కర్ణిసేన చీఫ్ సంచలన వ్యాఖ్యలు : మేం రఘువంశానికి చెందినోళ్లం

Submitted on 13 August 2019
Hey Ram! Now, Karni Sena chief claims his family descended from Lord Ram's son Luv

అయోధ్య రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ జరుపుతోంది. సీజేఐ రంజన్ గొగోయ్ ఇటీవల విచారణ సందర్భంగా రామ్ లల్లా విరాజ్‌మాన్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ పరాశరన్‌ను ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. అయోధ్యలో శ్రీరాముడి వంశానికి చెందినవారు ఇప్పటికీ ఎవరైనా నివసిస్తున్నారా? అని అడిగారు. అయితే ఈ ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అనేకమంది తాము శ్రీరాముడికి వంశానికి చెందినవారమంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇందులో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. శ్రీరాముడి కుమారుడైన కుశుడి వంశానికి చెందినవారమంటూ జైపుర్‌ రాజవంశీకురాలు,బీజేపీ ఎంపీ దియాకుమారి శనివారం వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సత్యేంద్ర సింగ్ తాము రఘువంశానికి చెందిన వారమంటూ ప్రకటించారు. తాము రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందినవారమని తెలిపారు.సత్యేంద్ర ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు మేవర్‌ రాజకుటుంబానికి చెందిన లక్ష్యరాజ్ సింగ్ కూడా తాము రాముడి కుటుంబానికి చెందినవారమంటూ ప్రకటించారు. తాము రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందినవారమని తెలిపారు.

అయితే ఇప్పుడు రాజస్థాన్ కి చెందిన కర్ణిసేన వ్యవస్థాపకుడు లోకేంద్ర సింగ్ కల్వి కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరారు. తాము కూడా రఘువంశానికి చెందినవారిమేనని తెలిపారు. తాము రాముడి కుమారుడైన లవుడి వంశానికి చెందినవారమని తెలిపారు.

karnisena chief
lord ram
descended
luv
claims
BJP
MP
diya kumari
rajastan

మరిన్ని వార్తలు