హెల్త్

కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచుతున్నారా ? ఆకలిని నిర్లక్ష్యం చేస్తున్నారా ? వేళకు తినడం లేదా ? వేళ మించాక తింటున్నారా ? అయితే ఇది మీ కోసమే. కడుపును ఖాళీగా ఉంచడం..పూర్తి భర్తీ చేసేయడం రెండూ మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు..

  • మరీ ఆకలి పెరిగిపోయే వరకు ఆగకుండి. ఆకలి కాకుండానే తినేయవద్దు. వేళకు తింటూ ఉంటే...

ఇతర దేశాలకు భిన్నంగా భారతీయ మహిళలు బంగారంపై మక్కువ పెంచుకుంటుంటారు. బంగారు ఆభరణాలను ఎంతో ఇష్టంగా కొనుక్కుంటుంటారు. అంతేగాకుండా పలువురు కానుకలు కూడా ఇస్తారు. ఎంతో ఇష్టంగా కొనుక్కొన్నా..కానుకగా వచ్చిన ఈ ఆభరణాలు పాతబడిపోతే..గీతలు పడితే బాధ పడుతుంటారు. కానీ చిట్కాలు పాటిస్తే ఇలాంటి సమస్యలు రావు.

  • వివిధ ఫంక్షన్లకు వేసుకునే ఆభరణాలను చల్లటి..పొడి...

పెరుగు..ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలంలో చాలా ఉపయోగకరం. పెరుగును అందంగా కూడా ఉపయోగించుకోవచ్చు.
మజ్జిగలో పలుచటి బట్టను ముంచి ఆ బట్టను ముఖం మీద వేసుకోవాలి. ఇలా పది నిమిషాలకి నాలుగైదు సార్లు చేయాలి. అనంతరం శుభ్రమైన పొడిబట్టతో తుడుచుకోవాలి. తరువాత గోరువెచ్చటి నీళ్లలో బట్టను ముంచి తుడుచుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తే చర్మం బాగుంటుంది.
మెటిమలు ఎక్కువగా...

కూరగాయాల్లో ఆలుగడ్డ కూడా ఒకటి. ఈ గడ్డను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని వైద్యులు పేర్కొంటున్నారు. ఫ్రై..కుర్మా..ఉడకబెట్టి తిన్నా..జ్యూస్ లాగా తాగిన ఆరోగ్యానికి మేలు అంట. గ్యాస్టిక్ మరియు ఎసిడిటి, అల్సర్ వంటి రోగాలను నయం చేస్తుందంట. కర్రీ చేయడం వలన కొన్ని ప్రోటీన్స్ పోతాయని, జ్యూస్ లాగా తీసుకుంటే మేలు అని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.  క్యాన్సర్ తో పోరాడే శక్తిని కలిగి...

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని లవణాలు చెమటరూపంలో...

హైదరాబాద్: అస్ట్రియో, రూమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? దానికి హోమియో పతి లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి? హోమియో కేర్ ఇంటర్నేషనల్ ను డా.సబిత సలహాలు సూచనలు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

గుమ్మడి కాయ .. ఇవి రెండు రకాలు.. ఒకటి బూడిద గుమ్మడి, మరొకటి తీపి గుమ్మడి. గుమ్మడి కాయ అనగానే మనకు గుమ్మడి పులుసు, ఒడియాలు, ఒరుగులు చేస్తూ ఉంటాం. అంతే కాకుండా వీటిని దిష్టితీయడానికి కూడా విరివిగానేఉపయోగిస్తాం. అంతే కాకుండా ర‌క‌ర‌కాల జ్యూస్‌ల‌లోనూ, సూప్‌గానూ దీనిని ఉప‌యోగిస్తారు. కానీ దీనికి అనేక రోగాలను నివారించే గుణం ఉందని తెలుసా! అవునండి రోజువారీ ఆహారంలో గుమ్మడిని చేర్చితే...

పర్యావరణాన్ని కాపాడటానికి అల్టిమేట్‌ మార్గం అంటే చెట్లను పెంచడమే! అయితే దీని కోసం కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించినవారవుతారు. అందులోని ఐదు అంశాలు!
బ్రష్‌ చేసుకుందామని ట్యాప్‌ దగ్గరికి వెళుతారు కదా. బ్రష్‌ కడిగి దానికి పేస్ట్‌ పెట్టి... బ్రష్‌ నోట్లో పెట్టుకునేంతవరకు నీళ్ల నల్లా బంద్‌ చేయడం మర్చిపోతాం. ఇలా చేయడం వల్ల నిమిషానికి కొన్ని లీటర్ల...

నిన్న కాక మొన్నే తీసుకొచ్చా..అప్పుడే బియ్యం పురుగులు పట్టాయి ఛీ..ఛీ' అంటూ విసుక్కునేవారు చాలా మందే ఉన్నారు. పురుగు పట్టిన బియ్యం వాడాలంటే అస్సలు మనసు ఒప్పుకోదు. అంతే కాదు వాటిని శుభ్రం చేయడం కూడా చాలా కష్టమైన పనే. అయితే కొన్ని చిట్కాలతో బియ్యం పురుగు పట్టకుండా కాపాడుకోవచ్చు. అవేంటో మీరే చదవండి...

వేపాకులతో: బియ్యం నిల్వ చేయడానికి ఎక్కువ మంది...

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియలో మలవిసర్జన. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్దకం (Constipation) గా భావించాలి. సాధారణంగ మూడు రోజులకు మించి...

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు పరుగులే..పరుగులు. కాలంతో పాటు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. భార్య..భర్తలిద్దరూ ఉద్యోగస్తులయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీనితో వారి శక్తిసామర్థ్యాలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీనివల్ల నీరసించిపోయి అనారోగ్యాల బారిన పడుతుంటారు. అలాంటపుడు మహిళలు కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే చాలు...తగ్గిపోయినా ఎనర్జీ లెవల్స్‌ మళ్ళీ...

బెండకాయ...ఈ కూరగాయన్ని వివిధ రకాలుగా వండుకోవచ్చు. కొంతమంది బెండకాయలంటే అయిష్టంగా ఉంటారు. కానీ ఈ బెండలో ఎన్నో పోషక పదార్థాలు లభిస్తాయి. బెండ ఔషధపరంగా కూడా ఎంతో ఉపయోగిస్తుంది. ఐరన్..జింక్..ఫైబర్..విటమిన్ ఎ.సి.ఇలు..బీటా కెరోటిన్..పెక్టిన్, ఫోలిక్ యాసిడ్..యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దామా...
శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడమే కాకుండా...

గ్రామాల్లో ఇప్పటికీ చాలామందికి ఆకలితీర్చే ఆహారం రైస్‌వాటర్‌(గంజి). బియ్యం ఉడకబెట్టి వార్చిన నీరే గంజి. గంజి నీటి ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేకాదు బియ్యం కడిగిన నీళ్లే రైస్‌ వాటర్‌ అనుకుంటే పొరబడ్డట్టే. దీన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఎక్కువ నీళ్లు పోసి బియ్యాన్ని బాగా ఉడకబెట్టాలి. అలా ఉడుకుతున్నప్పుడే ఆ నీటిని వేరు చేయాలి. అలా వేరు...

తలనొప్పి..చాలా మందికి ఈ నొప్పి వస్తుంటుంది. ఇందుకు పలు కారణాలున్నా వాటిని దూరం చేయకుండా వ్యాధి వచ్చినప్పుడు మందులు వాడుతుంటారు. కానీ సమస్య మాత్రం తీరదు. నొప్పి అలాగే ఉంటూ ఉంటుంది. నిద్రలేమి..ఫుడ్, మానసిక ఒత్తిళ్ల వల్ల తలనొప్పి వస్తుంటుంది. వెన్న, మటన్ ఎక్కువగా తీసుకుంటే కూడా తలపోటు పెరుగుతుంటుందంట. మసాలా ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. పోషకాలు ఉన్న ఆహారంతో పాటు మంచి...

చర్మ రక్షణకు కేవలం ఫేస్‌ ప్యాకులు, రకరకాల క్రీములు మాత్రమే వాడితే మాత్రం సరిపోదు. వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. వీటిని తినడం వల్ల మొటిమలు రాకుండా నివారించవచ్చు.
చర్మం లోపల పేరుకుపోయిన బ్యాక్టీరియా, ఇతర క్రీములు బయటకు విడుదల కావడం వల్ల మొటిమలు వస్తాయి. బచ్చలి కూరలో విటమిన్‌-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది మొటిమలకు యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది....

ఇంట్లో చీమలు ఉన్నాయంటే.. ఎవరికైనా కంగారే. ఎక్కడ ఏది పెట్టినా.. చీమలు చుట్టుముడతాయని ఆందోళనపడాల్సి వస్తుంది. స్వీట్‌ స్నాక్స్‌, హాట్‌.. ఇలా తేడా లేకుండా అన్నింటిపైనా దండెత్తేస్తాయి చీమలు. ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారపదార్థాలకైనా.. చక్కెరకైనా.. కొనుకొచ్చిన మిక్చర్‌ పొట్లానికైనా.. చీమలు పట్టాయంటే.. చాలా చికాకు పుడుతుంది. వంట గది నుంచి హాలు వరకు ఎక్కడ చూసినా వీటి బెడద ప్రతి...

కళ్ల అందాన్ని వర్ణించని కవులు ఉంటారా... మగువ కళ్లకు అంతటి ప్రాధాన్యత ఉంది మరి. ఆ కళ్లకి కాటుక పెట్టుకుంటే... ఆ అందమే వేరు... అందుకే మహిళలు కాటుక పెట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. అయితే మీ అందమైన కళ్లకు కాటుక పెట్టుకునేటప్పుడు కొన్ని మెళకువలు పాటించాలి. అవేంటో చూద్దాం!
జిడ్డు చర్మం ఉన్నవారు ఐస్‌ ముక్కలతో ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చెమట పట్టడం...

మీకు ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కావాలనుకుంటున్నారా ? అయితే మీకు ఈ ప్రణాళిక కచ్చితంగా సరిపోతుంది. సాంప్రదాయక ఆహర పదార్ధాలతో కూడిన ఈ ఆహార నియమాలను పాటించడం ద్వారా గుండె, క్యాన్సర్‌ వలన వచ్చే మరణాలను తగ్గించవచ్చు. అంతేకాక మతిమరుపును, నరాల బలహీనతలను కూడా తగ్గిస్తుందని అనేక పరిశోధకులు తెలుపుతున్నాయి.

ఉపయోగించవలసిన ఆహార పదార్ధాలు..
ప్రధానంగా పండ్లు,...

ప్రతి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకొనే వరకు ఉరుకుల పరుగులతోనే సమయం గడిచిపోతుంది. అలసి..సొలసి..ఇంటికి వచ్చి రాత్రి పడుకొనే సయమంలో 'బెడ్' కీలక పాత్ర పోషిస్తుంటుంది. బెడ్ కరెక్టుగా లేకపోతే నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దీనితో మరుసటి రోజు నిద్రతో ఒకవైపు..అలసటతో మరోవైపు అవస్థలు పడుతుంటారు. అందుకని చక్కటి బెడ్ ఇందుకు పరిష్కారం చూపుతుంటుంది. ఏవో మార్కెట్లో దొరికే బెడ్స్...

రెండు రెబ్బల కరివేపాకు, చిటికెడు పసుపు తీసుకోవాలి. వీటిని కలిపి నూరాలి. కుంకుడు గింజ పరిమాణంలో రోజూ ఈ మిశ్రమాన్ని తింటే అజీర్ణం దరి చేరదు.
చెవిపోటు వస్తే చెవిలో రెండుమూడు చుక్కల వెల్లుల్లి రసం వేస్తే కొంత రిలీఫ్ దొరుకుతుంది.
అల్లం తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి సేవిస్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు....

సీజనల్ వ్యాధులతో తస్మాత్...!

ప్రతి సీజన్‌లోనూ రకరకాల వ్యాధులు ప్రజల ప్రాణాలను అరచేతపట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం వర్షాలతో కొత్త నీరు రావడం, కొన్ని చోట్ల నిలువ ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, పారిశుధ్యం తదితర కారణాలతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అలాగే ఆహారం, మంచి నీరు, దోమలు, ఈగల వల్ల కూడా అనేక వ్యాధులు...

ముఖానికి అందం కళ్లు..అందం అంతా కళ్లలోనే ఉంటుంది. ముఖానికి ఒక తీరైన అందాన్ని ఇచ్చేవి కనుబొమ్మలు. అందానికి చాలా ప్రాధాన్యతనిచ్చే మహిళలు కనుబొమ్మల విషయంలో అంతగా పట్టించుకోరు. ఏదో ఒక షేప్ చేయించుకుంటుంటారు. కాని ఎలా చేస్తే తమ ముఖానికి నప్పుతాయో అలోచించరు. మీ ముఖాకృతి ఏ తీరు కనుబోమ్మలని షేప్ చేయించుకుంటే బావుంటుందో చూద్దాం...
నుదురు చిన్నగా ఉన్నవారు కనుబోమ్మలు కొంచం వంపు...

ఆరోగ్యంగా ఉండాలని  ప్రతి ఒక్కరు కోరుకుంటాం.. మీరు తీసుకునే ఆహారంలో రెండు రోజులకోసారి ఆకు కూరలుండేలా చూసుకోండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఆకుకూరల్లో ప్రధానంగా పాలకూర. మిగిలిని కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. పోషకాహార నిధి అయిన పాలకూరకు క్రమంగా తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును రానవ్వకుండా తోడ్పడుతుంది. ఇవి యాంటీ...

యాపిల్ లో ఎన్నో పోషకాలు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందులోని ఔషధగుణాల వల్ల చాలా రకాల వ్యాధులని నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. యాపిల్స్ గురించి...కొన్ని..
యాపిల్ ను కొంతమంది తొక్క తీసి తింటుంటారు. యాపిల్ ను శుభ్రంగా కడిగి తొక్కతో కలిపి తినాలి.
యాపిల్ జ్యూస్ కి అల్జీమర్స్ ని నిరోధించే శక్తి కూడా ఉంటుంది. మెదడులోని ఎసిటైల్ కోలిన్ స్రావాన్ని...

మన శరీరానికి కావల్సిన అతిముఖ్యమైన ఖనిజం కాల్షియం.ఇది ఎముకల పటిష్టత, దంతాల ఆరోగ్యానికి ఎంతో అవసరం. అంతేకాదు కండరాల సంకోచవ్యాకోచాలకు కూడా కాల్షియం కావల్సిందే. ఎముకలలో కాల్షియం పరిమాణం తగ్గితే ఎముకల బలం తగ్గి అనేక రకాల నొప్పులకు కారణం అవుతుంది. ఆస్టియో పోరోసిస్‌కు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాదు కాల్షియం తక్కువైతే హైబి.పి వస్తుంది. పిల్లల పెరుగుదల సక్రమంగా ఉండాలంటే...

కోమలమైన చర్మం పొడిబారడం, గరుకుగా తయారవడం, మృతకణాలు పెరగడం ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మకణాలు నిస్తేజంగా కనిపిస్తాయి. ఫలితంగా మేనికాంతి తగ్గుతుంది. దీనికి చక్కని పరిష్కారం దానిమ్మ గింజలు. కొబ్బరినూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌, గోధుమ రంగు పంచదార, తేనె రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. వాటితో పాటు చిదిమిన దానిమ్మ గింజల గుజ్జు, నారింజ తొక్కల గుజ్జు, రోజ్‌వాటర్‌...

చలికాలం..ఎన్నో అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో చిన్నపిల్లల చర్మం పొడిబారడం..ఇతరత్రా సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శిశువులు చలికాలంలో ఆరోగ్యంగానే ఉంటారు.

  • శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలే పట్టాల్సి ఉంటుంది.
  • చిన్నారులకు ఆహారం అలవాటు చేసే విషయంలో వైద్యుల సలహాలు...

యుక్త వయస్సు వచ్చే వారికి మొటిమల సమస్య బాధ పెడుతుంటుంది. మొటిమల నుండి తప్పించుకోవడానికి బ్యూటీ పార్లర్లు..ఇతరత్రా సౌందర్య సాధనాలు వాడుతూ పలు సమస్యలు తెచ్చుకుంటుంటారు. మొటిమలు అధికంగా ఉన్న వారు బయటకు వెళ్లడానికి మొహమాటం పడుతుంటారు. అంతేగాకుండా మానసికంగా కృంగిపోతుంటారు. మరి మొటిమల బాధ తీరాలంటే కొన్ని చిట్కాలు...
రెండు చెంచాల తేనె, ఒక చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి...

చక్కగా రోజూ కాస్తంత ఎండు ద్రాక్ష తీసుకుంటే పలు రకాలైన సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌... బత్తాయి... బనాన... కమలా... కర్బుజా ఆరోగ్యం కోసం ఇలా ఎన్నో పళ్లను తింటుంటాం. ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా చేసే సూచన ఇదే. ఇవే కాదు... ఎండుద్రాక్షనూ ఎంతెక్కువగా తింటే అంత మంచిది. ద్రాక్షపండ్లను ఎండబెట్టినపుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. ఈ పండ్లను తరచుగా...

వర్షకాలం..అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. చల్లగాలులు వీచడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. పెదాలు కూడా తడారిపోతాయి. ఈ కాలంలో పెదాలను కాపాడుకోవాలంటే కొన్ని హెల్త్ టిప్స్ మీ కోసం...
మజ్జిగను చూస్తే కొంతమందికి చిరాకుగా ఉంటుంది. కానీ ఇది తీసుకోవడం చాల మంచి శ్రేయస్కరం.
కొంచెం కుంకుమపువ్వు తీసుకుని పెరుగులో కలపాలి. ఈ పెరుగును పెదాలపై రోజుకు రెండు లేదా మూడుసార్లు రాస్తే...

కాసేపు కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేస్తే చాలు.. ఆ ఒత్తిడి ప్రభావం కళ్లపై పడి లాగినట్లు అనిపిస్తాయి. ఇక, బయటికెళితే.. చెప్పక్కర్లేదనుకుంటా! దుమ్ము, ధూళి, ఎండ ప్రభావం ఎంతో ఇబ్బంది పెడతాయి. ఇలాంటి ఇబ్బందులకు దూరంగా.. కళ్లు తాజాగా మారాలంటే..
గులాబీ రేకుల్ని ముద్దగా చేసుకుని దానికి ఒక స్పూను పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తమలపాకుపై ఉంచి కళ్లు మూసుకుని పావుగంట సేపు మూసి...

సాధారణంగా చాలా మంది మగవారి చర్మం జిడ్డుగా ఉంటుంది. ముఖంలో ఓపెన్‌ రంధ్రాలు కలిగి ఉంటారు. మగవారు ఎక్కువ బయట తిరుగుతుంటారు కాబట్టి దుమ్మూదూళి ముఖ రంధ్రాల్లో చేరి మొటిమలు, ముడతలు ఏర్పడటానికి దారితీస్తుంది. కాబట్టి ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి కెమికల్‌ ఫ్రీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మంచిది. రోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్లతో శుభ్ర పర్చుకుని క్ల్లీన్సింగ్‌ అప్లై...

జుట్టు నల్లగా లేదని చాలామంది బాధపడుతుంటారు. వాతావరణ ప్రభావ కారణంగా చిన్నవారికి కూడా వెంట్రుకలు తొందరగా తెల్లబడుతున్నాయి. అందుకే జుట్టు నల్లగా ఉండటం కోసం అన్నో రకాల క్రీములను వాడుతుంటాం. కాని ఇవన్ని తాత్కాలికం మాత్రమే. ఈ సమస్య పురుషుల కంటే స్త్రీలలో మరీ ఎక్కువగా కనపడుతోంది. దీంతో నల్లని జుట్టు కోసం మార్కెట్లో దొరికిన ప్రతి హెయిర్‌ డైని ప్రయోగిస్తారు. వాటితో అనేక చిక్కులు....

స్కూల్లోను, ఇంట్లోను పెట్టే భయం కారణంగా పిల్లల్లో ఎదుగుదల లోపం వచ్చి నిద్రలేమితో బాధపడుతున్నారు. అది వారిలో పెంకితనాన్ని పెంచుతుందని ఓ సర్వేలో తేలింది. పిల్లలు కనీసం 8 నుండి 9 గంటలు నిద్రపోతే సరిపోతుంది. అలా కాకుండా చదువు.. చదువు.. అంటూ నిద్ర పోనీయకుండా చేస్తే అది పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది.
నిద్ర తక్కువైన పిల్లల్లో త్వరగా కోపం, ఉద్రేకం, దెబ్బలాడే మనస్తత్వం...

వేరుశనగ తినడం వల్ల కొన్ని ప్రాణాంతకమైన వ్యాధులు దరిచేరవు. ఉడకపెట్టిన వేరుశనగ పప్పును ప్రతిరోజూ పదిగ్రాముల చొప్పున తీసుకుంటే గుండెజబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులను రాకుండా నివారించవచ్చంటున్నారు పరిశోధకులు. వేరుశనగపప్పు లోని ఫైబర్‌, యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించడంతో ఆయుష్షును పెంచుతాయట. ఇందులో మాంసకృత్తులతో పాటు.. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము,...

లవంగాలు..ఔషధం. దీనిని ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచింది. అలాగే లవంగ నూనె చర్మ ఆరోగ్యానికి ఎంతగానే దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. మరి లవంగ నూనెను వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయి.
శరీరంపై గాయాలు వల్ల కలిగే మచ్చలను లవంగ నూనె తొలగిస్తుంది. అలాగే మొటిమలను కూడా తొలగించే సామర్థ్యం ఈ నూనెకు ఉంటుంది. ఒక రసాయనిక పొరలా ఏర్పడి మచ్చలను...

వర్షాకాలం మొదలై పోయింది. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉద్యోగాలకు వెళ్లే వారు..ఇతరత్రా పనులపై వెళ్లే మహిళలు వర్షం తడవడం సాధారణంగా మారిపోతుంటుంది. వర్షంలో తడవడం వల్ల చర్మం..వెంట్రుకలపై ప్రభావం పడుతుంది. కేర్ తీసుకోకపోతే తడిచిన వెంట్రుకల నుండి చెడు వాసన వస్తుంది. దీనితో చుండ్రు ఏర్పడి వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది. అందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
...

వేసవికాలం.. బరువు తగ్గాలనుకొనే వారికి ఇది సరైన సమయం. దీనికి అందరూ ఎంచుకునే మార్గం డైటింగ్‌. కానీ బరువు తగ్గాలనుకునేవారు కొవ్వును కరిగించే పదార్థాలతో పాటు పోషకాలున్న పదార్థాలైన కూరగాయలు, పండ్లను ఎంచుకోవడం ఉత్తమం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారణం, కూరగాయలు, పండ్ల మోతాదును ఆహారంలో పెంచుకుంటే వాటిలో ఉండే పీచు వల్ల కొద్దిగా తిన్నా పొట్ట నిండిన భావన కలుగుతుంది. క్యాలరీలు తక్కువగా...

నిండా నూరేళ్లు బతకాలి..సంతోషంగా ఉండాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. కానీ మధ్యలోనే వారి జీవితం ముగుస్తుంది. ఇందుకు మనం తినే ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారంట. ముడి ధాన్యం ఇందుకు చక్కటి పరిష్కారమంట. రోజు ముడి ధాన్యంతో చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. దంపుడు బియ్యం..రాగులు..జొన్నలు..సజ్జలు..కొర్రలు వంటి ముడి...

సరదాగా ఎక్కడికైనా టూర్‌ ప్లాన్‌ చేసుకుంటారు. ట్రైనో, బస్సో, ఫ్లైటో ఏదైనా ఎక్కాల్సి వస్తుంది. తీరా వాటిలో ఏదైనా పడకపోతే వికారం, వాంతులు మొదలు. హ్యాపీగా వెళ్లాల్సిన జర్నీ కాస్త.. నీరసంగా నడుస్తుంది. ఇలాంటి వాళ్లు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఇంట్లో వాడే వస్తువులతో బోలెడు చిట్కాలున్నాయి. అవేంటంటే..
దీనికి అల్లం చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. వాంతులను ఈజీగా తగ్గిస్తుంది....

మీరు సన్నగా ఉండి, సహజంగా బరువు పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారా.. ఏదిఏమైన బరువు పెరగటం వలన ఫిట్నెస్‌తో పాటూ, ఆరోగ్యం కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే సహజంగా బరువు పెరగటం వలన శరీరానికి కలిగే దుష్ప్రభావాల నుండి కాపాడుకోవచ్చు.తక్కువ బరువు ఉన్నవారు, బరువు పెరగాలని ఎక్కువగా ఏది పడితే అది తింటూ ఉంటారు. దీని వలన ఆరోగ్యకరమైన బరువు కాకుండా శరీరంలో కొవ్వు పదార్థాల...

అందమైన అమ్మాయి మోముపై.. ఓ చిన్ని మొటిమ ముత్యంలా మెరిసిపోతుంది. అదే ముఖమంతా వ్యాపిస్తే.. మచ్చలు, యాక్ని (తొలిదశలో ఉండే మొటిమలు, వైట్‌, బ్లాక్‌ హెడ్స్‌ కలిపి)తో నిండి పోతే అమ్మో.. కౌమారంలో అడుగు పెడుతున్న అమ్మాయిలకు ఇదో పెద్ద కలవరపాటు ఆ మాటకొస్తే 80 శాతం పెద్దవారిలోనూ ఇటువంటి సమస్యలున్నాయని నిపుణులు అంటున్నారు.
యుక్త వయసులో మొదలైన ఈ సమస్య మూడు పదుల వరకు ఉంటుందట....

మనకు కీరా దోసతో బోలెడన్ని లాభాలు ఉన్నాయి అని ఖచ్చితంగా తెలిసిందనుకోండి... కీరాను మన ఆహారంలో భాగం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించం?! తప్పక ప్రయత్నిస్తాం. అనేక వ్యాధులను దూరంగా ఉంచడంలోను, శరీర సౌందర్యాన్ని పెంచడంలోనూ, చివరికి బరువు తగ్గించడంలోనూ దోహదపడే కీరాను ఎవరైనా కొనకుండా ఉంటారా? అస్సలు ఉండరు కదా! అందుకే కీరాలో ఉన్న సుగుణాలేంటో వివరంగా తెలుసుకుని మీరు కచ్చితంగా మీ ఆహారంలో...

వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్యాలు వెంట వచ్చినట్టే. అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో దోమలు, పురుగులు వృద్ధి చెందుతాయి. దీనితో ఇంట్లో వారు అనారోగ్యాలకు గురవుతుంటారు. దోమలు, పురుగుల నివారణ కోసం ఏవో మందులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. వీటి నివారణకు ఓ ద్రవం వాడితే సరిపోతుంది.
నిమ్మ లేదా నారింజ‌ల‌లో ఏ పండైనా తీసుకుని దాని...

Pages

Don't Miss