బంట్రోతు అన్న చెవిరెడ్డి: చంద్రబాబు ఆగ్రహం.. బొట్టు, చీర పంపాలా? అంటూ జగన్ కౌంటర్

Submitted on 13 June 2019
hevireddy Bhaskar Reddy Sensational Comments On Achema Naidu

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో స్పీకర్‌గా తమ్మినేని సీతారాం కూర్చొన్న తొలిరోజే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. స్పీకర్‌గా తమ్మినేని సీతారాంను అధికర పార్టీ అధినేత జగన్ స్వయంగా దగ్గర ఉండి కూర్చొని పెట్టగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు కాకుండా అచ్చమ నాయుడు రావడంతో ఈ విషయంపై చెవిరెడ్డి ఘూటు వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని, బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని ఆ చైర్‌లో కూర్చొనిపెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదని, అందుకు బంట్రోతును పంపారంటూ అచ్చమనాయుడుని ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. సభలోనే ఉండి కూడా చంద్రబాబు నాయకుడు స్పీకర్ చైర్‌కు గౌరవం ఇవ్వలేదని అన్నారు.

ఇదే విషయంపై మాట్లాడిన చంద్రబాబు అచ్చెన్నాయుడుని బంట్రోతు అంటారా? అంటూ చెవిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. చరిత్రను ఎవరూ మర్చిపోలేరని, పార్టీలు పోటీ చేసుకున్న సంధర్భాలు తప్పతే స్పీకర్‌గా ఎంపిక ఇటువంటి సంధర్భాల్లో గౌరవం ఇవ్వాలని అయితే.. అధికార పార్టీ నాయకుడు కానీ పార్టీకి సంబంధించిన ఎవ్వరు కానీ మా మాట అడగలేదని, ప్రతిపక్ష నాయకుడు వస్తాడని చెప్పి ఉంటే వచ్చేవాడిని అని అయితే గౌరవంగా పిలవలేదని, పిలవని పేరంటానికి ఎలా వస్తాం అని చంద్రబాబు అన్నారు.

అయినా కూడా డిప్యూటీ లీడర్‌ అచ్చెమనాయుడిని వెళ్లమని చెప్పానని, అయితే ఆ డిప్యూటీ లీడర్‌ను పంపిస్తే బంట్రోత్‌ని పంపించానని అహంభావంతో మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఇదే విషయంపై మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. అన్నీ పార్టీల నాయకులు వచ్చి స్పీకర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టమని ప్రొటెం స్పీకర్ అన్నారని, అయితే చంద్రబాబు రాలేదని, మా మాటలను వక్రీకరిస్తున్నారు అని అన్నారు. నాకు బొట్టు పెట్టలేదు.. చీర ఇవ్వలేదు.. అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.  
 

MLA Chevireddy Bhaskar Reddy
AcchemaNaidu
Jagan
Assembly

మరిన్ని వార్తలు