హెల్త్

శనగలు...వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మహిళలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంటాయి. శనగలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. మరి శనగల్లో ఉన్న పోషకాల విలువలు ఏంటో తెలుసుకోవాలంటే చదవండి..
ఫొలేట్, మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటాయి. ఇవి శరీరంలోని అమినోయాసిడ్ ప్రభావాన్ని తగ్గించి గుండెలోని రక్తనాళాలు మూసుకపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది....

మానవ జీవితంలో పెరిగిన వేగం కారణంగా కలుగుతున్న ఒత్తిడి, ఆహార విహారాలు, ఎంత మాత్రం శారీరక శ్రమ లేని జీవన శైలి వంటి అనేక కారణాలతో వచ్చే ఈ సమస్య మరేదో కాదు అసిడిటి.మన సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సర్వసాధారణ సమస్య ఇది. ఇంకా చెప్పాలంటే మధుమేహం, హైబీపీ, గుండె జబ్బుల కంటే కూడా ఎక్కువగా విస్తరించిపోయిన అతిపెద్ద బాధ ఇది. ఒకప్పుడు దీనికి ఏవేవో చిట్కా వైద్యాలూ, యాంటాసిడ్‌ మాత్రలూ...

కార్యాలయాలు...అపార్ట్ మెంట్లు..ఇతర్రా వాటిల్లో లిఫ్ట్ కామన్ అయిపోయాయి. ఒక అంతస్తుకు వెళ్లాల్సిన ఉన్నా కొంతమంది లిఫ్ట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇది అంత శ్రేయస్కరం కాదని వైద్యులు పేర్కొంటున్నారు. మెట్లు ఎక్కడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని పలు అధ్యయనాల్లో వెల్లడైందంట. మెదడు వయస్సు తగ్గడమే కాకుండా ఎంతో చురుగ్గా పనిచేస్తుందంట. కెనడాలోని కంకార్డియా విశ్వవిద్యాలయానికి చెందిన జాసన్‌...

ఎండలు మండే కాలంలో సూర్య ప్రతాపానికి చర్మం నల్లగా మారిపోవడం సహజం. దీన్నే టాన్‌ అంటారు. ఎండకు జిడ్డు పేరుకుపోయి.. చర్మం కాంతి విహీనంగా మారుతుంది. మరి ఈ సమస్య పోవాలంటే మనకు అందుబాటులో ఉన్నవాటితోనే పరిష్కారం ఉంటుంది అంటున్నారు నిపుణులు..

టమాటా

రెండు టమాటాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసి అరగంటయ్యాక చల్లటి నీళ్లతో...

కురులు..ఆకర్షణీయంగా తయారు కావడంలో శిరోజాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శిరోజాలు సరిగ్గా లేకపోయేసరికి చాలా మందికి విసుగులు కలుగుతుంది. ఇందుకోసంఇ బ్యూటీపార్లర్లు..వివిధ రకాల క్రీంలు వాడుతుంటారు. మరీ ముఖ్యంగా వెంట్రుకలు రాలిపోయే సమస్యను చాలా మంది ఎదుర్కొంటుంటారు. అయితే మెంతులను వాడడం వల్ల శిరోజాల సమస్య తీరే అవకాశం ఉంది.
మెంతులను మందారపూలతో కలిపి మెత్తని పొడిలా చేయాలి....

ప్రపంచవ్యాప్తంగా బాదం వాడకం ఎక్కువే. బాదం గురించి తెలియని వారుండరు.అందం, ఆరోగ్యం ఇలా అనేక రకాలుగా బాదం మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. అత్యధిక పోషకాలున్న బాదం పప్పును రోజూ కనీసం ఐదారు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
బాదంలో మోనోశాచ్యురేటెడ్‌ ఫ్యాటియాసిడ్లు, విటమిన్‌ ఇ ఉంటాయి. ఈ రెండూ గుండెజబ్బుల బారి నుంచి కాపాడుతాయి. బాదంలోని మెగ్నీషియం, బి6 విటమిన్‌-...

పొడిచర్మం కలిగిన వారు చర్మాన్ని శుభ్రపరచుకునేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. ఎన్నో సౌందర్య సాధనాలను వాడుతుంటారు. కానీ కొన్ని టెక్నిక్స్ పాటిస్తే పొడిచర్మం నుండి కాపాడుకోవచ్చు.

  • పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు.
  • మృదువైన చర్మం కలిగినవారైతే...

బలంగా, ఫిట్‌గా తయారవ్వాలంటే వ్యాయామం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి ఎలాంటి వ్యాయామాలు చేయకుండా ఇరవైలలోనే అరవైలా తయారవతున్నారు. ఇలాంటి వారందరూ తగిన శిక్షణ తీసుకొని వ్యాయామాలు చేయడం వల్ల ఫిట్‌గా ఉండటమే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారవుతారు.
మార్పు వస్తుంది: ఆరు నెలల పాటు ప్రతిరోజు వ్యాయామం చేస్తే, కండరాలు బలాన్ని పుంజుకొని వ్యాయామానికి అనుగుణంగా...

ప్రతి రోజూ ఉదయం చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద పాలు చిలకరించి చేత్తో సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే ముఖం మెరిసిపోతుంది. అలాగే చీజ్‌తో కూడా మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. చీజ్‌ను తురిమి, మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన చీజ్‌ను ముఖం, మెడకు అప్లై చేసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే...

థైరాయిడ్.. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతుంటారు. ఈ సమస్య ఉండడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానంగా జుట్టు రాలడం ఒకటి. థైరాయిడ్ గ్రంధిలో ఏర్పడే సమస్యల వలన హార్మోన్ లో ఏర్పడే అసమతుల్యతల ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు కలుగుతాయి. వీటి వలన కలిగే సమస్యలలో వెంట్రుకలు రాలటం కూడా ఒకటని వైద్యులు పేర్కొంటున్నారు. థైరాయిడ్ హార్మోన్ లో ఏర్పడే...

హైదరాబాద్ : దీర్ఘకాలికం (సుమారు పదేళ్లు) గా జలుబు, దగ్గు, తుమ్ములు ఉంటే ఆ బాధ చెప్పనలవి కాదు. ఇంతకాలంగా ఈ లక్షణాలు ఉండటాన్ని వైద్య పరిభాషలో అలర్జీ అని పరిగణిస్తారు. చల్లదనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. దీనికి హోమియోలో చికిత్స ఉందా? అంటే, ఉందని చెప్తున్నారు హోమియో నిపుణులు. ఆ వివరాల్లోకి వెళితే..

అలర్జీ అనే మాటను...

వేడి ఇప్పుడిప్పుడే కాస్త పెరుగుతోంది. ఈ ఎండల్లో దాహం తీర్చుకోవడానికి రకరకాల పానియాలు తాగుతుంటాం. అయితే అన్నింటిలోకి మజ్జిగ చాలా ఉత్తమమైనదని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే ఊబకాయ సమస్య నుండి విముక్తి పొందవచ్చని నిపుణులు అంటున్నారు. మజ్జిగలో విటమిన్‌ బి12, పొటాషియం, ఫాస్పరస్‌, కాల్షియం ఉంటాయి. ఊబకాయ నివారణకు...

శరీరంలోని ఎముకలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ధృడంగా ఉంటేనే పనులు చేయగలం..ఏదైనా చేయగలం. ఎముకలు ధృడంగా లేకపోతే పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. ఎముకలు ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి ? సరైన డైట్ పాటించకపోవడం..వ్యాయామం చేయకపోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉండవు. ఎప్పుడు ఎముకలు బలహీనం అవుతాయో కదలికలు ఇబ్బందిగా మారుతాయి. ఎముకలకు విటమిన్‌ డి క్యాల్షియం అవసరం ఉంటుంది.

  • గ్లాసుడు పాలు రోజూ...

కొంతమంది మహిళలకు పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి..అధిక వత్తిడికి లోనవుతుంటారు. దీనితో నొప్పిని నివారించడానికి మందులు వాడుతుంటారు. కానీ ఇలా వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయం తెలిసినా మందులు వేసుకుంటూ అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికి కొన్ని టిప్స్...

  • అల్లం ముక్కను తీసుకుని దానిని మెత్తగా చేసి నీళ్లలో వేయాలి. ఇలా ఐదు నిమిషాల...

ప్రస్తుత కాలంలో మహిళలు చర్మాన్ని, అందాన్ని కాపాడుకోవడం కోసం మార్కెట్‌లోకి వచ్చే వివిధ రకాల సౌందర్య సాధనాలు, క్రీములను వాడుతుంటారు. ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మహిళలు వాడే వివిధ రకాల సౌందర్య సాధనాల వల్ల గర్భంలోని శిశువుకు కూడా హాని కలుగుతున్నట్టు వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు కూడా వివిధ రకాల క్రీమ్‌లు, పర్ఫ్యూమ్‌లు, వంటి కాస్మొటిక్స్‌ను...

వంటల కొరకు నాన్‌ స్టిక్‌ పాత్రలు వాడడం సర్వసాధారణంగా మారిపోయింది. ఎందుకంటే వీటిలో నూనె వాడకం తక్కువ. అలాగే చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకే ఎక్కువ మంది వంటకు నాన్‌స్టిక్‌ పాత్రలనే వాడుతున్నారు. కానీ...ఈ పాత్రలు సరిగ్గా ఉపయోగించుకోకపోతే పలు ప్రమాదాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఇవి బాగుండాలంటే కొన్ని చిట్కాలు..
పాత్రలో నీటిని పోసి కొద్ది సమయం నాననివ్వాలి. తర్వాత...

చిలకడదుంప అనేది, ఎల్లపుడు లభించే, చవకైన, ప్రకృతి సిద్ద మరియు అధిక మొత్తంలో బీటా కెరోటిన్'లను కలిగి ఉండే ఆహార పదార్థంగా చెప్పవచ్చు. దీనిని తినటానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. పిండిపదార్థాలను కలిగి ఉండి, అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉంటుంది. ఇవి పోషకాలను కలిగి ఉండటమే కాకుండా, వివిధ రకాలుగా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని గనిసిగడ్డలు అని కూడా...

అల్లం..ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. నిత్యం మనం వంటకాల్లో ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడవని నిపుణులు పేర్కొంటున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల కొవ్వు కరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
రోజులో కనీసం ఒక లీటర్ వరకైనా జింజర్ వాటర్ తాగాలి. నిత్యం ఈ వాటర్ ను తాగుతుంటే కొద్ది రోజుల్లో అధికంగా పేరుకపోయిన కొవ్వు కరుగుతుందంట.
అల్లం ముక్కను ఎండబెట్టి పొడి...

ఆరోగ్యంగా ఉండాలంటే మిటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్లు లోపించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇందులో 'డి' విటమిన్ కూడా ప్రధానం. ఇది లోపిస్తే రకరకాల సమస్యలు మొదలవుతాయి. మరి ఈ విటమిన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో ఒకసారి చూద్దాం...
కొందరికి క్షణక్షణానికి మన:స్థితి మారిపోతుంటుంది. ఈ సమస్య తరచూ కనిపెడుతుంటే అది విటమిన్ డి లోపం అని భావించాలి.
...

ఈ రోజుల్లో గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య లేనివారు అతి తక్కువ మంది. దీనికి గల ముఖ్య కారణం మారిన జీవనశైలి విధానమే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక యంత్రాలతో పరిగెడుతూ వేళకు ఆహారం తీసుకోక, ఒక వేళ అహారం తీసుకున్నా క్షణాలలో హడావిడిగా ముగించటం, దీనితో పాటుగా తీవ్ర మానసిక ఒత్తిడి, రాత్రి సరిగా నిద్రపట్టక పోవడం, ఆలోచనలతో మనసు నిలకడ లేకుండా పరిగెత్తడం, కారణం లేకుండానే కోపం రావటం వంటి మానసిక...

ఉరుకులు పరుగులతోనే జీవితం సాగిపోతుంది.ఉదయం నిద్రలేవగానే రెడీ అవ్వడం, కాలేజీ, ఆఫీసులంటూ పరుగుతీస్తూ ఆరోగ్యం, అందంపై శ్రద్దపెట్టే సమయం లేకుండా పోయింది. అలాంటప్పుడు ఫంక్షన్స్‌కు హఠాత్తుగా వెళ్ళాల్సి వస్తే మీ ముఖం డల్‌గా.. నిర్జీవంగా.. కనిపిస్తుంది. అప్పటికప్పుడు పార్లర్లకు, స్పాలకు వెళ్లలేం. మనకు మనం రెడీ కావాల్సిందే. అప్పుడు హడావుడిగా వెళ్లడానికి ఏదో ఒక మేకప్‌ వేసుకుని...

కాఫీయే కదా ఎన్నిసార్లు తాగితే ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం మీకు ఊబకాయం తప్పదని వైద్యులు అంటున్నారు. కాఫీతో కొన్ని రకాలైన ప్రయోజనాలున్నా కూడా, అతి కాఫీ శరీర బరువు పెరగడానికి కారణం అవుతుందని తాజా అధ్యయనం తేల్చింది. తరచూ కాఫీ తీసుకోవడం వల్ల కేవలం ఊబకాయమే కాకుండా కొన్ని రకాలైన మొండి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముందని వెస్టరన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు...

ఫేషియల్‌ అనగానే పార్లర్‌కు పరిగెత్తి పర్స్ ఖాళీ చేసుకుంటారు చాలామంది. సింపుల్‌ ప్యాక్స్ తో ఇంట్లో పార్లర్‌లాంటి నిగారింపు పొందవచ్చు. ఇంట్లోనే సహజంగా చేసుకోగలిగే ఫేస్‌ ప్యాక్స్ కొన్ని..

బొప్పాయితో...
చర్మానికి మెరుపునిచ్చే పండ్లల్లో బొప్పాయి ఒకటి. ఈ బొప్పాయి మాస్క్‌ తయారు చేసుకోవడానికి.. మూడు ముక్కలు బాగా పండిన బొప్పాయి తీసుకుని... దానికి రెండు...

వర్షాకాలం..సులువుగా వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీసుకొనే ఆహారంలో మెలుకవలు అవసరం. గాలిలో పెరిగిన తేమ శరీరంలో వేడిని పెంచుతుంది. వాతావరణ ప్రభావం వల్ల ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతుంటారు. జీర్ణశక్తి బలహీనమవుతుంటుంది. సో..కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం మంచిది.
వానాకాలంలో చల్లగా ఉంటుంది కనుక వేడి వేడి పదార్థాలను తినాలని అనిపిస్తుంటుంది. అందులో ముఖ్యంగా పానీ...

శరీర అవయవాలతో పాటు పళ్ళను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వుందంటున్నారు డాక్టర్లు. పళ్ళను సరిగా శుభ్రం చేసుకోకపోతే వాటిపై మరకలు పేరుకు పోయి చివరికి దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి.
పళ్ళపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిలాడాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
బేకింగ్‌ సోడా :పడుకునే ముందు టూత్‌ పేస్టుపై చిటికెడు బేకింగ్‌ సోడా చల్లి బ్రష్‌ చేయాలి....

అవునండి..పొడవుగా ఉన్న వారే 'గట్టి' వారని ఓ సర్వే వెల్లడించిదంట. పొట్టిగా ఉన్నవారికే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని భావిస్తుంటాం. కానీ ఇదంతా ఉట్టిదేనని తేలిపోయింది. పొడవైన వారే సక్సెస్ ఫుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తారంట. పొట్టిగా..లావుగా ఉండే వారి జీవితాలు ఏమంత సంతృప్తికరంగా ఉండవని ఈ అధ్యయనం తేలింది. పొట్టివారికి విద్యాబుద్ధులు కూడా పెద్దగా అబ్బవంట కూడా. పొట్టి వారి జీవన ప్రమాణాలు...

శరీరంలో అత్యంత సున్నితమైనవి కళ్లు అని మనకందరికీ తెలుసు. అయినా మనలో చాలామంది కళ్లని గురించి పెద్దగా పట్టించుకోరు. సున్నితమైన కళ్ల పట్ల నిర్లక్ష్యం వహించడం అనర్ధాలకు దారి తీస్తుంది. వేసవిలోనైతే ప్రత్యేకమైన శ్రద్ధ చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కూలింగ్‌ గ్లాసెస్‌ పెట్టుకునే వెళ్లాలి. నాణ్యత కలిగిన అద్దాలు, కంటికి వేడిగాలితగలకుండా కన్ను మొత్తాన్ని కప్పి ఉంచే అద్దాలను...

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తినే ఆహారం ఏంటీ ? ఠక్కున అన్నం అంటారు. అవును మన ప్రాంతంలో ప్రధాన ఆహార పంట. కానీ ప్రస్తుతం తెల్లగా రెండు..మూడరుసార్లు పాలిష్ చేసిన అన్నం తింటున్నారం. పోషకాలన్నీ పాలిష్ లో వెళ్లిపోయి రోగాలు మాత్రం మనకు మిగులుతున్నాయి. అందుకే 'బ్రౌన్' రైస్ బెస్ట్ అంటున్నారు వైద్యులు. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం అని అర్థం. మరి ఈ రైస్ తినడం వల్ల ఎలాంటి...

రోజుకి ఎనిమిది నుంచి పదిగంటల పాటు నిద్రపోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సరిపడ నిద్రపోవడం వలన హార్మోన్లు సమతుల్యం అవుతాయి. భావోద్రేకాలు అదుపులో ఉంటాయి.

ఆహారం : పోషకాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని త్వరితగతిన పెంపొందించు కోవచ్చు. విటమిన్లు, మినరల్స్‌ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుచుకోవచ్చు. మినరల్స్‌ అధికంగా లభించే చేపలు...

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. రోజూ తెల్లవారుజామున పరగడుపున కొబ్బరి బొండాం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కొబ్బరి బోండాంలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ. డయాబెటిస్‌ను నియంత్రించే శక్తి ఎక్కువ. ఇంకా క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుంది. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉంటాయి. అలాగే కామెర్లకు కూడా కొబ్బరి నీళ్లు చెక్‌ పెడతాయి. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలున్న...

జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? లేదా మెమరీలాస్‌ లేదా ఆల్జీమర్స్‌ వస్తుందేమోనన్న సందేహంలో ఉన్నారా? అయితే ఖర్చులేకుండా మెదడు ఫిట్‌నెస్‌ పెంచే సులువైన మార్గం ఒకటుంది. అదే మెడిటేషన్‌, యోగా. వీటిని రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌ చేయడం వల్ల ఆల్జీమర్స్‌ తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన ఓ కొత్త అధ్యయనం చెబుతోంది. యోగా, మెడిటేషన్‌వల్ల...

ప్రకృతి ప్రసాదించిన వనమూలికల్లో అలం ఒకటి. భారతీయులు దాదాపు 5000 సంవత్సరాల నుంచి అల్లాని వంటల్లోనే కాదు.. అనేక ఔషధాల తయారీల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అల్లం దుంప లేదా వేరులాంటిది. ఇందులో విటమిన్స్ మరియు మాంగనీస్ మరియు కాపర్ వంటి విలువైన పోషకాలున్నాయి. దీంతో అద్భుతమైన వైద్యం చేవచ్చని నాటు వైద్యులు చెపుతారు. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనవాయితీ. ఆసియా...

వర్షాకాలం..సీజనల్ వ్యాధులకు కాలంగా చెప్పవచ్చు. అనేక రోగాలు ఈ కాలంలో వస్తుంటాయి. రోగాలు రాగానే వైద్యుల దగ్గరకు పరుగుడుతుంటారు. జ్వరం..చిన్న రోగాలకు కూడా యాంటీ బయోటిక్స్ మందులు ఇస్తున్నారు. కానీ యాంటీబయోటిక్స్ సహజంగానే దొరుకుతుంటాయి. పసుపు..తేనే, వెల్లుల్లి, అల్లం లాంటివి కొన్నింటిని మనంలో వంటల్లో వాడుకోవాలి.
అల్లం : ఇందులో యాంటీబయోటిక్ గుణాలు...

రేగిపళ్ళు అనగానే చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయా? రేగిపళ్లులో చిట్టిరేగి, పెద్దరేగి, గంగిరేగి ఇలా అనేక రకాల జాతులు ఉన్నాయి. ఇప్పుడు చెట్లు లేవు, ఆ ఉత్సాహము లేదు కాని ఈ పుల్లని రేగిపళ్ళు మాత్రం తినాలని అన్పిస్తుందా? అస్సలు అందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో మీకు తెలుసా? అవేంటో చూద్దాం.. రేగిపండ్ల జ్యూస్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి అధికం. రేగిపండ్లను...

పిండివంటల్లో విరివిగా వాడే బెల్లం నిజానికి ఒక గొప్ప ఔషధం. ఇందులో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. దీన్ని అప్పుడప్పుడు కాకుండా తరచుగా ఆహారంలో భాగంగా తీసుకోవడం అత్యవసరమని కూడా అనిపిస్తుంది. ఇందులో ఉన్న మంచి లక్షణాలు..

  • జీర్ణక్రియకు పనికొచ్చే ఎంజైములు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. పేగుల పనితీరుని మరింత ఉత్తేజపరుస్తుంది. అందుకే బెల్లం మలబద్దకానికి...

జూన్‌ వచ్చేసింది. ఇంకొద్ది రోజుల్లో స్కూల్స్‌ ప్రారంభమవుతాయి. ఈ విషయం గుర్తుకొస్తేనే తల్లిదండ్రులకు టెన్షన్‌. సెలవులు ముగిసిన తర్వాత మళ్ళీ స్కూల్‌కి వెళ్ళాలంటే పిల్లలు మారాం చేస్తారు. ఇక మొదటిసారి స్కూల్‌కి వెళ్ళే పిల్లల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అసలు పిల్లల్లో స్కూల్‌ఫోబియా ఎందుకు వస్తుందో తెలుసుకుందాం..
ప్రస్తుతం తల్లిదండ్రులు...

వేసవిలో బయట అతిగా తిరగడం, తినడం ఈ రెండూ పూర్తిగా తగ్గిస్తే చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. ఆయిల్‌స్కిన్‌ ఉన్నవారిపై మాత్రం ఎండ ప్రభావం స్వల్పంగా ఉంటుంది. వేసవిలో ప్రత్యేక దుస్తులు ధరించాలి. పాలిస్టర్‌, టెరీకాటన్‌, పట్టునైలాన్‌, షిఫాన్‌ వంటి చీరలను అస్సలు ధరించకూడదు. సాధ్యమైనంత వరకు నూలు చీరలు మామూలు కాటన్‌ చీరలు వాడటం శ్రేయస్కరం. అలాగే వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులు...

కళ్లు..మనిషికి కళ్లు ఎంతో ముఖ్యం. కళ్లకు కలిగే నిరంతర శ్రమను అంచనా వేయలేం. నేటి ఆధునిక జీవితంలో ఎక్కువగా చదవడం..రాయడం..టీవీ చూడడం..కంప్యూటర్ పై పనిచేయడం...ఇలా కంటితో ముడిపడే పనులను ఎన్నో చేస్తున్నాం. కళ్లకోసం ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన రాదు. దీనితో కంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? కొన్ని చిట్కాలు మీ కోసం...

గంటకు మించి...

హైదరాబాద్ : తమలపాకు లేదా నాగవల్లి భారతదేశంలో విరివిగా ఉపయోగించే తాంబూలంలో ముఖ్యమైన భాగం. ఈ ఎగబ్రాకే మొక్కను తేమగల వేడి ప్రదేశాలలో పెంచుతారు. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో...

ఖర్జూరం..ఈ పండ్లలో అధిక మోతాదులో కార్బొహైడ్రైట్స్ ఉంటాయి. ఈ పండును తినండం వల్ల ఇన్ఫెక్షన్లను తట్టుకొనే వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా రక్తస్రావాన్ని అరికడుతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరం చేస్తాయి. ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకోవడం వల్ల జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలో రాళ్లను కూడా కరిగించే...

ముల్లంగి (ర్యాడిష్) ఆ పేరు వింటేనే మూడు ఆమడల దూరం పరుగెడతారని సామెత. కానీ ఆ ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మన సొంతం. ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును . ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి. ఆ వివరాలు తెలిస్తే, వాటిని ఏదో ఒక రూపంలో...

కోడిగుడ్డు..రోజుకు ఒకసారి తినండి..ఆరోగ్యంగా ఉండండి అంటూ టీవీల్లో...ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు వస్తుంటాయి. కోడిగుడ్డు బలవర్ధకమైన ఆహారం కావడంతో పలువురు వీటిని తినడానికి ఆశక్తి చూపుతుంటారు. కానీ ఈ కోడి గుడ్లు మంచివేనా ? అనే సందేహం మాత్రం రాదు.
ఈస్ట్రోజన్ తో తయారైన ఎగ్స్ తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలు కూడా ఉంటాయి.
కోడిగుడ్డుకు షైన్ కొద్దిగా త‌క్కువ‌గా...

టమాటాలను మనం కేవలం ఆహార పదార్థంగా లేదా సౌందర్య సాధనంగా మాత్రమే ఉపయోగిస్తుంటాం. అయితే టమాటా మంచి క్లీనింగ్‌ ఏజెంట్‌ కూడా. టమాటాలకు పై పొరను తీసేసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేయండి. దానికి కొంచెం మెత్తటి ఉప్పును చేర్చి, స్టవ్‌ మీద, ఫ్లాట్‌ ఫామ్‌ మీద పడ్డ మొండి మరకల మీద రాసి, కాసేపటికి పొడిబట్టతో తుడిచేస్తే.. మరకలు తొలగిపోతాయి. అంతేనా.. స్టీలు గిన్నెలు తెల్లగా మారాలన్నా...

బియ్యం పిండితో వంటలతో పాటు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ పిండిని శరీరానికి అప్లై చేయడం ద్వారా లాభాలు కలుగుతాయి. పాతకాలంలో చర్మ రక్షణకు దీనినే ఎక్కువగా వాడేవారంట. ఇది చర్మంపై ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మరి దీనిని ఎలా వాడాలి ?
బియ్యం పిండి..ఓట్ మీట్..పాల పొడి మిశ్రమాలను కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో స్కిన్ టోన్ చాలా అందంగా బ్రైట్ గా మారుతుంది.
బాగా పండిన అరటి...

చాలా మంది అవసరమైనవి తినకుండా నోటికి రుచిగా ఉండే నూడుల్స్‌, చాక్లెట్స్‌ పెడుతుంటారు పిల్లలకు. అయితే ముఖ్యంగా ఆడ పిల్లలకు కాల్షియం చాలా ఎక్కువగా లభిస్తేనే శక్తి అందుతుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు మీకోసం. మన దేశంలో 40శాతానికి పైగా పిల్లలు క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. తగినంత క్యాల్షియం ఉంటేనే ఎముకల పటిష్టత...

ఆరోగ్యానికి వ్యాయామం మంచిదే. అందుకే చాలామంది ఉదయమో, సాయంత్రమో నడవడం అలవాటు చేసుకుంటారు. అయితే రోజు వారీ వ్యాయామంతో పాటు వారానికి ఐదు రోజుల పాటు రోజుకి ఐదు నిమిషాల చొప్పున పరిగెత్తితే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల మహిళలు ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, బీపీ, పక్షవాతం, క్యాన్సర్‌.. వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ ఐదు నిమిషాల పరుగుతో ఈ రోగాలను...

తమలపాకు..తాంబూళం..పూజలకు మాత్రమే ఉపయోగించరు. ఇది ఔషధంగా కూడా పనిచేస్తుంది. నిత్య జీవితంలో తమలపాకును ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం..
తమలపాకు రసాన్ని 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి. ప్రతి రోజూ కొన్ని తమల పాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను...

Pages

Don't Miss