హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్ - లిరికల్ సాంగ్

Submitted on 13 June 2019
Horn Pom Pom Okay Please Lyrical song from Kalki

యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్, ఆదాశర్మ, నందితా శ్వేత హీరో హీరోయిన్లుగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. శివాని, శివాత్మిక మూవీస్ సమర్పణలో, హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా.. కల్కి.. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ అండ్ కమర్షియల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇప్పుడు కల్కి నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది.

'హార్న్ పోమ్ పోమ్ ఓకే ప్లీజ్' అనే ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ ట్యూన్ ఇవ్వగా, కృష్ణ కాంత్ లిరిక్స్ రాసాడు. లలితా కావ్య సూపర్బ్‌గా పాడింది. 'నీ లోడు బండి ఆపెయ్ రా, వేడి మీద ఇంజనుంది దించెయ్ రా, ఈ రోడ్డు నా అడ్డారా, సల్ల తాగి సల్లగైపోవేరా.. తెచ్చారా తాటికల్లు, ఎక్కిస్త కిక్కు ఫుల్లు'.. అంటూ సాగే పాట మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది.

దాబా బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ పాటలో రాజశేఖర్, స్కార్లెట్‌తో కలిసి స్టెప్స్ వేసాడు. జూన్ 28న కల్కి రిలీజ్ కానుంది. పూజిత పొన్నాడ, రాహుల్ రామకృష్ణ, అశుతోష్ రాణా, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు నటిస్తున్న ఈ మూవీకి సంగీతం : శ్రవణ్ భరద్వాజ్, కెమెరా : దాశరథి శివేంద్ర, ఎడిటింగ్ : గౌతమ్ నెరుసు, లిరిక్స్ : కృష్ణకాంత్, ఆర్ట్ : నాగేంద్ర, ఫైట్స్ : నాగ వెంకట్, రాబిన్-సుబ్బు, నందు.

Dr. Rajashekar
Shravan Bharadwaj
C Kalyan
Prasanth Varma

మరిన్ని వార్తలు