త్రిపురలో భారీ వర్షాలు : కూలిన వందలాది ఇళ్లు

Submitted on 26 May 2019
Heavy rains in Tripura..Hundreds of homes collapsed

తెలుగు రాష్ట్రాలలో ఎండలు మంట పుట్టిస్తుంటే త్రిపురలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. త్రిపురలో ఉనాకోటి, ధలాయ్ లతో పాటు పలు జిల్లాలను వరదలు ముంచెత్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు పాంతాల్లో విద్యుత్ నిలిచిపోయాయి. ఈ వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వరదలు సంభవించే సూచనలు కనిపిస్తున్నాయ. దీంతో 22 ఎన్డీఆఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 

ఈ క్రమంలో 1000కి పైగా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలల్లో నిరాశ్రయులు తలదాచుకుంటున్నారు. 24 గంటలుగా కురుస్తున్న  కుండపోత వర్షాలతో 1,039 ఇళ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. కాగా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. మొత్తం 40 బోట్లను ఏర్పాటు చేసి బాధితులను సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. కాగా గత 24 గంటల్లో వర్షాలు లేకపోవటంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు యత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. 

Tripura
HEAVY Rains
1039
homes
Collapsed

మరిన్ని వార్తలు