హెల్త్

జామ ఆకులు పసుపుతో కలిపి నూరి మొటిమలున్న చోట రాస్తే, క్రమంగా మొటిమలు తగ్గడం గమనించవచ్చు. వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం చేత కఫము తగ్గుతుంది. ఆహార పదార్ధాలలో పసుపు కొద్దిగా వాడటం వల్ల రక్తశుద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో నరాలు బెణికిన చోట పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టీ...

ఇంట్లో చీమలు ఉన్నాయంటే.. ఎవరికైనా కంగారే. ఎక్కడ ఏది పెట్టినా.. చీమలు చుట్టుముడతాయని ఆందోళనపడాల్సి వస్తుంది. స్వీట్‌ స్నాక్స్‌, హాట్‌.. ఇలా తేడా లేకుండా అన్నింటిపైనా దండెత్తేస్తాయి చీమలు. ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారపదార్థాలకైనా.. చక్కెరకైనా.. కొనుకొచ్చిన మిక్చర్‌ పొట్లానికైనా.. చీమలు పట్టాయంటే.. చాలా చికాకు పుడుతుంది. వంట గది నుంచి హాలు వరకు ఎక్కడ చూసినా వీటి బెడద ప్రతి...

నవ్వు వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. నవ్వు నాలుగు విధాల కాదు..నలభై విధాలుగా గ్రేట్ అని అంటున్నారు. మనస్పూర్తిగా నవ్వే నవ్వులో ఎక్కువ కండరాలు ముడిపడి ఉంటాయని, నవ్వు అనేది జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఒకసారి నవ్వు వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
నవ్వడం వల్ల హాయిగా ఉండడమే కాకుండా పని చురుగ్గా చేసుకోగలుగుతారు. హాయిగా...

నలుగురిలో ఉన్నా అందరి దృష్టి తమపైనే ఉండాలని కోరుకుంటుంటారు. చర్మం సౌందర్యంగా ఉండటానికి పలు రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ చర్మం సౌందర్యంగా మారకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. పండ్ల జ్యూస్ తాగితే చర్మం నిగారింపు వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. పండ్ల రసాన్ని ఫేసియల్ గా ఉపయోగిస్తే ? ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే చర్మ సంరక్షణ సులభంగానే సాధ్యమవుతుంది....

సహజంగా కాయగూరలు ఎలాంటివి తీసుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. ఇలాంటి వారు ఈ జాగ్రత్తలు తీసుకున్నటైతే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. వంకాయలు వాడిపోకుండా, మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. తొడిమలు ఆకుపచ్చ రంగులో ఉండి తోలు నిగనిగలాడుతూ పుచ్చులు లేకుండా చూడాలి.
బంగాళాదుంపలు గట్టిగా ఉండేలా చూసుకోవాలి. పైపొర తీసినప్పుడు లోపలిభాగం...

పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగిన శరీరం... ఇంటికి రాగానే అలసట తీర్చుకుంటుంది. అలాగే ఎక్కడెక్కడో తిరిగి అలసిన చర్మం అలసట తీరాలంటే.. దానిపై చేరిన జిడ్డు పోవాలంటే రాత్రి పడుకునే ముందు కడగాల్సిందే అంటున్నారు డెర్మటాలజిస్టులు!
అస్సలు దుమ్ముధూళి లేని ఎంత మంచి వాతావరణంలో సాయంత్రాలు స్పెండ్‌ చేసినా.. కచ్చితంగా ముఖంపై జిడ్డు చేరుతుంది. ఇంకా రోజంతా మేకప్‌ వేసుకునో, లేదంటే ఏదైనా...

ముఖంపై ఏర్పడిన మచ్చలు, మొటిమలు పోగొట్టి నిగారింపు తీసుకురావడంలో చందనానికి సాటి మరోటి లేదు. అయితే కేవలం సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా చందనం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పాతకాలంలో గంధం నిత్యం ఏదో ఒక చోట వాడుతూ ఉండేవారు. ఈ రోజుల్లో అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వివిధ క్రీములు వాడుతున్నాం. వీటిల్లో కూడా చందనం విరివిగా వాడుతున్నారు. ఎండకు నల్లబడిన చర్మాన్ని మళ్లీ కాంతి...

ఉరుకుల పరుగుల జీవితాలు..ఇంట్లో దంపతులు ఇద్దరు ఉద్యోగులయితే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అందులో ప్రధానంగా భోజన సమస్య. వంట వండుకోవడమే కొందరు మానేస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా మాత్రమే వండుతుంటారు. బయట దొరికే ఆహారాన్ని తీసుకొంటుంటారు. ఇంట్లో వండుకునే సమయమే ఉండటం లేదు చాలా మందికి. ఒకవేళ సమయమున్నా బద్దకిస్తున్నారు కూడా. హోటల్స్ లో భోజనం..కర్రీ పాయింట్ నుండి కర్రీలు తెచ్చుకోవడం...

పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను తీసుకోవడం వల్ల అనారోగ్యాలు దరి చేరవు. అలాగే పండ్లతో కూడా అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అందులో 'అరటి' కూడా ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద అరటిని పండించే విషయంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. మరి ఈ అరటిని తీసుకోవడం వల్ల అందంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. మరి అవేంటో చూద్దామా…

  • మేక మాంసం...

నిత్యం ఎండలో తిరగడం, దుమ్ము, ధూళి, వేడి, ఎండ, చెమట ఇలా కారణాలు ఏమున్నా శరీరంలోని ఆయా భాగాలు నల్లగా మారుతుంటాయి. ప్రధానంగా మోకాళ్లు, మోచేతులు, చంకల్లో ఎక్కువగా నల్లగా అవుతుంది. అయితే కింద సూచించిన పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల నల్లబడ్డ ఆయా భాగాలను తిరిగి సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చు. అందుకోసం కొన్ని చిట్కాలు..

అలోవెరా..
ఎండ...

శనగలు...వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మహిళలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. శనగలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. మరి శనగల్లో ఉన్న పోషకాల విలువలు ఏంటో తెలుసుకోవాలంటే చదవండి..
ఫొలేట్, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోని అమినోయాసిడ్ ప్రభావాన్ని తగ్గించి గుండెలోని రక్తనాళాలు మూసుకపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది....

శరీరం ధృడత్వంగా ఉండలంటే ఏం చేయాలి ? ఎలాంటి అనారోగ్యాన్నయినా ఎదుర్కొవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? ధృడమైన శరీరం గల వారు ఎలాంటి రోగాలనైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. పండ్లు..తాజా కూరగయాలు..విటమిన్స్ తో కూడిన భోజనం తీసుకుంటూ ఉండాలి. శరీరం ధృడంగా ఉండేందుకు వివిధ ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా 'రాగులు'. వివిధ రోగాలకు రాగులు బాగా పనిచేస్తాయి. రాగి...

షవర్‌ కింద నిలబడి చల్లటి నీళ్లు తలపై వాన జల్లులా జారుతుంటే బాత్‌రూమ్‌లో కూనిరాగాలు తీస్తూ స్నానం చేయడం... ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. ఎంత సేపు స్నానం చేసినా తనివి తీరదు, ఎంతకీ బాత్‌రూంలో నుంచి బయటకు రావాలని అనిపించదు. ఈ అనుభూతుల వెనుక అనర్ధాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. కుళాయి మూతికి చివర నీరు జల్లులా పడేందుకు రంధ్రాలు ఉన్న గుబ్బను బిగిస్తారు, దీనినే షవర్‌ అంటారు. షవర్‌ను...

కోమలమైన చర్మం పొడిబారడం, గరుకుగా తయారవడం, మృతకణాలు పెరగడం ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మకణాలు నిస్తేజంగా కనిపిస్తాయి. ఫలితంగా మేనికాంతి తగ్గుతుంది. దీనికి చక్కని పరిష్కారం దానిమ్మ గింజలు. కొబ్బరినూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌, గోధుమ రంగు పంచదార, తేనె రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకోవాలి. వాటితో పాటు చిదిమిన దానిమ్మ గింజల గుజ్జు, నారింజ తొక్కల గుజ్జు, రోజ్‌వాటర్‌...

కార్యాలయాలు...అపార్ట్ మెంట్లు..ఇతర్రా వాటిల్లో లిఫ్ట్ కామన్ అయిపోయాయి. ఒక అంతస్తుకు వెళ్లాల్సిన ఉన్నా కొంతమంది లిఫ్ట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది అంత శ్రేయస్కరం కాదని వైద్యులు పేర్కొంటున్నారు. మెట్లు ఎక్కడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైందంట. మెదడు వయస్సు తగ్గడమే కాకుండా ఎంతో చురుగ్గా పనిచేస్తుందంట. కెనడాలోని కంకార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన జాసన్‌...

వేసవికాలం వస్తోందంటే చాలు ప్రపంచంలో అందరికీ గుర్తుకొచ్చేది పుచ్చకాయ. దీన్ని ఖర్బూజ అని కూడా పిలుస్తారు. ఈ కాయ నిండా నీరే ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో దీనికి వాటర్‌ మెలోన్‌ అనే పేరు స్థిరపడింది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది....

బంగాళాదుంపతో అధిక బరువు, రక్తపోటును దూరం చేసుకోవచ్చు. పలు పరిశోధనలు జరిపిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు పెన్సిల్వేనియాలోని స్క్రాన్టన్‌ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు. చాలామంది బంగాళాదుంపను ఫ్రై, చిప్స్ రూపంలో తీసుకుంటారు. నూనెలో వేయించిన బంగాళాదుంపను తినడం వల్ల ఉపయోగాలు లేకపోగా అది ఎటువంటి క్యాలరీలను అందజేయదని నిర్ధారించారు. ఊదా రంగులో ఉండే బంగాళాదుంపను నూనెలో వేయించకుండా...

గుప్పెడు గులాబిరేకలను బాగా కడిగి ఒక పాత్రలో వేసి నీళ్లుపోసి మరిగించాలి. చల్లారాక వడకట్టి ఓ సీసాలో పోసుకొని అవసరమైనపుడల్లా ఈ గులాబీనీటిని ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖంపై పేరుకునే దుమ్ముధూళి పూర్తిగా తొలగిపోయి చర్మం తేటగా మారుతుంది. ఇది అన్ని రకాల చర్మతత్వం వారికి సరిపోతుంది. చెంచా పెరుగుకు కాస్త బత్తాయిరసం చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెడల్పాటి పళ్ళెంలో పోసి అందులో ముంచి...

చర్మం బిగువుగా ఉండడం..నిగారింపు..మెరుపు కోసం అతివలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారి ప్రయత్నాలు కొన్నిసార్లు బెడిసి కొడుతుంటాయి..ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే పూర్వ నిగారింపు..మెరుపు సొంతం చేసుకుంటాయి. మరి చిట్కాలు చూద్దామా..
రెండు స్పూన్ల పాలు, కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్ తీసుకోవాలి. అంతే మోతాదులో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి...

చలికాలం వచ్చేస్తోంది. ఇప్పటికే చలిగాలులు మొదలయ్యాయి. దీనితో చర్య సమస్యలు ఏర్పడుతుంటాయి. చర్మం పొడిగా, జిడ్డుగా మారడం, జుట్టు పొడిబారడం, పెదాలు తడి ఆరడం లాంటి ఎన్నో సమస్యలు చలికాలంలో వస్తాయి. పొడి చర్మం ఉన్న వారు మాయశ్చరైజర్‌ కోల్డ్ క్రీమ్‌ను రెగ్యులర్‌గా వాడాలి. అంతేకాక, చర్మం పొడిబారకుండా ఉండేందుకు తరచూ మంచినీళ్లు తాగుతుండాలి.
వేడి నీళ్లతో స్నానం చర్మం మరింత...

ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్‌తో గడుపుతున్నారు. వ్యాయామం చేయడానికి కూడా చాలా మందికి టైమ్‌ సరిపోవడం లేదు. దీంతో పొట్ట, ఊబకాయంతో సతమతమవుతున్నారు. ఇలాంటి వారి కోసం ఓ సరికొత్త స్మార్ట్‌యాప్‌ అందుబాటులో ఉంది. కొత్తగా వ్యాయామం చేయాలనుకునే వారికి, ఇప్పటికే చేస్తున్న వారికి ఎందెంతో ఉపయోగకరం. సులువుగా ఎక్సర్‌సైజ్‌లు ఎలా చేయాలో తెలియజేసేందుకు '7 డైలీ మూవ్స్‌' యాప్‌ దోహదపడుతుంది....

ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను గుజ్జుగా చేసి ముఖానికి, మెడ భాగంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ చర్మంలో కాంతి వస్తుంది.
రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్‌మీల్‌ను గ్రైండ్‌ చేసి అందులోకి కొన్ని చుక్కల బీట్‌రూట్‌ రసాన్ని కలిపి ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి.
మొదట బీట్‌రూట్‌ ముక్కలను గ్రైండ్‌ చేసుకుని ఒక బౌల్‌లో తీసుకోవాలి....

 

ముఖ ఛాయ ఆకర్షణీయంగా కనిపించేందుకు దోహదపడేవి పెదవులు. అలాంటి పెదవులు అస్తమానం తడాలిపోతూ, పొడిగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యను నివారించేందుకు ఎన్ని సార్లు లిప్‌ కేర్‌ రాసినా, ఎంత మోతాదులో మంచినీళ్లు తాగినా పెదాలు మాత్రం పొడిబారి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి అలా పొడిబారిన పెదాలకు సరైన ఇంటి చిట్కాలను పాటిస్తే సమస్య నుండి బయటపడవచ్చు....

ఎండలో తిరిగొచ్చేసరికి ముఖంపై టాన్‌ పట్టేస్తుంది. దీనివల్ల ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంది. కాబట్టి కనీసం రెండు రోజులకోసారైనా టాన్‌ని వదిలించుకుంటే మంచిది. దీనికి వంటింట్లో దొరికే పదార్థాలనే ఉపయోగించుకోవచ్చు.

  • టమాటా గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తర్వాత కడిగేసుకుంటే టాన్‌ పోవడంతో పాటు మంచి మెరుపు వస్తుంది. అలాగే కీరదోస...

వంటల కొరకు నాన్‌ స్టిక్‌ పాత్రలు వాడడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే వీటిలో నూనె వాడకం తక్కువ. అలాగే చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది వంటకు నాన్‌స్టిక్‌ పాత్రలనే వాడుతున్నారు. కానీ...ఈ పాత్రలు సరిగ్గా ఉపయోగించుకోకపోతే పలు ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఇవి బాగుండాలంటే కొన్ని చిట్కాలు..
పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత...

కిడ్నీలు..శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పని చేయమని మొరాయిస్తే...ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మరి కిడ్నీలను శుభ్రంగా ఉండాలంటే ?

  • ఉదయాన్నే నిమ్మరసం తాగాలి. నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది.
  • ...

చెంచా తేనెలో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె, చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచుకోండి. దీన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తే, చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక స్పూను గంధంలో స్పూను పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పావుకప్పు బంగాళాదుంప తురుము, రెండు టేబుల్‌ స్పూన్ల గ్రీన్‌టీ ఆకులు, చెంచా నువ్వుల నూనె తీసుకుని...

మీరు సన్నగా ఉండి, సహజంగా బరువు పెంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారా.. ఏదిఏమైన బరువు పెరగటం వలన ఫిట్నెస్‌తో పాటూ, ఆరోగ్యం కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే సహజంగా బరువు పెరగటం వలన శరీరానికి కలిగే దుష్ప్రభావాల నుండి కాపాడుకోవచ్చు.తక్కువ బరువు ఉన్నవారు, బరువు పెరగాలని ఎక్కువగా ఏది పడితే అది తింటూ ఉంటారు. దీని వలన ఆరోగ్యకరమైన బరువు కాకుండా శరీరంలో కొవ్వు పదార్థాల...

అల్లం..ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నిత్యం మనం వంటకాల్లో ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడవని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల కొవ్వు కరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
రోజులో కనీసం ఒక లీటర్ వరకైనా జింజర్ వాటర్ తాగాలి. నిత్యం ఈ వాటర్ ను తాగుతుంటే కొద్ది రోజుల్లో అధికంగా పేరుకపోయిన కొవ్వు కరుగుతుందంట.
అల్లం ముక్కను ఎండబెట్టి పొడి...

చూయింగ్ గమ్..పిల్లలతో పాటు పెద్దలు కూడా దీనిపై ఆసక్తి చూపుతుంటారు. దీనిని నమలడానికి ఓ స్టైల్ గా భావిస్తుంటారు. టీనేజ్ పిల్లలకు ఇది ఒక వ్యవసనంగా మారిందని చెప్పవచ్చు. ఈ చూయింగ్ నమలడం వల్ల అనే దుష్ర్పభావాలు ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పిల్లల్ని ఎదగనీయకుండా అడ్డుకుంటుంది. పిల్లలో కండరాల పెరుగుదలలో లోపాలుంటాయి.
చూయింగ్ గమ్ ని పదే పదే నమలడం ద్వారా ఆరోగ్యానికి...

జుట్టు పొడిబారినట్లు ఉందీ అంటే జుట్టులో తేమ తగ్గినట్లే. తేమ తగ్గిన జుట్టు చిట్లిపోతుంది, రాలిపోతుంది కూడా. మరి, ఈ సమస్యకు పరిష్కారం...
గుడ్డులో ప్రోటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, కరిగే కొవ్వులు అధికంగా ఉంటాయి. కాబట్టి గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి.
గుడ్డులోని తెల్లసొనలో మూడు చెంచాల వెనిగర్‌, ఒక చెంచా ఆలివ్‌ నూనె కలిపి తలకు...

బలంగా, ఫిట్‌గా తయారవ్వాలంటే వ్యాయామం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఇరవైలలోనే అరవైలా తయారవతున్నారు. ఇలాంటి వారందరూ తగిన శిక్షణ తీసుకొని వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్‌గా ఉండటమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారవుతారు.
మార్పు వస్తుంది: ఆరు నెలల పాటు ప్రతిరోజు వ్యాయామం చేస్తే, కండరాలు బలాన్ని పుంజుకొని వ్యాయామానికి అనుగుణంగా...

రాగులు అందరికీ తెలిసే ఉంటుంది. రాగుల్లో ఎన్నో పోషకాలున్నాయి. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను ముఖ్యంగా మధుమేహం, బిపీ సమస్య నుంచి నివారణ పొందవచ్చు. చాలా ఈజీగా రాగులతో చేసుకునే ఆహారం రాగి మాల్ట్‌. సూపర్‌ మార్కెట్‌లోనూ రాగిమాల్ట్‌ లభిస్తోంది. అయితే కాస్త తీరిక చేసుకుని ఇంట్లోనే రాగిమాల్ట్‌పిండిని తయారుచేసుకోవచ్చు. 
రాగి మాల్ట్‌ తయారు...

థైరాయిడ్.. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఈ సమస్య ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానంగా జుట్టు రాలడం ఒకటి. థైరాయిడ్ గ్రంధిలో ఏర్పడే సమస్యల వలన హార్మోన్ లో ఏర్పడే అసమతుల్యతల ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు కలుగుతాయి. వీటి వలన కలిగే సమస్యలలో వెంట్రుకలు రాలటం కూడా ఒకటని వైద్యులు పేర్కొంటున్నారు. థైరాయిడ్ హార్మోన్ లో ఏర్పడే...

హైదరాబాద్ : ఇవాళ వరల్డ్‌ డయాబెటీక్‌ డే. ప్రపంచవ్యాప్తంగా షుగర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్‌కి భారత దేశం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఆహారపు అలవాట్ల వల్లే ఇవాళ భారత దేశంలో షుగర్‌ పేషంట్లు రోజు రోజుకు పెరుగుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం...

పెరట్లో ఒక తులసి మొక్క ఉంటే చాలు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చనే మాటలు అక్షర సత్యాలనవచ్చు. ఎందుకంటే తులసిలో ఉండే ఔషధ గుణాలు సకల రోగాలను నివారిస్తాయి కాబట్టి. ఆరోగ్యపరంగా, సౌందర్యపరంగా తులసి చేసే మేలు అంతా ఇంతా కాదు. లక్ష్మి తులసి, కృష్ణ తులసి అని రెండు రకాలుగా పిలువబడే ఈ తులసి వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసుకుందామా..?
మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో...

కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి..అధిక వత్తిడికి లోనవుతుంటారు. దీనితో నొప్పిని నివారించడానికి మందులు వాడుతుంటారు. కానీ ఇలా వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసినా మందులు వేసుకుంటూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికి కొన్ని టిప్స్...

  • అల్లం ముక్కను తీసుకుని దానిని మెత్తగా చేసి నీళ్లలో వేయాలి. ఇలా ఐదు నిమిషాల...

కీరదోస మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. చాలా మంది చలికాలం కదా అని వీటిని దూరం పెడతారు. రక్తపోటులో తేడా ఏర్పడిన వారు దోసకాయ తినడం మంచిది. అందులోని పొటా షియం రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. దోసకాయలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. కళ్లకింద నల్లటి చారలను కీరదోస కాయ ముక్కలు తొలగిస్తాయి. కీర దోసకాయని తీసుకొని అరకప్పు పెరుగులో కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాలు...

అవునండి..పొడవుగా ఉన్న వారే 'గట్టి' వారని ఓ సర్వే వెల్లడించిదంట. పొట్టిగా ఉన్నవారికే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ ఇదంతా ఉట్టిదేనని తేలిపోయింది. పొడవైన వారే సక్సెస్ ఫుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తారంట. పొట్టిగా..లావుగా ఉండే వారి జీవితాలు ఏమంత సంతృప్తికరంగా ఉండవని ఈ అధ్యయనం తేలింది. పొట్టివారికి విద్యాబుద్ధులు కూడా పెద్దగా అబ్బవంట కూడా. పొట్టి వారి జీవన ప్రమాణాలు...

ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్ని, పండ్లని మించినవి లేవన్న సంగతి మనకు తెలిసిందే. కానీ అలాంటి వాటిలో కొన్ని కూరగాయలు ఎంతో ప్రాముఖ్యం కలవి ఉన్నాయి. వాటితో చేసిన కొన్ని జ్యూస్‌ల గురించి..
బీట్‌రూట్‌: తరచూ నీరసంగా అనిపిస్తుంటే బీట్‌రూట్‌ రసం తాగడం అలవాటు చేసుకోవాలి. కనీసం రెండు మూడు రోజులకోకసారైనా గ్లాసుడు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే చాలని అంటున్నారు...

రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. భావోద్రేకాలు అదుపులో ఉంటాయి.

ఆహారం : పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించు కోవచ్చు. విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్‌ అధికంగా లభించే చేపలు...

ఆహ్లాదాన్నిచ్చే అందం మందార పూల సొంతం. పూలే కాదు ఆకులూ, వేళ్లూ.. ఇలా అన్నింటిలోనూ ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అందాన్ని మెరుగుపరిచే సుగుణాలూ అధికమే. వయసుపైబడే లక్షణాలను నిలువరించే శక్తిమంతమైన మొక్క మందారం. అందుకే దీన్ని బొటాక్స్‌ ప్లాంట్‌ అనికూడా పిలుస్తారు. చర్మానికి సాగే గుణాన్ని అందించి యవ్వనశోభతో మెరిసిపోయేలా చేసే లక్షణాలెన్నో ఈ మొక్కలో ఉన్నాయి. ముఖ్యంగా దీనిలోని యాంటీ-...

ఆరోగ్యంగా ఉండాలంటే మిటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు లోపించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో 'డి' విటమిన్ కూడా ప్రధానం. ఇది లోపిస్తే రకరకాల సమస్యలు మొదలవుతాయి. మరి ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి చూద్దాం...
కొందరికి క్షణక్షణానికి మన:స్థితి మారిపోతుంటుంది. ఈ సమస్య తరచూ కనిపెడుతుంటే అది విటమిన్ డి లోపం అని భావించాలి.
...

వర్షాకాలం సీజన్ లో ప్రజలను అనేక రోగాలు వణికిస్తుంటాయి. జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. డెంగీ..మలేరియా..తదితర వ్యాధులు పట్టి పీడిస్తున్నాయి. ప్రస్తుతం రోగుల్లో 'ప్లేట్ లెట్స్' తగ్గిపోతుండడం ఆందోళనకరంగా మారుతోంది. ప్లేట్ లెట్స్ తగ్గిపోతుండడంతో వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ ప్లేట్ లెట్స్ పై అవగాహన అవసరమని వైద్యులు...

కాలానికనుగుణంగా ప్రకృతి మనకు వివిధ రకాల ఫలాలను ఇస్తుంటుంది. వేసవి వచ్చిందంటే పుచ్చకాయలు, తాటి ముంజలు, మామిడి పండ్లు వచ్చేస్తాయి. ప్రస్తుతం పుచ్చకాయలు వచ్చేశాయి. మృదువుగా, తీయగా, రసపభరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు క్యాన్సర్‌కి, అలాగే...

కాఫీయే కదా ఎన్నిసార్లు తాగితే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం మీకు ఊబకాయం తప్పదని వైద్యులు అంటున్నారు. కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నా కూడా, అతి కాఫీ శరీర బరువు పెరగడానికి కారణం అవుతుందని తాజా అధ్యయనం తేల్చింది. తరచూ కాఫీ తీసుకోవడం వల్ల కేవలం ఊబకాయమే కాకుండా కొన్ని రకాలైన మొండి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని వెస్టరన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు...

శరీరంలోని జీర్ణవ్యవస్థ, మెటబాలిజం, ఇమ్యునిటీ, పోషకాల నిలువ వంటి ప్రధాన ప్రక్రియలు సజావుగా సాగడానికి లివర్‌ బాధ్యత తీసుకుంటుంది. ఈ వ్యవస్థలన్నీ ఆరోగ్యంగా ఉండాలంటే, కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. కాలేయం శరీరంలోని హానికారక మలినాలతోపాటు రక్తంలోని మలినాలను కూడా తొలగిస్తుంది. రక్తంలోని పోషకాలను తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాదు కొన్ని విటమిన్స్ ఐరన్‌ వంటి వాటిని నిలువచేస్తుంది...

వర్షాకాలం..సులువుగా వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీసుకొనే ఆహారంలో మెలుకవలు అవసరం. గాలిలో పెరిగిన తేమ శరీరంలో వేడిని పెంచుతుంది. వాతావరణ ప్రభావం వల్ల ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతుంటారు. జీర్ణశక్తి బలహీనమవుతుంటుంది. సో..కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది.
వానాకాలంలో చల్లగా ఉంటుంది కనుక వేడి వేడి పదార్థాలను తినాలని అనిపిస్తుంటుంది. అందులో ముఖ్యంగా పానీ...

చెమట చుక్కతో ఆర్యోగం ఎలా తెలుస్తుంది. ప్రస్తుతం సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిందే. రోజుకో పరికరం మార్కెట్ లో లభ్యమౌతున్నాయి. అందులో ఆరోగ్యం గురించి ఎన్నో వస్తువులు దొరుకుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన పలు యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నార్త్ వెస్టర్న్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ స్టిక్కర్ ను తయారు చేశారు. చెమట చుక్కతో ఈ స్టిక్కర్ ఆరోగ్యాన్ని...

కంప్యూటర్‌ దగ్గర ఎక్కువ సేపు కూర్చొని పని చేసినా, ఎక్కువ సేపు చదివినా, బండిపై వేగంగా ప్రయాణం చేసినా చాలా మందికి కంటి నుండి నీరు కారుతుంది. ఈ సమస్య ఉన్న వారికి త్వరగా చూపు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్య నుంచి కొంతమేరకైనా విముక్తి పొందాలంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
కంప్యూటర్‌పై ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వారు, ఎక్కువ...

Pages

Don't Miss