంలోని కొవ్వు కరిగించాలంటే వారానికి రెండుసార్లు మష్రూమ్స్ తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. మష్రూమ్స్ మన శరరీ రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగించి, రక్తాన్ని శుద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర కూరగాయల నుంచి పొందలేని పోషకాలు మష్రూమ్స్ నుంచి లభిస్తాయి. మష్రూమ్స్‌లో "డి" విటమిన్ అధికంగా ఉంటుంది. అందుచేత మష్రూమ్స్‌ను వారానికి రెండుసార్లైనా లేదా...

కాలీఫ్లవర్స్‌ ఎక్కువగా దొరికే సీజన్‌ ఇదే. దీనిలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కాలీఫ్లవర్‌ను గోబీ అని కూడా అంటారు. ఇందులో రక్తాన్ని పెంచే గుణం వుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. ఈ ఆకులను పచ్చివిగా సలాడ్‌ రూపంలో ఆహారంగా తీసుకుంటారు. రోగులకు జబ్బుపడ్డ తర్వాత వైద్యులు గోబీ ఆకులు తినమని సూచిస్తున్నారు. కాలీఫ్లవర్‌ను లాటిన్‌...

ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి ఏవోవే క్రీమ్స్ వాడుతూ ముఖాన్ని కొంతమంది పాడు చేసుకుంటుంటారు. వీటిని తొలగించడానికి కొన్ని టిప్స్...
అరకప్పు పాలు తీసుకుని అందులో రెండు చెంచాల ఓట్స్ వేసి బాగా మరిగించాలి, చల్లారాక మెత్తని ముద్దగా చేసి, కొంచెం పెరుగు కలిపి ఒక అరగంట ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత ముఖానికి పూతలా వేసుకుని, కొంచెంసేపయ్యాక చన్నీళ్ళ తో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన...

ఏదైనా జబ్బు బారిన పడిన తర్వాత మందులకు తగ్గకపోవచ్చేమో గానీ, జబ్బు రాకుండా ముందే జాగ్రత్తపడేందుకు ప్రకృతి మనకు ఎన్నెన్నో ఆహార పదార్థాల్ని ఇచ్చింది. ఆ విషయాల గురించి కొంత అవగాహన ఉంటే చాలా రకాల భయాలకు మనం దూరంగా ఉండొచ్చు. కొన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే హృద్రోగ సమస్యలను అధిగమించవచ్చు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ వారు ఇటీవల జరిపిన ఒక పరిశీధోనలో వాల్నట్స్...

Pages

Don't Miss