గాల్లో గింగిరాలు తిరిగి నదిలో కుప్పకూలిన హెలికాప్టర్

Submitted on 16 May 2019
http://www.10tv.in/shaavukaru-janaki-about-sr-ntr-12298

న్యూయార్క్ లో ఓ హెలికాప్టర్ నదిలో కుప్పకూలిపోయింది. న్యూయార్క్ లోని హడ్సన్ నది దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ఫ్యూయల్ నింపుకున్న చాపర్ కొంత సేపటికే గాల్లో చక్కర్లు కొట్టుకుంటూ హడ్సన్ నదిలో కుప్పకూలింది.

కాగా ఫ్యూయల్ నింపుకున్న అనంతరం గాల్లోకి ఎగిరిన చాపర్ లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చి కంట్రోల్ తప్పి నదిలో కూలిపోయినట్లుగా తెలుస్తోంది.  ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది,వాటర్ సేఫ్టీ అధికారులు హుటాహుటిన  స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు సురక్షితంగా బైటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమా లేకి వేరే కారణమేదైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
 

newyork
Hudson River
helicopter crash

మరిన్ని వార్తలు